News


రాణిస్తున్న రియల్టీ రంగ షేర్లు

Thursday 11th July 2019
Markets_main1562830301.png-26985

మార్కెట్‌ ర్యాలీలో భాగంగా గురువారం రియల్టీ రంగ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ దాదాపు 2శాతం ర్యాలీ చేసింది. నేడు ఈ ఇండెక్స్‌లో 277.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించిది. వరసుగా మూడు ట్రేడింగ్‌లో సెషన్లలో భారీ నష్టాలను చవిచూసిన ఈ రంగ షేర్లలో నేడు షార్ట్‌ కవరింగ్‌ జరిగింది. ఫలితంగా ఇంట్రాడే ఇండెక్స్‌ 1.50శాతం పెరిగి 279.70 స్థాయికి చేరుకుంది. ఇండెక్స్‌లో అధికంగా డీఎల్‌ఎఫ్‌ అత్యధికంగా 4.50శాతం లాభపడింది. ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ షేర్లు 2శాత ర్యాలీ చేయగా, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, ఫోనెక్స్‌ లిమిటెడ్‌ షేర్లు 1శాతం పెరిగాయి. శోభా, బ్రిగేడ్‌ ఇండస్ట్రీస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, మహీంద్రా లైఫ్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. మరోవైపు ఓబేరాయ్‌ రియల్టీ సన్‌టెక్‌ షేర్లు 1శాతం క్షీణించాయి. మధ్యాహ్నం గం.12:20ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు స్థాయి(279.70)తో పోలిస్తే 1.50శాతం పెరిగి 279.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఇదే సమయానికి బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లైన సెన్సెక్స్‌ 224 పాయింట్ల లాభంతో 38780.88 వద్ద, నిఫ్టీ 68.35 పాయింట్లు ర్యాలీ చేసి 11,567.25 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

ఇండియా కన్నా చైనా షేర్లపైనే హెచ్‌ఎస్‌బీసీ మక్కువ

Thursday 11th July 2019

 ఇప్పటివరకు భారత కంపెనీల షేర్లపై పాజిటివ్‌గా ఉ‍న్న అంతర్జాతీయ దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ తాజాగా చైనా షేర్లపై మక్కువ ప్రకటిస్తోంది. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలున్న నేపథ్యంలో భారత్‌ కన్నా చైనా షేర్లు బెటరని తెలిపింది. దశాబ్ద కాలంలో తొలిసారి వడ్డీరేట్ల తగ్గింపునకు సంబంధించి ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌ బుధవారం సానుకూలంగా స్పందించారు. నిజానికి గత మేలో హెచ్‌ఎస్‌బీసీ సంస్థ చైనా షేర్‌మార్కెట్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. వాణిజ్యయుద్ధ భయాలతో సంస్థ

11400 దిగువన 11100 పాయింట్ల వరకు పతనం!

Thursday 11th July 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా నిఫ్టీ తన ఇటీవల కాలపు రేంజ్‌ నుంచి బడ్జెట్‌ తర్వాత బ్రేక్‌డౌన్‌ చూపింది. అప్పటి నుంచి ఆరేంజ్‌ దిగువ అవధి 11625 పాయింట్ల కిందనే కదలాడుతోంది. బుధవారం డైలీ చార్టుల్లో ట్రెండ్‌లైన్‌ నుంచి కూడా బ్రేక్‌డౌన్‌ చూపినట్లు కనపడుతోంది. ఇవన్నీ మార్కెట్‌ వర్గాల్లో పెరుగుతున్న నిరాశాధోరణికి నిదర్శనంగా నిపుణులు భావిస్తున్నారు. ఎగ్జిట్‌ పోల్‌ రోజు చార్టుల్లో ఏర్పడ్డ గ్యాప్‌ను పూరించేవరకు ఈ పతనం తప్పకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. గత

Most from this category