News


రూపాయి బలహీనత: ఐటీ షేర్లకు డిమాండ్‌

Wednesday 18th December 2019
news_main1576651020.png-30285

ఐటీ, బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ అండంతో సూచీలు వరుసగా రెండోరోజూ కొత్త రికార్డు స్థాయిలను అందుకున్నాయి. ముఖ్యంగా ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండటం సూచీలకు కలిసొస్తుంది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 1.50శాతం లాభపడింది. అమెరికాలో నవంబర్‌ ఆర్థిక గణాంకాలు అంచనాలకు మించిన నమోదుకావడంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ వారం గరిష్టానికి ఎగిసింది. ఫలితంగా నేడు మన దేశ కరెన్సీ రూపాయి డాలర్‌ మారకంలో బలహీనపడింది. నేడు రూపాయి క్రితం ముగింపు స్థాయి 70.98తో పోలిస్తే 5పైసలు బలహీనపడి 71.03 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల అరశాతం పతనంతో ఇంట్రాడేలో 15పైసలు బలపడి 71.08 స్థాయికి దిగివచ్చింది. రూపాయి బలహీనత డాలర్‌ మారకంలో ఆదాయాల్ని ఆర్జించే ఐటీ షేర్లకు కలిసొచ్చింది. ఈ ఐటీ రంగానికి చెందిన టాటాఎలాక్సీ 3శాతం పెరిగింది. విప్రో, మైండ్‌ట్రీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు 1.50శాతం లాభపడ్డాయి. టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా షేర్లు 1శాతం ర్యాలీ చేశాయి. ఇన్ఫోసిస్‌, హెక్సావేర్‌ షేర్లు అరశాతం బలపడ్డాయి. మరోవైపు జస్ట్‌ డయల్‌, ఎన్‌ఐఐటీ టెక్‌ షేర్లు అరశాతం బలహీనపడ్డాయి. ఉదయం గం.11:45ని.లకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1శాతం లాభంతో 15,785 వద్ద ట్రేడ్ అవుతోంది. 



You may be interested

చిన్న క్యాప్స్‌లో రికవరీ.. ఇప్పుడే కాదు!

Wednesday 18th December 2019

హేమాంగ్‌ జానీ అంచనా నెలన్నరగా వివిధ ఐపీఓలు, బ్లాక్‌డీల్స్‌ కారణంగా మార్కెట్లో లిక్విడీటీ అధికమొత్తంలో ఆవిరైందని షేర్‌ఖాన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ హేమాంగ్‌ జానీ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితి మెరుగై, లిక్విడిటీ పెరిగే వరకు చిన్న స్టాకుల్లో రికవరీ కానీ, మార్కెట్లో బలమైన అప్‌మూవ్‌ కానీ ఆశించకూడదన్నారు. సూచీల్లోని కొన్ని స్టాకులు మాత్రమే ర్యాలీ జరుపుతూ ముందుకు తీసుకుపోతున్నాయని విశ్లేషించారు. దేశీయ ఎకానమీలో కొన్ని సవాళ్లున్నాయని, విస్తృతస్థాయి ఎర్నింగ్స్‌ రికవరీ ఆశించలేమని చెప్పారు. ఇప్పటివరకు

స్థిరంగా పసిడి

Wednesday 18th December 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో  ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప లాభంతో 1,481 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా చైనాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై మిశ్రమ స్పందన, ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ మారక విలువ వారం గరిష్టాన్ని అందుకోవడం తదితర కారణాలు పసిడి స్థిరమైన ర్యాలీకి దోహదపడుతున్నాయి. ట్రేడ్‌ డీల్‌ ఒప్పందం నేపథ్యంలో

Most from this category