రెండు దశాబ్దాల కనిష్టానికి రిలయన్స్ క్యాపిటల్ షేర్లు
By Sakshi

అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన ఆర్థిక సేవల సంస్థ రిలయన్స్ క్యాపిటల్ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో 20ఏళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ లెండింగ్ వ్యాపారం నుంచి నిష్క్రమిస్తుందని గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ సోమవారం ప్రకటించడం షేర్ల పతనానికి కారణమైంది. నేడు ఈ కంపెనీ షేర్లు బీఎస్ఈలో రూ.28.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అనిల్ అంబానీ నేతృత్వంలోని నేడు ముంబాయిలో షేర్‌హోల్డర్ల వార్షిక సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ మందగించిన ఆర్థిక వ్యవస్థ, ఈ రంగంలో రుణాల సంక్షోభంతో రిలయన్స్ క్యాపిటల్ నష్టాన్ని ఎదుర్కోందని తెలిపారు. ఫలితంగా ఈ కంపెనీ షేర్లు 13.50శాతం నష్టపోయి రూ.24.15 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. మధ్యాహ్నం గం.3:00లకు షేరు క్రితం ముగింపు(రూ.24.15)తో పోలిస్తే 11.50శాతం నష్టపోయి రూ.24.70 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేర్లు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.24.15లు, రూ.318.80లుగా నమోదయ్యాయి. రిలయన్స్ క్యాపిటల్ ప్రస్తుతం చిన్న, మధ్యతరహా సంస్థలకు రిలయన్స్ మనీ ద్వారా, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ద్వారా గృహ కొనుగోలుదారులకు రుణాలు ఇస్తుంది. ఈ రెండు వ్యాపారాలు గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయంలో 15 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ ఏడాది కంపెనీ ఆస్తులను డిజిస్ట్మెంట్ చేయనుంది. రిలయన్స్ క్యాపిటల్ తన మ్యూచువల్ ఫండ్ విభాగమయిన రిలయన్స్ నిప్పోన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ (ఆర్‌నామ్)లోని 21.54 శాతం వాటా విక్రయాన్ని పూర్తి చేసినట్లు కంపెనీ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
You may be interested
11500 దిగువన ముగిసిన నిఫ్టీ
Monday 30th September 2019ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక చివరి రోజును మార్కెట్ నష్టాలతో ముగించింది. ఇన్వెస్టర్ల అప్రమత్తతతో సెన్సెక్స్ 155 పాయింట్ల నష్టంతో 38,667.33 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లను కోల్పోయి 11500 దిగువన 11,477.25 వద్ద స్థిరపడ్డాయి. రేపు సెప్టెంబర్ నెల వాహన గణాంకాలు వెల్లడి, ఎల్లుండి మహాత్మగాంధీ జయంతి సందర్భంగా సెలవు రోజు కావడం, గురు, శుక్రవారాల్లో ఆర్బీఐ ద్రవ్యపరపతి సమావేశంతో పాటు, వచ్చే వారంలో కంపెనీల క్యూ2
ఐదేళ్ల కనిష్ఠానికి ఇండియాబుల్స్ హౌసింగ్..30 శాతం క్రాష్
Monday 30th September 2019ప్రమోటర్లు నిధుల్ని తరలించారని, ఇతర ఆర్థిక అవకతవకాలకు పాల్పడ్డారంటూ ఒక ఎన్జీఓ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లో ఆరోపణల్ని పరిశీలించాలంటూ ఢీల్లీ హైకోర్టు నిర్ణయించడంతో సోమవారం ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నిలువునా పతనమయ్యింది. మధ్యాహ్నం 2.32 సమయానికి 30.86 శాతం లేదా రూ. 120.40 కోల్పోయి ఐదేళ్ల కనిష్టస్థాయి రూ. 269.70 వద్ద ట్రేడవుతోంది. భారీ అమ్మకాల ఒత్తిడి ఎదురవ్వడంతో రూ. 240.05 వద్ద ఏడాది కనిష్ఠానికి పడిపోయిన ఈ షేరు,