కనిష్ట స్థాయి నుంచి కోలుకున్న మార్కెట్
By Sakshi

వరుసగా మూడో రోజు నష్టాలతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్ నష్టాలు మిడ్‌సెషన్ సమయానికి పరిమితమయ్యాయి. ఉదయం సెషన్లో జరిగిన అమ్మకాలతో సెన్సెక్స్ ఒకదశలో 285 పాయింట్లు క్షీణించి 38,435.87 వద్ద స్థాయికి చేరకోగా, నిఫ్టీ ఇండెక్స్ 91 పాయింట్లను కోల్పోయి 11,461.00 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అనంతరం కనిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోలుకు పూనుకోవడటం, ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌కు దిగవడంతో సూచీలు కనిష్టస్థాయిల నుంచి రికవరి బాట పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ పరిశ్రమలో 11-13శాతం వృద్థిని నమోదుచేయవచ్చనే ఇక్రా తన వార్షిక నివేదికలో వెల్లడించడంతో ఈ రంగ షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించింది. గత రెండు రోజులుగా భారీగా నష్టపోయిన మధ్య, చిన్నతరహా షేర్లలో రికవరీ ఎక్కువగా కన్పించింది. అలాగే ఇండెక్స్‌ల్లో అధిక పరిమాణం కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫిన్ సర్వీసెస్ షేర్ల ర్యాలీ సూచీలకు మద్దతుగా నిలిచింది. ఎన్ఎస్ఈలో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ దాదాపు 2.5శాతం ర్యాలీ చేసింది. ఫలితంగా సెన్సెక్స్ కనిష్టస్థాయి(38,435.87) నుంచి 379 పాయింట్లు లాభపడి 38,814.23 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మరో ప్రధాన సూచీల నిఫ్టీ డే కనిష్టం(11,461.00) నుంచి 121 పాయింట్లు పెరిగి 11,582.55 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యహ్నం గం.2:15ని.లకు సెన్సెక్స్ 41 పాయింట్ల నష్టంతో 38,679.89 వద్ద, నిఫ్టీ 20.80 పాయింట్లను కోల్పోయి 11,537.80 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా, మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అత్యధికంగా, ఐటీ, ఆర్థిక రంగ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి.
You may be interested
మరో 200 పాయింట్ల పతనం పక్కా?!
Tuesday 9th July 2019నిఫ్టీపై నిపుణుల అంచనా దేశీయ మార్కెట్లు బడ్జెట్ అనంతరం కరెక్షన్ మూడ్‌లోకి మారాయి. సోమవారం సూచీలు భారీ పతనం నమోదు చేశాయి. మంగళవారం ట్రేడింగ్‌లో నెగిటివ్ ధోరణితో ఊగిసలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సూచీలు ఇప్పట్లో స్థిరపడవని, మరింత పతనం ముందుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాల్యూషన్లపరంగా సూచీల్లో మరికొంత కరెక్షన్ బాకీ ఉందంటున్నారు. కంపెనీల నిజపరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, బడ్జెట్లో ఇండస్ట్రీకి ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడం మార్కెట్‌ను నిరాశపరిచిందని చెబుతున్నారు. ఇవన్నీ ఎర్నింగ్స్‌పై
ఈ షేర్లలో బేరిష్ సంకేతాలు!
Tuesday 9th July 2019ట్రెండ్ రివర్సల్ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు. 26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్ మూవింగ్ యావరేజెస్ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్ ఆధారంగా బై, సెల్ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్ చేసే విధానాన్ని బట్టి బేరిష్ క్రాసింగ్, బుల్లిష్ క్రాసింగ్‌గా చెబుతారు. బేరిష్ క్రాసోవర్ సోమవారం