News


బుల్స్‌దే హవా అంటున్న ఆప్షన్‌ డేటా!

Saturday 25th May 2019
Markets_main1558764425.png-25924

నిఫ్టీ కీలకమైన 11650 పాయింట్ల మద్దతును నిలుపుకొని శుక్రవారం ర్యాలీ జరిపింది. వారాంతాన్ని 11850 పాయింట్ల వద్ద ముగించింది. ఫలితాల రోజు నిఫ్టీ 12వేల పాయింట్లను దాటినా ఆ జోరు కొనసాగించలేక వెనక్కు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చార్టుల్లో ఇన్‌సైడ్‌ బార్‌ పాటర్న్‌ కనిపిస్తోంది. వీక్లీ చార్టుల్లో బుల్లిష్‌ గ్యాప్‌అప్‌ క్యాండిల్‌ ఏర్పడడం సూచీలపై బుల్స్‌ పట్టు పెరిగిందనేందుకు సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. ఇకపై బుల్స్‌ జోరు కొనసాగాలంటే తప్పకుండా నిఫ్టీ 11750 పైనే కొనసాగాల్సిఉంటుంది. అప్పుడే మరోమారు 12000 పాయింట్ల వరకు పరుగు ఉండొచ్చు. మద్దతుగా 11650- 11660 జోన్‌ నిలుస్తుంది. ఆప్షన్స్‌ డేటా సైతం బుల్స్‌ హవానే చూపుతున్నాయి. నిఫ్టీ ఆప్షన్స్‌లో 11000, 11500 పాయింట్ల వద్ద భారీగా పుట్స్‌ ఉన్నాయి. 12500, 12000పాయింట్ల వద్ద కాల్స్‌ ఎక్కువగా పోగయ్యాయి. కొత్తగా 11700 పాయింట్ల వద్ద పుట్‌రైటింగ్‌ కనిపిస్తోంది. 12100, 12200 పాయింట్ల వద్ద స్వల్పంగా కాల్‌ రైటింగ్‌ కనిపించింది. ఆప్షన్‌ డేటాను చూస్తే నిఫ్టీ 11600- 12100 పాయింట్ల రేంజ్‌లో కదలాడే ఛాన్సులున్నాయని నిపుణుల అంచనా. దేశీయ వీఐఎక్స్‌ సూచీ ప్రస్తుతం 16.46 వద్దకు దిగజారింది. ఈ ఇండెక్స్‌ ఒక్క వారంలోనే దాదాపు 41 శాతం పతనమైది. దీన్ని బట్టి స్వల్పకాలానికి మార్కెట్లో తీవ్రకదలికలు తగ్గుతాయని తెలుస్తోంది. బ్యాంకు నిఫ్టీ సైతం బుల్లిష్‌ సంకేతాలనే ఇస్తోంది. పలు ప్రైవేట్‌, పీఎస్‌యూ బ్యాంకుల షేర్లలో కొనుగోళ్ల జోరు పెరిగింది. బ్యాంకు నిఫ్టీ 30500 పాయింట్లను కాపాడుకుంటే మరో మారు ఆల్‌టైమ్‌ హై 31705 పాయింట్ల వరకు పెరగవచ్చు. ఆ పైన 32500 పాయింట్ల వరకు ర్యాలీ ఉండొచ్చు. 30250 పాయింట్ల వద్ద బలమైన మద్దతు ఉంది. 



You may be interested

వారాంతపు నష్టాల్లో ముడిచమురు ధర!

Saturday 25th May 2019

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు శుక్రవారం ఒక శాతం మేర లాభపడినా, వారం మొత్తానికి చూస్తే నష్టాల్లోనే ముగుస్తున్నాయి. ఈ ఏడాది క్రూడాయిల్‌ ధరలకు ఇదే అతిపెద్ద నష్టాల ముగింపు. ఇన్వెంటరీలు పెరగడం, అంతర్జాతీయ మందగమన భయాలు.. క్రూడ్‌ ధరలపై ప్రభావం చూపాయి. శుక్రవారం బ్రెంట్‌ ధర 1.4 శాతం లాభంతో 68.69 డాలర్ల వద్ద ముగిసింది. వారం మొత్తానికి చూస్తే బ్రెంట్‌ ధర 4.5 శాతం నష్టపోగా, డబ్ల్యుటీఐ

ఫండ్‌ సైజు అంత కీలకమా?

Saturday 25th May 2019

ఓ మ్యూచువల్‌ ఫం‍డ్స్‌ పథకం నిర్వహణలో ఉన్న ఆస్తులు (ఏయూఎం) కీలకమైన అంశమా...? చాలా మంది ఇన్వెస్టర్లకు ఎదురయ్యే ప్రశ్న ఇది. చాలా మంది భారీ ఏయూఎం కలిగిన పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మిగిలిన పథకాలతో పోలిస్తే భారీ పెట్టుబడులు కలిగిన పథకాలు మెరుగైన పనితీరు చూపిస్తాయన్న అభిప్రాయం వల్లే. కానీ, ఇందులో వాస్తవం ఉందా..? దీనిపై వ్యాల్యూ రీసెర్చ్‌సంస్థ విశ్లేషణ ఇలా ఉంది.    ఈక్విటీ ఫండ్స్‌లో అస్సెట్స్‌

Most from this category