News


ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ

Monday 18th November 2019
Markets_main1574063550.png-29674

మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లోనూ ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు లాభాల బాట పట్టాయి. మిడ్‌సెషన్‌ సమయానికి ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.50శాతం పెరిగింది. ఎస్సార్‌ స్టీల్‌ను సొంతం చేసుకునేందుకు ఆర్సెలర్‌మిట్టల్‌ సమర్పించిన రూ. 42,000 కోట్ల బిడ్‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. ఎస్సార్‌ స్టీల్‌ సంస్థ బ్యాంకులకు, ఇతరత్రా రుణదాతలకు రూ. 54,547 కోట్ల మేర బకాయిపడింది. అందులో ఒక్క ఎస్‌బీఐకు ఎస్సార్‌ స్టీల్‌ అత్యధికంగా రూ. 15,430 కోట్లు బాకీ పడింది. సుప్రీం కోర్టు తీర్పుతో ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఐడీబీఐ బ్యాంకులతో పాటు ప్రైవేట్‌ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌లు ఊరట కలిగినట్లైంది. మరోవైపు ఫైనాన్స్‌ సర్వీసెస్‌ ప్రొవైడర్లని ఐబీసీ కోడ్‌ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం యోచిస్తుందనే అంశం కూడా సెంటిమెంట్‌ను బలపరించింది. ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్ ప్రారంభం నుంచి ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ రంగానికి చెందిన ఎస్‌బీఐ, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌ షేర్లు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. మధ్యాహ్నం గం.12:45ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,457.35)తో పోలిస్తే 1.50శాతం లాభంతో 2,494.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి అత్యధికంగా కెనరా బ్యాంక్‌ 2.50శాతం పెరిగింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం లాభపడ్డాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ బ్యాంక్‌, జమ్మూ కాశ్మీర్‌ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం పెరిగాయి. సెంట్రల్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, ఓరియంట్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిండికేట్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. అలహదాబాద్‌ బ్యాంక్‌ షేరు మాత్రం 1.25శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతోంది.

31వేల దిగువకు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌:- 
మరోవైపు ఇదే ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మిడ్‌ సెషన్‌ కల్లా 31వేల దిగువకు చేరుకుంది. ప్రైవేట్‌ రంగ షేర్లలో అధిక వెయిటేజీ కలిగిన యస్‌ బ్యాంక్‌(3.50శాతం), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(1శాతం), ఐసీఐసీఐ బ్యాంక్‌(అరశాతం) నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండటం ఇందుకు కారణమవుతోంది. మధ్యాహ్నం గం.1:00ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(31008)తో పోలిస్తే 0.20శాతం నష్టంతో 31వేల దిగువున 30970 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

గ్లెన్‌మార్క్‌కు రేటింగ్‌ జోష్‌..!

Monday 18th November 2019

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ గ్లెన్‌మార్క్‌ ఫార్మా షేరకు జోష్‌నిచ్చింది. ఫలితంగా సోమవారం ఇంట్రాడేలో షేరు 21శాతం లాభపడింది. నేడు ఈ కంపెనీ బీఎస్‌ఈలో 308.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ‘‘ఈ ఆ‍ర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ అంచనాలకు మించి ఫలితాలను సాధించింది. అమెరికాలో అమ్మకాల వేగం మరింత పుంజు‍కుంటుంది. అయితే దేశీయ వ్యాపారం ఫార్మా పరిశ్రమ రేటు కంటే పెరుగుతూనే ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా మూడేళ్లలో

టాటా స్టీల్‌ 3 శాతం అప్‌!

Monday 18th November 2019

ప్రాథమిక స్టీల్‌ అయిన హెచ్‌ఆర్‌సీ(హాట్‌ రోల్డ్‌ కాయిల్‌) ధరలను టాటా స్టీల్‌ పెంచిన విషయం తెలిసిందే. దీంతో ‍వ్యవస్థలో స్టీల్‌కు డిమాండ్‌ పెరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా సోమవారం సెషన్‌లో మెటల్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టాటా స్టీల్‌ మధ్యాహ్నాం 12.58 సమయానికి  3.73 శాతం లాభపడి రూ. 409.20  వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 394.50 వద్ద ముగిసిన ఈ షేరు, సోమవారం సెషన్‌లో రూ. 396.40

Most from this category