News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 1st August 2019
Markets_main1564632550.png-27458

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
పంజాజ్‌ నేషనల్‌ బ్యాంకు:-
సవరించిన మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) నేటి(ఆగస్ట్‌ 01) నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ సారి ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను 10 బేసిస్‌పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే.
సన్‌ ఫార్మా:- జపాన్‌ స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్‌ అయినట్లు తెలిపింది.
విప్రో:- షేర్ల బై బ్యాక్‌ను సెబీ ఆమోదం తెలిపింది. బై బ్యాక్‌ ఇష్యూ ఆగస్ట్‌ 14న ప్రారంభమై, ఆగస్ట్‌ 28న ముగిస్తుంది.
రిలయన్స్‌ క్యాపిటల్‌:- కమర్షియల్‌ పేపర్లపై చెల్లించాల్సిన రూ.3500 కోట్ల మొత్తాన్ని చెల్లించింది. 
హెచ్‌డీఎఫ్‌సీ:- రీటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటును 10శాతం తగ్గించింది. నేటి(ఆగస్ట్‌ 01) నుంచి అమల్లోకి రానుంది. 
యూనికెమ్‌ ల్యాబ్స్‌:- గోవా ఫార్మాస్యూటికల్స్‌ యూనిట్‌ తనిఖీలు పూర్తి చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ 4 అబ్జర్వేషన్లను జారీ చేసింది. 
భాష్‌:- బుదాది యూనిట్‌లో 3రోజుల పాటు కార్యకలాపాలను నిలిపియనుంది. 
జీఎంఆర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌:- ఈక్విటీ షేర్ల జారీ, రుణ సమీకరణ పద్ధతిలో రూ.27,3000 కోట్ల మూలధన నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
మైండ్‌ ట్రీ:- బ్లాక్‌చెయిన్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి కంపెనీ హైపర్‌లెడ్జర్‌ కంపెనీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
భారత్‌ ఎలక్ట్రానిక్స్‌:- ఓపెన్‌ మార్కెట్‌ పద్దతిలో ప్రభుత్వం 7.04 కోట్ల ఈక్విటీ షేర్లను ఏఎంసీకి విక్రయించింది.

నేటి క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- భారతీ ఎయిర్‌టెల్‌, టాటా పవర్‌ కంపెనీ, మారికో, గోద్రేజ్‌ కన్జూ‍్యమర్‌ ప్రాడెక్ట్స్‌, జేకే టైర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యూ హోల్డింగ్స్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్స్‌, వరుణ్‌ బేవరీజెస్‌, కేఆర్‌బీఎల్‌, అడ్‌లాబ్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌, డైనమిక్స్‌ ప్రాడెక్ట్స్‌, హిందూస్థాన్‌ కన్షారియం కంపెనీ, దాల్మియా భారత్‌, మహీంద్ర లాజిస్టిక్స్‌, వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్‌, మాగ్మా ఫిన్‌కార్ప్‌, ఇక్రా, రేమాండ్‌ 



You may be interested

పదేళ్ల తర్వాత వడ్డీ రేట్లను తగ్గించిన ఫెడ్‌

Thursday 1st August 2019

దశాబ్దకాలం తర్వాత యుఎస్‌ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌ బుధవారం వడ్డీ రేట్లను తగ్గించింది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ మందగమన భయాలు, యుఎస్‌ ద్య్రవ్యోల్బణం తగ్గడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఫెడ్‌ తెలిపింది. కానీ మరింత రేట్ల కోత ఉండదనే సంకేతాన్ని ఇచ్చింది. అంతర్జాతీయంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ భయాలు, తగ్గుతున్న యుఎస్‌ ద్రవ్యోల్బణం దృష్ఠ్యా 25 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నామని తన తాజా రెండు రోజుల

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Thursday 1st August 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పొవెల్‌ చేసిన నిరుత్సాహకర వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడటంతో భారత్‌ స్టాక్‌ సూచీలు గురువారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 150 పాయింట్ల నష్టంతో 37,330 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60 పాయింట్ల గ్యాప్‌డౌన్‌తో 11,060 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో వేదాంత, జీ టెలిఫిల్మ్‌, యస్‌బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు 1-2 శాతం మధ్య

Most from this category