News


39,630 దిగువన మరింత పతనం

Monday 3rd February 2020
news_main1580700788.png-31450

ఒకవైపు కరోనా వైరస్‌ సంక్షోభంలో విలవిలలాడుతున్న మార్కెట్‌కు వారాంతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గట్టి షాక్‌ ఇచ్చారు. జీడీపీ వృద్ధి రేటును  పెంచడానికి పలు పోత్సాహకాలు ప్రకటిస్తారన్న మార్కెట్‌ అంచనాలు తల్లకిందులుకావడంతో ఇన్వెస్టర్లు ఎడాపెడా విక్రయాలు జరిపారు. ఈ షాక్‌ను పూర్తిగా  డిస్కౌంట్‌ చేసుకోవడానికి మరికొన్ని రోజలు మార్కెట్‌కు పట్టవచ్చు. ఇందుకుతోడు కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగితే డౌన్‌ట్రెండ్‌ తీవ్రతరమయ్యే ప్రమాదం వుంటుంది.     ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి...

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
ఫిబ్రవరి 1తో ముగిసిన ఆరుట్రేడింగ్‌ రోజులవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నిలువునా 39,630 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమయ్యింది. చివరకు అంతక్రితం  వారం ముగింపుతో పోలిస్తే 1878 పాయింట్ల  భారీనష్టంతో 39,735 పాయింట్ల వద్ద ముగిసింది. బడ్జెట్‌ రోజునాటి కనిష్టస్థాయి అయిన 39,630 స్థాయిని  ఈ వారం ప్రారంభంలో కోల్పోతే మార్కెట్‌ పతనం కొనసాగే ప్రమాదం వుంటుంది. ఈ సందర్భంగా 200 రోజుల చలన సగటు (200 డీఎంఏ) కదులుతున్న  39,245 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 38,850-38,700 శ్రేణి వరకూ క్షీణించవచ్చు. ఈ లోపున 38,388  పాయింట్ల వరకూ పతనం కావొచ్చు. ఇక అనూహ్యంగా మార్కెట్‌ ట్రెండ్‌ రివర్స్‌ అయితే తొలుత 40,050 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన  స్థిరపడితే 40,480 పాయింట్ల స్థాయికి, ఆపై 40,710 పాయింట్ల వరకూ ప్రయాణం సాగించవచ్చు. 

11,655 దిగువన నిఫ్టీ బలహీనం...
బడ్జెట్‌ సందర్భంగా వారాంతంలో 11,633 పాయింట్ల కనిష్టస్థాయివరకూ పతనమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ,  చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 586 పాయింట్ల  నష్టంతో 11,662 పాయింట్ల వద్ద ముగిసింది. కీలకమైన 200 డీఎంఏ స్థాయికి సెన్సెక్స్‌ ఇంకా దూరంలో వుండగా, నిఫ్టీ ఇప్పటికే ఆ స్థాయిని (11,655  పాయింట్లు) గత శనివారం ఇంట్రాడేలో కోల్పోయింది. ఈ స్థాయి దిగువన ఈ సోమవారం నిఫ్టీ ట్రేడ్‌ అయితే రానున్న కొద్దిరోజుల్లో మరింత పతనం కావొచ్చు. ఆ  సందర్భంలో తొలుత 11,550-11,490 పాయింట్ల శ్రేణి వరకూ తగ్గవచ్చు. ఈ లోపున కీలకమైన మద్దతు 11,342 పాయింట్ల స్థాయి. ఇది సెప్టెంబర్‌  20 నాటి కనిష్టస్థాయి అయిన 10,670 పాయింట్ల కనిష్టం నుంచి జనవరి 20 నాటి గరిష్టస్థాయి 12,430 పాయింట్ల వరకూ జరిగిన 1,760  పాయింట్ల ర్యాలీకి 61.8 శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్‌ స్థాయి. ఈ మద్దతును సైతం వదులుకుంటే 11,090 పాయింట్ల దిశగా నిఫ్టీ కదలవచ్చు. ఈ వారం  200 డీఎంఏపైన నిఫ్టీ స్థిరపడితే తొలుత 11,760 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 11,880 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని సైతం  అధిగమిస్తే 11,940 పాయింట్ల వరకూ పెరగవచ్చు.  



You may be interested

నేడు సానుకూల ఓపెనింగ్‌- తదుపరి?!

Monday 3rd February 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 32 పాయింట్లు ప్లస్‌ శుక్రవారం యూఎస్‌ మార్కెట్ల పతనం ప్రస్తుతం కుప్పకూలిన చైనీస్‌ షాంఘై ఇండెక్స్‌ నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 32 పాయింట్లు పుంజుకుని 11,686  వద్ద ట్రేడవుతోంది. శనివారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 11,654 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి

బడ్జెట్‌ ప్రభావం, ఆర్‌బీఐ సమీక్ష, ఫలితాలే దిక్సూచీ..

Monday 3rd February 2020

నిరాశపరిచిన బడ్జెట్‌ పతనం ఈ వారంలోనూ కొనసాగే అవకాశం: రెలిగేర్ బ్రోకింగ్ మంగళవారం నుంచి 3 రోజులపాటు ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష టైటాన్, భారతి ఎయిర్‌టెల్, హీరో మోటోకార్ప్, ఐషర్ మోటార్స్, పీఎన్‌బీ ఫలితాలు ఈవారంలోనే.. ముంబై: వారాంతాన జరిగిన ప్రత్యేక ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 988 పాయింట్లు (2.43 శాతం)నష్టపోయి 39,736 వద్ద ముగియగా.. నిఫ్టీ 300 పాయింట్లు (2.51 శాతం) కోల్పోయి 11,662 వద్దకు పడిపోయింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

Most from this category