STOCKS

News


కరోనా వైరస్‌ పరిణామాలు, గణాంకాలు కీలకం

Monday 10th February 2020
news_main1581304704.png-31634

  • పెరుగుతున్న కరోనా మృతులు 
  • కరోనా పరిణామాలపై మార్కెట్‌ అప్రమత్తత
  • రిటైల్‌, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై దృష్టి 
  • చివరి దశ క్యూ3 ఫలితాలు 

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ సంబంధిత పరిణామాలు, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ వారం మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, ప్రపంచ మార్కెట్ల పోకడ, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి తదితర అంశాలు కూడా స్టాక్‌ మార్కెట్‌ కదలికలకు కీలకమని వారంటున్నారు. 

కరోనా కలకలం....
 కరోనా వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి చైనాలో 811కు పెరిగింది. ఇది 2002-03లో ప్రబలిన సార్స్‌ వైరస్‌ మరణాల కంటే అధికం. కరోనా  వైరస్‌ 25 దేశాలకు విస్తరించిందని, 37,000 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారని అంచనా. కరోనా వైరస్‌కు సంబంధించిన ఏమైనా ప్రతికూల వార్తలు వస్తే, మార్కెట్‌పై ప్రభావం తీవ్రంగానే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంచనాలను మించే కరోనా కల్లోలం ఉండే అవకాశాలున్నాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. 


గణాంకాల ప్రభావం...
ఈ నెల 12న డిసెంబర్‌ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడతాయి. అదే రోజు జనవరి నెల రిటైల్‌​‍ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. ఇక శుక్రవారం(ఈ నెల14న) జవనరి నెల టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు, బ్యాంక్‌ డిపాజిట్ల, రుణవృద్ధి సంబంధిత లెక్కలు, విదేశీ మారక ద్రవ్య నిల్వల వివరాలు వస్తాయి. ఈ నెల 11( మంగళవారం) ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. 


చివరి దశ క్యూ3 ఫలితాలు...
డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు చివరి దశకు వచ్చాయి. ఈ వారంలో 2,000కు పైగా కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. దీంట్లో నిఫ్టీ సూచీలోని 9 కంపెనీలున్నాయి. గెయిల్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌, వొడాఫోన్‌ ఐడియా, నాల్కో, భెల్‌, ఆయిల్‌ ఇండియా, హిందాల్కో, నెస్లే ఇండియా, పీఎఫ్‌సీ, సెయిల్‌, అశోక్‌ లేలాండ్‌,  తదితర కంపెనీలు ఈ వారంలోనే ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తున్నాయి. 


కరోనాపై మార్కెట్‌ కన్ను....
వృద్ధి పుంజుకుంటుందని స్పష్టంగా తేలేదాకా, మార్కెట్‌ పరిమిత శ్రేణిలోనే కదలాడుతుందని మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వసీఎస్‌ ఎనలిస్ట్‌ సిద్ధా‍ర్థ ఖేమ్కా అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్‌ సంబంధిత పరిణామాలను మార్కెట్‌ జాగ్రత్తగా గమనిస్తోందని పేర్కొన్నారు. వృద్ధి బాగా ఉండగలదన్న అంచనాలున్న రంగాల షేర్లు పుంజుకుంటాయని వివరించారు. 


బడ్జెట్‌, ఆర్‌బీఐ పాలసీ, కీలక కంపెనీల క్యూ3 ఫలితాలు వంటి ముఖ్యమైన అంశాలు ముగిశాయని శామ్‌కో సెక్యూరిటీస్‌ అండ్‌ స్టాక్‌నోట్‌ సీఈఓ జిమీత్‌ మోదీ పేర్కొన్నారు. ఇక మార్కెట్‌ వాస్తవిక అంశాలకు సర్దుబాటు అవుతుందని వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులో కరోనా వైరస్‌ సంబంధిత పరిణామాలే మార్కెట్‌కు కీలకమని వివరించారు. కరోనా వైరస్‌కు సంబంధించి ప్రపంచ మార్కెట్ల ప్రతిస్పందన మన మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని శామ్కో సెక్యూరిటీస్‌ మరో ఎనలిస్ట్‌ ఉమేశ్‌ గుప్తా పేర్కొన్నారు. 



You may be interested

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?!

Monday 10th February 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 2 పాయింట్లు మైనస్‌ శుక్రవారం యూఎస్‌ మార్కెట్లు డీలా నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో నామమాత్రంగా 2 పాయింట్లు క్షీణించి 12,081 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,083 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కాగా.. జనవరిలో

ఆధార్‌ ఉంటే ఇన్‌స్టంట్‌గా పాన్‌

Monday 10th February 2020

కొత్తగా పాన్‌ కార్డు తీసుకోవాలనుకుంటున్న వారికి శుభవార్త. ఇందుకోసం ఫిజికల్‌గా లేదా ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ను నింపడం, దానికోసం పుట్టిన తేదీ ధ్రువీకరణ, ఇతర ఆధారాలు సమర్పించాల్సిన శ్రమ ఇకపై ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆధార్‌ కార్డు ఉంటే చాలు.. పాన్‌కార్డ్‌ ఇన్‌స్టంట్‌గా జారీ అయిపోతుంది. ఆధార్‌ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇన్‌స్టంట్‌గా పాన్‌ కార్డు జారీ అవుతుందని పొరపడొద్దు. పాన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారికేనని అర్థం చేసుకోవాలి. ఈ

Most from this category