News


మార్కెట్‌ను వెంటాడిన వృద్ధి భయాలు

Friday 6th December 2019
news_main1575628780.png-30097

ఆర్థిక వృద్ధి ఆందోళనలతో లాభాల స్వీకరణ
12వేల దిగువున ముగిసిన నిఫ్టీ 
334 పాయింట్లు నష్టపోయి సెన్సెక్స్‌
ఆర్థిక వృద్ధి ఆందోళనతో ఇన్వెస్టర్లు​లాభాల స్వీకరణకు పూనుకోవడంతో శుక్రవారం సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 334 పాయింట్లు నష్టపోయి 40,445 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 104 పాయింట్లు పతనమైన 12వేల దిగువన 11,914 వద్ద ముగిసింది. సూచీల్లో అధిక వెయిటేజీ కలిగి ఆర్థిక రంగ షేర్లైన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 5శాతం పతనం కావడం సూచీల భారీ పతనానికి కారణమైంది. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1.30శాతం నష్టపోయి 31,301 వద్ద స్థిరపడింది. ఆర్‌బీఐ నిన్న జరిగిన పాలసీ సమావేశంలో ఎంపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) జీడీపీ వృద్ధి అంచనాలను ఏకంగా 5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించడం మార్కెట​ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్‌బీఐ నిన్న ప్రకటించిన నేపథ్యంలో నేడు మార్కెట్‌ నష్టంతో ప్రారంభమైంది. ఆరంభం నుంచి మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆర్థిక, అటో షేర్లలో ఎక్కువగా విక్రయాలు జరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 442 పాయింట్లు కోల్పోయి 40,337 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు నష్టపోయి 11,900.35 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. 

గెయిల్‌, ఇండస్‌ ఇండ్‌, జీ లిమిటెడ్‌, ఎస్‌బీఐ, యస్‌ బ్యాంక్‌ షేర్లు 3.50శాతం నుంచి 10.50శాతం నష్టపోయాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, టాటాస్టీల్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, కోటక్‌బ్యాంక్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 0.33శాతం నుంచి 5.50శాతం వరకు లాభపడ్డాయి. 
 



You may be interested

సైక్లికల్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌పై ఫోకస్‌..

Friday 6th December 2019

ఇన్వెస్టర్లు అధిక వ్యాల్యూషన్‌ కలిగిన (నాణ్యమైన కంపెనీలు) కంపెనీల నుంచి సైక్లికల్‌, నాణ్యమైన మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌వైపు దృష్టి సారించాలని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధన విభాగం హెడ్‌ వినోదన్‌ నాయర్‌ సూచించారు. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు.   ఆర్‌బీఐ పరపతి విధానం.. రేట్లను మార్చకూడదని ఎంతో ఆలోచించి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఐదు పర్యాయాలు తగ్గించిన

వొడాఫోన్‌ ఐడియా మూసేస్తాం!

Friday 6th December 2019

ప్రభుత్వ సాయం అందకుంటే నడపలేం కుమార మంగళం బిర్లా ఏజీఆర్‌ బకాయిల విషయంలో ప్రభుత్వం నుంచి ఊరట లభించకుంటే వొడాఫోన్‌ ఐడియా మూతపడడం ఖాయమని బిర్లా గ్రూప్‌ అధిపతి కుమార మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. ‘‘ఏలాంటి సాయం రాకుంటే వొడాఫోన్‌ ఐడియా కథ కంచికి చేరినట్లే’’ అని హెచ్‌టీ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో పాల్గొన్న బిర్లా వెల్లడించారు. ఇప్పటికే వొడాఫోన్‌ గ్లోబల్‌ సీఈఓ సైతం ఇదే విషయాన్ని బయటపెట్టారు. జియో పోటీ తట్టుకునేందుకు వొడాఫోన్‌,

Most from this category