News


ఎస్‌బీఐలో పుట్‌ లాడర్‌ వ్యూహం బెటర్‌!

Tuesday 10th December 2019
Markets_main1575951623.png-30147

నిపుణుల సలహా
స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు పోర్టుఫోలియోలో ఉండి తాజాగా షేరు పతనంతో ఏం చేయాలో తెలియక సతమతమయ్యే రిటైల్‌ ఇన్వెస్టర్లు పుట్‌ల్యాడర్‌ వ్యూహం అవలంబించడం ద్వారా నష్టాలు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పీఎస్‌యూ బ్యాంకు షేర్లలో ఎస్‌బీఐని టాప్‌పిక్‌గా పలువురు పరిగణిస్తారు. అందువల్ల ప్రస్తుతం కొంత వెనుకంజ వేసినా, షేరు తిరిగి పుంజుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజా పతనంలో భాగంగా షేరు 290 రూపాయల వరకు దిగిరావచ్చని, ఈ పతనంలో నష్టాలు తగ్గించుకునేందుకు పుట్‌ లాడర్‌ వ్యూహం మంచిదని యాక్సి్‌స్‌ సెక్యూరిటీస్‌ అనలిస్టు రాజేశ్‌ పల్వియా, మోతీలాల్‌ఓస్వాల్‌ అనలిస్టు చందన్‌ తపారియా సూచించారు.
ఏంటీ వ్యూహం..
ఈ వ్యూహంలో 310 స్ట్రైక్‌ ప్రైస్‌ వద్ద పుట్‌ను కొనుగోలు చేసి, 300 స్ట్రైక్‌ మరియు 290 స్ట్రైక్‌ ప్రైస్‌ల పుట్‌ను అమ్మడం జరుగుతుంది. సోమవారం ధరల ప్రకారం చూస్తే 310 పుట్‌ కొనుగోలు చేయడానికి(లాట్‌లో 3000 షేర్లుంటాయి) ఒక్కో షేరుకు రూ. 8.2 పడుతుంది. 300,290 పుట్స్‌ అమ్మకానికి ఒక్కో షేరుకు రూ. 8.9 పడుతుంది. రెండిటి మధ్య వ్యత్యాసం 70పైసలు పర్‌ షేరు పడుతుంది. కొత్త నిబంధనల ప్రకారం ఆప్షన్‌ సెల్లర్‌ సరిపడ మార్జిన్‌ మెయిన్‌టెయిన్‌ చేయాలి. ఒకవేళ ఎస్‌బీఐ షేరు ఎక్స్‌పైరీ నాటికి 310 వద్ద లేదా పైన ముగిస్తే ట్రేడర్‌కు షేరుపై పైన చెప్పిన 70 పైసలు మాత్రమే వస్తుంది. ఒక వేళ షేరు రూ.290 వద్ద ముగిస్తే గరిష్ఠంగా ఒక్కో షేరుపై రూ.10 లాభం వస్తుంది. రూ.290 దిగువన రూ. 280 వరకు లాభం తగ్గుతూ వస్తుంది. రూ.280 ఎల్‌బీఈపీ(లోయర్‌ బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌) దిగువన నష్టం మొదలైతుంది. ఎక్స్‌పైరీకి దిగువన షేరు రూ. 290కిమించి పడిపోదన్న అంచనాలతో ఈ వ్యూహం అవలంబించాలి. రూ.290 వద్దకు వస్తే లాభాలు బుక్‌ చేయాలి. అప్‌సైడ్‌లో రూ. 330-340 స్థాయిలు షేరుకు నిరోధాలుగా పనిచేస్తాయని అంచనా. You may be interested

ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌

Tuesday 10th December 2019

దేశీయంగా, అంతర్జాతీయంగా ఎటువంటి సంకేతాలు లేకపోవడంతో మంగళవారం మార్కెట్‌ ఫ్లాట్‌గా ప్రారంభమై, కొద్ది నిముషాల్లో స్వల్ప నష్టాల్లోకి మళ్లింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ క్రితం రోజు స్థాయిలోనే 41,480 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ అదేరీతిలో 11,935 పాయింట్ల సమీపం‍లో మొదలయ్యింది. తదుపరి కొన్ని హెవీవెయిట్‌ షేర్లలో అమ్మకాలు నెలకొనడంతో సెన్సెక్స్‌ 41,420 పాయింట్ల వద్దకు, నిఫ్టీ 11,920 పాయింట్ల వద్దకు తగ్గాయి. 

భారత్‌ కంపెనీలపై వివక్ష వద్దు: కేంద్రం

Tuesday 10th December 2019

న్యూఢిల్లీ: భారత్‌ కంపెనీలపై వివక్ష  ప్రదర్శించవద్దని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్‌ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. అలాంటి ధోరణిని అవలంబించే దేశాల కంపెనీలకూ భారత్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతుందని న్యూఢిల్లీలో ఎగ్జిమ్‌ బ్యాంక్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన హెచ్చరించారు. ‘‘ఏదైనా దేశం తమ దేశంలో కాంట్రాక్టులు ఇచ్చే విషయంలో భారత్‌ కంపెనీలపై వివక్ష చూపిస్తే, సంబంధిత దేశ కంపెనీలను కూడా  భారత్‌ పబ్లిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌

Most from this category