News


క్రిస్‌మస్‌ నాటికి 10,000కు నిఫ్టీ..!

Monday 22nd July 2019
Markets_main1563819157.png-27238

ఒకవైపు దేశ ఆర్థిక రంగ వృద్ధి ప్రతికూలంగా ఉండడం, మరోవైపు అంతర్జాతీయంగానూ వృద్ధి పరుగులు తీసేందుకు అనుకూల పరిస్థితులు లేకపోవడం... మరోవైపు పన్నుల భారంతో ఎఫ్‌పీఐల అమ్మకాలు, కార్పొరేట్‌ కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం వెరసి మన ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిలో చిక్కుకున్నాయి. నిఫ్టీ కీలక మద్దతు స్థాయి అయిన 11,300కు సమీపానికి వచ్చేసింది. ఇది కీలకమైన మద్దతు ‍స్థాయి అని, రానున్న రోజుల్లో మార్కెట్లు ఇంకా దిద్దుబాటుకు గురవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్లపై వారి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి...

 

‘‘మార్కెట్లు బేరిష్‌ దశలోకి అడుగుపెట్టాయి. ఆర్థికరంగ క్షీణత మరింత కాలం కొనసాగడం, కంపెనీల ఫలితాలు సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో ఇన్వెస్టర్లు అమ్మకాల వైపు మొగ్గుచూపారు. ఇప్పటి వరకు విదేశీ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడులను ఆకర్షిస్తున్న లార్జ్‌క్యాప్‌లకు కూడా ఈ కరెక్షన్‌ విస్తరించింది. పన్నులపై ఆందోళనలు, క్యూ1 ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం ‍ప్రభావం కొనసాగుతుంది’’

- వినోద్‌ నాయర్‌, రీసెర్చ్‌ హెడ్‌, జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌

 

‘‘బడ్జెట్‌ రోజు నుంచి మార్కెట్లు నష్టపోతూనే ఉన్నాయి. సంపన్నులపై పన్ను భారం మోపడంతో ఎఫ్‌ఐఐలు అమ్మకాలు మొదలుపెట్టారు. అలాగే, కార్పొరేట్‌ ఫలితాలు బలహీనంగా ఉండడం, వర్షాల పురోగతి తక్కువగా ఉండడం, తగ్గిన వినియోగాన్ని పెంచే దిశగా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు లేకపోవడం, లిక్విడిటీ కొరతను నివారించేందుకు ప్రభుత్వం తరఫున నిర్మాణాత్మక చర్యలు లోపించడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది. దీనికితోడు వాణిజ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయ మందగమనంతో పెట్టుబడులు బంగారం వైపు వెళుతున్నాయి’’

- రాజీవ్‌ సింగ్‌, సీఈవో, కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌

 

‘‘హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు పతనం కావడం, వీటికితోడు బజాజ్‌ ఫైనాన్స్‌ షేరు పతనం చాలా మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల ఎన్‌ఏవీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. లిక్విడిటీ అవసరాల నేపథ్యంలో లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లోనూ విక్రయాలకు దారితీస్తుంది. దీపావళి వరకు తమ పోర్ట్‌ఫోలియో విలువ మరింత క్షీణిస్తుందనే దానికి ఇన్వెస్టర్లు సిద్ధపడాలి. కనిష్టాల వద్ద స్టా‍క్స్‌ కోసం వేటాడకుండా వేచి చూడాలని సూచిస్తున్నాం. నిఫ్టీ-50 ఈ ఏడాది క్రిస్‌మస్‌కు ముందే 10,000 స్థాయికి చేరుకోవచ్చు. తమ పోర్ట్‌ఫోలియోలో ప్రధాన స్టాక్స్‌ను విక్రయించడం ద్వారా వారు (ఎఫ్‌ఐఐలు) నగదు నిల్వలను పెంచుకుంటున్నారు. తర్వాత బాగా పడిపోయిన స్టాక్స్‌లో తిరిగి ఇన్వెస్ట్‌ చేస్తారు’’

- ఉమేష్‌ మెహతా, రీసెర్చ్‌ హెడ్‌, శామ్కో సెక్యూరిటీస్‌

 

‘‘నిఫ్టీ క్రితం కనిష్ట స్థాయి 11,460ను కోల్పోయింది. సమీప కాలంలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోనుంది. దిగువ వైపున 11,000-11,100 బలమైన మద్దతు స్థాయి. దీన్ని పరీక్షించొచ్చు. మిడ్‌క్యాప్‌ సూచీలు ఎన్నికల ముందు నాటి స్థాయిలో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ విభాగంలో అస్థిరతలు కొనసాగుతాయి. వచ్చే కొన్ని నెలలకు 11,000 అన్నది కీలకం అవుతుంది. దీన్ని బేక్ర్‌ చేస్తుందా లేదా అన్నది మార్కెట్ల తదుపరి గమనాన్ని నిర్దేశిస్తుంది’’

- సహజ్‌ అగర్వాల్‌, డెరివేటివ్స్‌ హెడ్‌, కోటక్‌ సెక్యూరిటీస్‌
 You may be interested

పాజిటివ్‌ ప్రారంభం...నిముషాల్లో నష్టాల్లోకి

Tuesday 23rd July 2019

గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో భారీగా నష్టాల్ని చవిచూసిన భారత్‌ సూచీలు మంగళవారం పాజటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 107 పాయింట్ల లాభఃతో 38,138 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 11,372 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అయితే ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది నిముషాలకే హెవీవెయిట్‌ షేర్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లలో తలెత్తిన అమ్మకాల ప్రభావంతో సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. సెన్సెక్స్‌ 38,000 దిగువకు పడిపోగా,

బంధన్‌ బ్యాంకుపై బ్రోకరేజీల భిన్న స్పందన

Monday 22nd July 2019

బంధన్‌ బ్యాంకు జూన్‌ త్రైమాసికానికి మంచి ఫలితాలను ప్రకటించింది. నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 46 శాతం పెరిగింది. ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. అయితే ఈ స్టాక్‌ విషయంలో బ్రోకరేజీ సంస్థల అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.   బ్రోకరేజీ సంస్థ యాంబిట్‌ ఈ స్టాక్‌కు రూ.309 టార్గెట్‌తో తన సెల్‌ రేటింగ్‌ను కొనసాగించింది. ప్రస్తుత ధర రూ.501 నుంచి చూసుకుంటే 40 శాతం తక్కువకు టార్గెట్‌

Most from this category