News


సన్‌ఫార్మా బైబ్యాక్‌ ధర రూ.425

Tuesday 17th March 2020
Markets_main1584437367.png-32534

రూ.1700 కోట్లతో సొంత ఈక్విటీ షేర్లను కొనుగోలు(బైబ్యాక్‌) చేయనున్నట్లు మంగళవారం సన్‌ ఫార్మా ప్రకటించడంతో ఒక్కసారిగా షేరు విలువ పెరిగింది. దీంతో తొలుత ఎన్‌ఎస్‌ఈలో సన్‌ఫార్మా షేరు 7 శాతం లాభపడింది. బైబ్యాక్‌లో భాగంగా 4 కోట్ల షేర్లను రూ.425 ధర మించకుండా కొనుగోలు చేసేందుకు  సన్‌ఫార్మా కంపెనీ డైరెక్టర్స్‌ బోర్డు ఆమోదం తెలిపింది. సోమవారం ముగింపుతో పోలిస్తే ఈ ధర 15.48 శాతం ఎక్కువ. కాగా ఈ షేర్లు కంపెనీ మొత్తం షేర్లలో 1.67 శాతానికి సమానం. అయితే ఇందుకు సంబంధించిన పూర్తివివరాలతో కూడిన డేటాను త్వరలోనే విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. ఈ బైబ్యాక్‌ ప్రక్రియలో ప్రమోటర్లు, ప్రమోటర్‌ గ్రూపు సభ్యులు, అక్కడ పనిచేసే ఉద్యోగులు పాల్గొనడానికి అవకాశం లేదని కంపెనీ తెలియచేసింది. ఈ బైబ్యాక్‌ ద్వారా కంపెనీలో ప్రమోటర్ల వాటా 54.69 శాతం నుంచి 55.61 శాతానికి పెరగనుంది. ఇక కంపెనీలో పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ 45.31 శాతం నుచి 44.39 శాతానికి తగ్గనుంది. కాగా ఎన్‌ఎస్‌ఈలో మధ్యహ్నాం 2:50 గంటల ప్రాంతంలో సన్‌ఫార్మా షేరు 3 శాతం పెరిగి 381.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

కుప్పకూలిన జీ, జెట్‌, డెల్టా కార్ప్‌, దివాన్‌

Tuesday 17th March 2020

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు యస్‌ బ్యాంక్‌ కేసు ఎఫెక్ట్‌   సిక్కింలో కేసినో మూతతో డెల్టా కార్ప్‌నకు దెబ్బ ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న యస్‌ బ్యాంక్‌ నుంచి రుణాలు పొందిన సంస్థలు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీల ప్రమోటర్లను ఈ నెల 18న హాజరుకావలసిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. యస్‌ బ్యాంక్‌ ప్రమోటర్‌ రాణాకపూర్‌పై నమోదైన మనీలాండరింగ్‌ కేసు విషయంలో తాజా ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఇదే

భారీ ట్రేడింగ్‌తో ఈ షేర్ల పరుగు

Tuesday 17th March 2020

ఆటుపోట్ల మధ్య లాభాలతో మార్కెట్లు కొన్ని మిడ్‌క్యాప్‌ కౌంటర్లకు డిమాండ్‌ ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. సోమవారం సెన్సెక్స్‌సహా డోజోన్స్‌ వరకూ అమ్మకాల వెల్లువతో కుప్పకూలగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు సైతం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అయితే యూఎస్‌ స్టాక్‌ ఫ్యూచర్స్‌ లాభాలతో కదులుతున్న కారణంగా దేశీయంగానూ సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య సానుకూలంగా ట్రేడవుతున్నాయి. మధ్యాహ్న 1.40 ప్రాంతంలో సెన్సెక్స్‌

Most from this category