News


సెన్సెక్స్‌ కీలక మద్దతు 38,380

Monday 30th September 2019
Markets_main1569814829.png-28609

పది శాతం ర్యాలీ జరపడం ద్వారా మార్కెట్‌ కార్పొరేట్‌ పన్ను తగ్గింపు అంశాన్ని దాదాపు డిస్కౌంట్‌ చేసుకున్నట్లే. పన్ను లబ్ధి కలగకుండా పెరిగిన షేర్లు తగ్గడం, పన్ను ప్రయోజనాన్ని పూర్తిగా డిస్కౌంట్‌ చేసుకోని షేర్లు మరింత పెరగడమే ఇక మిగిలింది. ఫలితంగా ఆయా షేర్ల హెచ్చుతగ్గులకు తగినట్లు కొద్దిరోజులపాటు మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనుకావొచ్చు. అటుతర్వాత సెప్టెంబర్‌ క్వార్టర్లో ఆర్థిక పలితాలే భవిష్యత్‌ మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్దేశించగలవు. మరోవైపు అమెరికా-చైనాల వాణిజ్య చర్చల పురోగతి కూడా ఈక్విటీలపై ప్రభావం చూపించవచ్చు. ఈ వారాంతంలో వడ్డీ రేట్లపై  ఆర్‌బీఐ తీసుకోబోయే నిర్ణయం, అక్టోబర్‌1న వెలువడే ఆటోమొబైల్స్‌ అమ్మకాల డేటా వంటివి మార్కెట్‌ను పరిమితంగా ఊగిసలాటకు లోనుచేయవచ్చు.  ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...

సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
సెప్టెంబర్‌ 27తో ముగిసిన వారంలో తొలిరోజున 39,441 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ అటుతర్వాత మిగిలిన నాలుగురోజులూ పరిమిత శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది. చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 808 పాయింట్ల లాభంతో 38,823 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్లో కన్సాలిడేషన్‌ కొనసాగితే సెన్సెక్స్‌ తొలుత 38,670 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 38,380 పాయింట్ల వద్ద గట్టి మద్దతు లభిస్తున్నది ఈ స్థాయిని కూడా వదులుకుంటే క్రమేపీ 38,000 స్థాయి వద్దకు క్షీణించవచ్చు. ఈ వారం రెండో మద్దతుస్థాయిని పరిరక్షించుకున్నా, బలంగా ప్రారంభమైనా 39,160 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. అటుపై క్రమేపీ 39,440 పాయింట్ల స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే వేగంగా 39,650 పాయింట్ల వద్దకు చేరవచ్చు.  

నిఫ్టీకి 11,380 పాయింట్ల మద్దతు కీలకం....
క్రితం సోమవారం 11,695 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ...మిగతా నాలుగురోజులూ 1.5 శాతం శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనై,  చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 238 పాయింట్ల లాభంతో 11,512 పాయింట్ల వద్ద ముగిసింది. ఈవారం నిఫ్టీ తగ్గితే 11,465 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని వదులుకుంటే 11,380 పాయింట్ల వద్ద లభించబోయే మద్దతు నిఫ్టీకి కీలకం. ఈ స్థాయిని సైతం వదులుకుంటే క్రమేపీ 200 రోజుల చలన సగటు రేఖ కదులుతున్న 11,250 పాయింట్ల సమీపానికి క్షీణించవచ్చు. ఈ వారం రెండో మద్దతును పరిరక్షించుకున్నా, పాజిటివ్‌గా ప్రారంభమైనా నిఫ్టీ తొలుత 11,610 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపైన ముగిస్తే 11,690 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిని ఛేదిస్తే 11,750 పాయింట్ల వరకూ ర్యాలీ జరపవచ్చు. 



You may be interested

4న మరో దఫా రేటు కోత?

Monday 30th September 2019

విశ్లేషకుల అభిప్రాయం ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన పరపతి కమిటీ అక్టోబర్‌ 4వ తేదీన మరోదఫా రేటు కోత నిర్ణయాన్ని ప్రకటించనుందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచీ మూడు రోజుల పాటు ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు

ఆర్‌బీఐ పాలసీ, ఆర్థికాంశాలే దిక్సూచి..!

Monday 30th September 2019

ఆర్‌బీఐ పాలసీ, ఆర్థికాంశాలే దిక్సూచి..! ఆర్‌బీఐ పరపతి విధాన నిర్ణయం శుక్రవారం వెల్లడి మంగళవారం వెల్లడికానున్న సెప్టెంబర్‌ నెల వాహన అమ్మకాల డేటా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం మార్కెట్‌కు సెలవు న్యూఢిల్లీ: కీలక వడ్డీ రేట్లకు సంబంధించిన ఆర్‌బీఐ ప్రకటన, దేశీ స్థూల ఆర్థిక అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. శుక్రవారం (అక్టోబర్‌ 4న) ఆర్‌బీఐ నాలుగో ద్వైమాసిక సమీక్ష జరగనుండగా.. ఈ సమావేశంలో

Most from this category