News


ఈ వారంలో ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ, బడ్జెట్‌.. తస్మాత్‌ జాగ్రత్త!

Saturday 25th January 2020
Markets_main1579946515.png-31205

నిపుణుల సూచన
రాబోయే వారంలో జనవరి సీరిస్‌ ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ, బడ్జెట్‌ సెషన్‌ ఉన్నందున మార్కెట్లో తీవ్ర ఒడిదుడకులుంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈవారం సూచీలు నెగిటివ్‌గా ఆరంభమైనా, చివరి రెండు సెషన్లలో లాభాలను ఆర్జించింది. కొన్ని రోజులుగా నిఫ్టీ దాదాపు 300- 400 రేంజ్‌లో కదలికలు చూపింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి బ్రేకవుట్‌ కానీ, బ్రేక్‌డౌన్‌కానీ చూపలేదు. నిఫ్టీ కీలక ట్రెండ్‌లైన్‌ నిరోధాన్ని దాటేందుకు యత్నించినా సఫలం కాలేదు. ప్రస్తుతం వీఐఎక్స్‌ దాదాపు 15 పైన కదలాడుతోంది. వీక్లీ చార్టుల్లో నిఫ్టీ ఒక మధ్యంతర టాప్‌ ఏర్పరిచినట్లు కనిపిస్తోంది. ఈవారంలో తాకిన గరిష్ఠం 12430 పాయింట్లు ఇకపై కీలక నిరోధంగా వ్యవహరించనుంది. ఈ వారంలో జనవరి డెరివేటివ్స్‌ ఎక్స్‌పైరీ ఉన్నందున రోలోవర్‌ యాక్టివిటీ గమనించాల్సిఉంటుంది. నిఫ్టీకి దిగువన 12000- 12100 పాయింట్ల రేంజ్‌లో మద్దతు దొరుకుతుంది. దిగువకు వచ్చినప్పుడు కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. ఒకవేళ నిఫ్టీలో పతనం వస్తే ట్రేడింగ్‌ రేంజ్‌ విస్తృతం కావచ్చు. ఇండికేటర్లలో ఆర్‌ఎస్‌ఐ న్యూట్రల్‌గా ఎంఏసీడీ పాజిటివ్‌గా ఉన్నాయి. ఎంగల్ఫింగ్‌ బేరిష్‌ క్యాండిల్‌ కనిపిస్తున్నా, పైస్థాయిల వద్ద ఈ క్యాండిల్‌ ఏర్పడినందున పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. తదుపరి క్యాండిల్స్‌ ఆదారంగా ట్రెండ్‌ నిర్ధారించుకోవాలి. నిఫ్టీ మరింత అప్‌మూవ్‌ చూపాలంటే ట్రెండ్‌లైన్‌ నిరోధాన్ని విజయవంతంగా దాటాల్సిఉంటుంది. కానీ ప్రస్తుత ఆటుపోట్ల సమయంలో ఇది సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల ట్రేడర్లు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ తమ లాభాలను రక్షించుకోవాలి. బ్రేకవుట్‌, బ్రేక్‌డౌన్‌ వచ్చే వరకు పెద్దస్థాయిలో పొజిషన్ల జోలికి పోకపోవడం మంచిది. కచ్ఛితమైన స్టాప్‌లాస్‌ను పాటిస్తూ పొజిషన్లు కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. You may be interested

స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో అమెరికాను దాటేసిన ఇండియా

Saturday 25th January 2020

షియోమీ నంబర్‌ 1 వివో నంబర్‌ 2 భారత్‌లో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం రోజురోజుకీ పెరుగుతుండడంతో ..అమ్మకాలు భారీస్థాయిలో జరుగుతున్నాయి. దీంతో ఇండియా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌గా అవతరించింది. ఇప్పటిదాక చైనా, అమెరికాలు మొదటి రెండుస్థానాల్లో ఉండగా భారత్‌ అమెరికాను వెనక్కి నెట్టి రెండోస్థానంలో నిలిచింది. భారత మార్కెట్‌లో చైనా కంపెనీ ఫోన్ల హవా కొనసాగుతుండడమే ఇందుకు కారణమని మార్కెట్‌ మానిటర్‌ సర్వీస్‌ వెల్లడించింది. 2019 సంవత్సరంలో 7

ఇన్‌ఫ్రా, రియల్టీ రంగాలపై బడ్జెట్‌ దృష్టి?!

Saturday 25th January 2020

ద్రవ్యలోటు అదుపు కష్టమే 3.5 శాతంలోపు కట్టడి చేస్తే మార్కెట్లకు జోష్‌ - అనిల్‌ సరీన్‌, సీఈవో, సెంట్రమ్‌ పీఎంఎస్‌ బడ్జెట్‌లో ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రియల్టీ రంగాలపై దృష్టి పెట్టేవీలున్నట్లు చెబుతున్నారు అనిల్‌ సరీన్‌. ఆదాయాలు తగ్గుతున్న నేపథ్యంలో ద్రవ్యలోటు కట్టడి కష్టమేనని, అయితే 3.5 శాతం లక్ష్యాన్ని నిలుపుకుంటే మార్కెట్లకు జోష్‌ లభిస్తుందని సెంట్రమ్‌ పీఎంఎస్‌ విభాగ సీఈవో సరీన్‌ పేర్కొంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఇంకా పలు విషయాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Most from this category