News


పిడిలైట్‌ రికార్డ్‌- ఇండియన్‌ హోటల్స్‌ వీక్‌

Thursday 5th March 2020
Markets_main1583399407.png-32304

సరికొత్త గరిష్టానికి పిడిలైట్‌
3 నెలల్లో 26 శాతం ప్లస్‌
ఇండియన్‌ హోటల్స్‌ వారం రోజుల్లో 18 శాతం డౌన్‌

గత మూడు నెలలుగా లాభాల బాటలో సాగుతున్న డైవర్సిఫైడ్‌ కంపెనీ పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ మరోసారి వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో లాభాలతో సందడి చేస్తోంది. కాగా.. మరోపక్క ఇటీవల నేలచూపులతో కదులుతున్న తాజ్‌ గ్రూప్‌ హోటళ్ల కంపెనీ ఇండియన్‌ హోటల్స్‌ కౌంటర్‌ తాజాగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో ఈ కౌంటర్‌ నష్టాలతో డీలా పడింది. ఇతర వివరాలు చూద్దాం...

పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌
అధెసివ్స్‌, కన్‌స్ట్రక‌్షన్‌ కెమికల్స్‌, సీలెంట్స్‌ తదితర తయారీ కంపెనీ పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు నేడు(గురువారం) సమావేశాన్ని నిర్వహిస్తోంది. మార్చితో ముగియన్ను ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బోర్డు.. వాటాదారులకు మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించనుంది. ఇందుకు కంపెనీ ఇప్పటికే మార్చి 16 రికార్డ్‌ డేట్‌గా ప్రకటించింది. కాగా.. ఇటీవల ఇటలీ కంపెనీ టెనక్స్‌తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా టెనక్స్‌ ఇండియా స్టోన్‌ ప్రొడక్ట్స్‌లో 70 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. క్యూ3 ఫలితాల సందర్భంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పనితీరు చూపే వీలున్నట్లు యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గత మూడు నెలలుగా పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ షేరు బలపడుతూ వస్తోంది. వెరసి 26 శాతం ర్యాలీ చేసింది. మధ్యాహ్నం 2.25 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.3 శాతం జంప్‌చేసి రూ. 1633 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1645కు ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం!

ఇండియన్‌ హోటల్స్‌
సార్వత్రిక ఎన్నికలు, ఆర్థిక మందగమనానికితోడు తాజాగా తలెత్తిన కరోనా వైరస్‌ ఆందోళనలు వంటి అంశాలు తాజ్‌ గ్రూప్‌ హోటళ్ల కంపెనీ ఇండియన్‌ హోటల్స్‌ కౌంటర్‌ను బలహీనపరుస్తున్నట్లు నిపుణలు పేర్కొంటున్నారు. దీంతో గత వారం రోజుల్లో ఈ షేరు 18 శాతం క్షీణించింది. మధ్యాహ్నం 2.25 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో ఇండియన్‌ హోటల్స్‌ షేరు 3 శాతం పతనమై రూ. 120 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 115 వరకూ వెనకడుగు వేసింది. ఇది 17 నెలల కనిష్టంకావడం గమనార్హం! అయితే భవిష్యత్‌లో మరింత మెరుగైన పనితీరును చూపే అవకాశమున్నట్లు టాటా గ్రూప్‌ కంపెనీ ఇండియన్‌ హోటల్స్‌ యాజమాన్యం​అంచనా వేస్తోంది. You may be interested

ఏడాది కాలానికి ఈ షేర్లు కొనొచ్చు

Thursday 5th March 2020

వివిధ బ్రోకరేజ్‌ సంస్థ నుంచి ఏడాది కాలానికి టాప్‌-5 రికమెండేషన్లు ఇవి..! 1.బ్రోకరేజ్‌ సంస్థ: ఎమ్‌కే రికమెండేషన్స్‌ షేరు పేరు: గెయిల్‌ రేటింగ్‌: కొనొచ్చు టార్గెట్‌ ధర: రూ.160 కాలపరిమితి: ఏడాది  విశ్లేషణ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్‌ ‌పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎంఏటీ క్రిడెట్స్‌, ఇతర ప్రయోజనాల కారణంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్‌ ‌పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని పొందలేకపోయింది. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి కారణంగా క్రూడాయిల్‌ ధరలు ధీర్ఘాకాలికంగా కొనసాగినట్లైతే... స్వల్పకాలం పాటు ఆదాయాలు

భారత ఉక్కు ఎగుమతులకు కరోనా బూస్ట్‌!

Thursday 5th March 2020

కరోనా వైరస్‌(కోవిడ్‌-19) ప్రభావంతో భారత ఉక్కు పరిశ్రమలు పుంజుకుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఎగుమతులు చేయడానికి ఇది చాలా మంచి సమయమని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోవిడ్‌-19 వ్యాప్తితో చైనాలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. వాటిలో ఉక్కు పరిశ్రమలు కూడా ఉన్నాయి. దీంతో ఉక్కుకోసం చైనా మీద ఆధారపడ్డ ప్రపంచ దేశాలు ప్రత్యమ్నా మార్గాలను వెదుకుతున్నాయి.ఇందులో భాగంగానే స్టీల్‌ను కొనుగోలుదారులంతా ఇండియా వైపు చూస్తున్నారని ఉక్కు పరిశ్రమల మార్కెట్‌ నిపుణులు

Most from this category