News


సెన్సెక్స్‌ 38,380 స్థాయిని అధిగమిస్తే....

Monday 23rd September 2019
news_main1569210258.png-28477

కార్పొరేట్‌ పన్ను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎంతవరకూ దోహదపడుతుందో చెప్పలేముగానీ, కార్పొరేట్‌ కంపెనీలు...ముఖ్యంగా 30 శాతంపైన పన్ను బ్రాకెట్‌లో వున్నవాటి లాభాలు తక్షణం​పెరిగిపోతాయి. ఆ కంపెనీలు ఏమీ చేయకుండానే, వ్యవస్థలో డిమాండ్‌ పెరక్కుండానే ఆ కంపెనీల లాభాలు, ఈపీఎస్‌లు 20 శాతం వరకూ ఎగిసిపోతాయన్న వాస్తవాన్ని గ్రహించడంతో గత శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ర్యాలీ జరిపింది. ఆయా కంపెనీల రీరేటింగ్‌ వచ్చే కొద్దిరోజుల్లో జరగడం తప్పనిసరి. విదేశీ ఇన్వెస్టర్లు గత శుక్రవారం స్పాట్‌ మార్కెట్లో నికరంగా కొనుగోలు చేసింది తక్కువమొత్తమే (రూ.35 కోట్లు) అయినా డెరివేటివ్స్‌ విభాగంలో రూ. 7000 కోట్ల విలువైన షార్ట్‌ ఇండెక్స్‌ ఫ్యూచర్లు, స్టాక్‌ ఫ్యూచర్లను కొన్నారు. ఇంకా వారివద్ద పేరుకుపోయిన షార్ట్‌ పొజిషన్లను రానున్న రోజుల్లో వారు కవర్‌చేసుకునే అవకాశం వున్నందున...లాభాల స్వీకరణ పేరుతో కొద్దిపాటి ఒడిదుడుకులు ఏర్పడినా, సమీప భవిష్యత్తులో అప్‌ట్రెండ్‌ కొనసాగవచ్చు.  ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...,

సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
 సెప్టెంబర్‌ 20తో ముగిసిన వారంలో అనూహ్యంగా 35,988 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌...కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ప్రకటన తర్వాత 38,378 పాయింట్ల వద్ద ర్యాలీ జరిపింది. చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 630 పాయింట్ల లాభంతో 38,015 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్లో అప్‌ట్రెండ్‌ కొనసాగితే సెన్సెక్స్‌ తొలుత గత శుక్రవారంనాటి గరిష్టస్థాయి అయిన 38,380 పాయింట్ల వద్ద తొలి అవరోధాన్ని చవిచూడవచ్చు. ఈ స్థాయిని దాటితే వేగంగా 38,690 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన క్రమేపీ 39,060 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే ఛాన్స్‌ వుంటుంది. మార్కెట్లో తక్షణ లాభాల స్వీకరణ జరిగితే గత ఆరువారాల స్వింగ్‌హైఅయిన 37,730 పాయింట్ల వద్ద తొలి మద్దతును పొందవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 37,535 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 37,300 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. 

నిఫ్టీ 11,380 పాయింట్లపైన....
 క్రితం వారం ప్రధమార్థంలో 10,670 పాయింట్ల కనిష్టస్థాయివరకూ పడిపోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం అతిపెద్ద ర్యాలీ జరిపి 11,381 పాయింట్ల వరకూ పెరిగింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 198 పాయింట్ల లాభంతో 11,274 పాయింట్ల వద్ద ముగిసింది. ఈవారం నిఫ్టీ పెరిగితే 11,380 పాయింట్ల సమీపంలో తొలి నిరోధం కలగవచ్చు. ఈ స్థాయిని దాటితే అప్‌ట్రెండ్‌ కొనసాగి వేగంగా 11,460 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన 11,550-11,640 పాయింట్ల శ్రేణివరకూ ర్యాలీ జరిగే ఛాన్స్‌ వుంటుంది. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోతే 11,230 పాయింట్ల సమీపంలో నిఫ్టీకి తొలి మద్దతు లభ్యమవుతున్నది. ఈ స్థాయిని కోల్పోతే  11,180 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున క్రమేపీ 11,100 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు.  You may be interested

భారత్‌లో పెట్టుబడుల వరద

Monday 23rd September 2019

యాపిల్‌ వంటి కంపెనీల చూపు భారత్‌ వైపు  వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గింపు లేదు  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  న్యూఢిల్లీ: కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపుతో భారత్‌లో పెట్టుబడుల వరద పారనున్నదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. చైనా, ఇతర ఆగ్నేయాసియా దేశాలతో పోల్చితే మన దేశంలోనే పన్ను తక్కువగా ఉందని, ఫలితంగా పెట్టుబడులకు భారత్‌ ఆకర్షణీయమైన దేశంగా నిలుస్తుందని  వివరించారు.  చైనా కంటే భారత్‌ మేలు... గతంలో కార్పొరేట్‌ ట్యాక్స్‌ అధికంగా ఉండేదని, మరికొన్ని

ర్యాలీ కొనసాగేనా..!

Monday 23rd September 2019

   సెప్టెంబర్‌ సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు ఈవారంలోనే.. అమెరికా–చైనా వాణిజ్య చర్చలపై ఇన్వెస్టర్ల దృష్టి గురువారం అమెరికా క్యూ2 జీడీపీ గణాకాంలు వెల్లడి ముంబై: దేశీ కార్పొరేట్‌ రంగ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే స్థాయి నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత వారాంతాన ప్రకటించిన నేపథ్యంలో సెన్సెక్స్‌ 1,921 పాయింట్లు, నిఫ్టీ 569 పాయింట్లు లాభపడ్డాయి. గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 2,285 పాయింట్లు,

Most from this category