News


ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ బౌన్స్‌బ్యాక్‌

Wednesday 11th March 2020
Markets_main1583921105.png-32412

9 శాతం జంప్‌చేసిన షేరు
ఇంట్రాడేలో 15 శాతం ప్లస్‌

రెండు రోజులుగా పతన బాటలో సాగుతున్న ప్రయివేట్‌ రంగ సంస్థ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ కౌంటర్‌ ఉన్నట్టుండి వెలుగులోకి వచ్చింది. ఫైనాన్షియల్‌గా పటిష్టంగా ఉన్నట్లు బ్యాంక్‌  పేర్కొనడంతో ఈ కౌంటర్‌ జోరందుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. పెట్టుబడుల విషయంలోనూ సమర్థవంతంగా ఉన్నట్లు బ్యాంక్‌ తాజాగా తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ కౌంటర్లో కొనుగోళ్లకు ఎగబడ్డారు. వెరసి ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 9 శాతం జంప్‌చేసి రూ. 227కు చేరింది. ఇంట్రాడేలో 15 శాతం దూసుకెళ్లి రూ. 239ను అధిగమించింది.​ ఇతర వివరాలు చూద్దాం..

కొత్త కనిష్టానికి
గత రెండు రోజుల్లో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు భారీగా పెరిగాయి. దీంతో రెండు రోజుల్లోనే ఈ షేరు 31 శాతం పతనమైంది. సోమవారం(9న) ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ. 199ను తాకింది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. తద్వారా బ్యాంక్‌ ఐపీవో ధర రూ. 225 కంటే దిగువకు చేరింది. ఇటీవల సంస్థ ఆర్థిక పటిష్టతపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగినట్లు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తాజాగా వివరణ ఇచ్చింది. ఆధార రహితంగా కల్పిత ఆరోపణలు చేసినట్లు ఈ సందర్భంగా ఎక్స్ఛేంజీలకు బ్యాంకు తెలియజేసింది. బ్యాంకు కనీస పెట్టుబడుల నిష్పత్తి 16 శాతంపైగా ఉన్నట్లు స్పష్టం చేసింది. కాగా.. ఈ అంశాలకుతోడు ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌ చేపట్టడం కూడా ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ కౌంటర్‌కు జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.  



You may be interested

ఈ పథకాల మీద వడ్డీరేట్లు తగ్గొచ్చు!

Wednesday 11th March 2020

 చిన్న పొదుపు పథకాలపై ప్రభుత్వం వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉంది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(పీపీఎఫ్‌), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌(ఎన్‌ఎస్‌సీ), సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌(ఎస్‌సీఎస్‌ఎస్‌), సుకన్య సమృద్ధి యోజన(ఎస్‌ఎస్‌వై)లతో పాటు మరికొన్ని చిన్నపాటి పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేకపోలేదని ఒక సీనియర్‌ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. రెపోరేటు, స్మాల్‌ సేవింగ్స్‌ రేట్ల మధ్య ఉన్న అంతరాలు తగ్గితే చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లు తగ్గుతాయని తెలిపారు.

భయపడొద్దు- ఫార్మా, కెమికల్స్‌ బెస్ట్‌

Wednesday 11th March 2020

ఇన్వెస్టర్లు నాలుగు రకాలు మార్కెట్ల పతనాలలో అవకాశాలు ఔట్‌సోర్సింగ్‌ కంపెనీలపై దృష్టిపెట్టండి - దీపన్‌ మెహతా, ఎలిగ్జిర్‌ వ్యవస్థాపకులు   కరోనా వైరస్‌ తదితర ఆందోళనల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. అయితే త్వరలోనే మార్కెట్లు బాటమవుట్‌ కానున్నాయంటున్నారు ఎలిగ్జిర్‌  ఈక్విటీస్‌ వ్యవస్థాపకులు దీపన్‌ మెహతా. విదేశీ మార్కెట్లు, పెట్టుబడులు తదితర అంశాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ఆందోళనలు నెలకొన్నాయి. కరోనా వైరస్‌ను

Most from this category