News


స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్‌: 11880 దిగువకు నిఫ్టీ

Saturday 1st February 2020
Markets_main1580543422.png-31399

 ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో మార్కెట్‌కు ప్రభావితం చేసే అంశాలేవి లేకపోవడంతో సూచీలు మిడ్‌సమయానికి తీవ్రంగా నష్టాలను చవిచూస్తున్నాయి. నిఫ్టీ ఇండెక్స్‌ 93 పాయింట్లు నష్టపోయి 11,869.00 స్థాయికి దిగివచ్చింది. సెన్సెక్స్‌ 279 పాయింట్లను కోల్పోయి 40,444.44 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మెటల్‌, బ్యాంకింగ్‌, రియల్టీ, మీడియా రంగ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఆర్థిక సంవత్సరం 2020-21లో వైద్య రంగానికి రూ.69 వేల కోట్లు కోట్ల ప్రకటించడంతో ఫార్మా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఐటీసీ, హెచ్‌యూఎల్‌ క్యూ3 ఫలితాలు బాగుండంతో ఎఫ్‌ఎంసీజీ షేర్లు రాణిస్తారు. నేడు జనవరి మాసపు వాహన విక్రయ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో అటో షేర్లు లాభాల బాట పట్టాయి. 

మధ్యాహ్నం గం.1:00లకు నిఫ్టీ ఇండెక్స్‌ 51 పాయింట్ల నష్టంతో 11,910.95 వద్ద, సెన్సెక్స్‌ 151 పాయింట్లను కోల్పోయి 40,572.20 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

ఇదే సమాయనికి నిఫ్టీ-50 సూచీలో... జీ లిమిటెడ్‌, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌, టాటామోటర్స్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు 2శాతం నుంచి 3శాతం నష్టపోయాయి. ఏషియన్‌ పేయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే లిమిటెడ్‌, గెయిల్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌ షేర్లు 1శాతం నుంచి 2శాతం వరకు లాభపడ్డాయి. 



You may be interested

1.6 శాతం పెరిగిన మారుతి విక్రయాలు

Saturday 1st February 2020

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద​ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా కార్ల విక్రయాలు జనవరిలో 1.6 శాతం పెరిగాయని ప్రకటించింది. దీనిలో భాగంగా 1,51,721 యూనిట్ల  అమ్మకాలు జరిగాయని మారుతి సుజుకీ అధికారికంగా ప్రకటించింది. దేశీయంగా 1.7 శాతం విక్రయాలు పెరగడంతో 2018 జనవరిలో  1,42,150 యూనిట్లు అమ్మగా, ఈ ఏడాది జనవరిలో 1,44,499 యూనిట్లు విక్రయించామని తెలిపింది. ఆల్టో, వ్యాగన్‌ఆర్‌ కార్ల విక్రయం గతేడాదితో పోలిస్తే 11

స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్‌: ఒడిదుడుకుల ట్రేడింగ్‌..!

Saturday 1st February 2020

లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న సూచీలు 12000 స్థాయి దిగువునే నిఫ్టీ  అటో, ఎఫ్‌ఎంజీసీ షేర్లకు లాభాల మద్దతు మెటల్‌ షేర్లలో కొనసాగుతున్న అమ్మకాలు బడ్జెట్‌ సందర్భంగా ప్రత్యేకంగా ట్రేడ్‌ అవుతున్న స్టాక్‌ మార్కెట్‌ తీవ్రంగా ఒడిదుడుకులకు లోనవుతోంది. నేటి ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. రికవరీ అయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జె్‌ట్‌ ప్రసంగం ప్రారంభించేటప్పుడు ఒక్కసారిగా భారీ పతనాన్ని చవిచూశాయి. మళ్లీ రికవరీ అయ్యాయి. మధ్యాహ్నం 12గంటలకు ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్‌

Most from this category