News


11682 పాయింట్ల మద్దతు కూడా కోల్పోవచ్చు?!

Tuesday 25th February 2020
Markets_main1582607356.png-32067

నిఫ్టీ రాబోయే రోజుల్లో 11682 పాయింట్ల దిగువకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సోమవారం ఎఫ్‌ఐఐల భారీ విక్రయాలతో కీలకమైన 11900- 12000 పాయింట్ల మద్దతును నిఫ్టీ కోల్పోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భారీ నెగిటివ్‌ మూడ్‌ను ప్రతిబింబిస్తూ దేశీయ మార్కెట్లో కూడా సోమవారం భారీ కరెక‌్షన్‌ వచ్చింది. ఈ వరుస చూస్తుంటే త్వరలో నిఫ్టీ కీలకమైన 200 రోజుల డీఎంఏ స్థాయిని పరీక్షించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 11682 పాయింట్ల వద్ద నిఫ్టీ 200 రోజుల డీఎంఏ మద్దతు ఉంది. ఇక్కడ కూడా పతనానికి విరామం దొరకకపోవచ్చని, ఈ స్థాయి దిగువకు నిఫ్టీ దిగిరావచ్చని మరికొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే 11700 పాయింట్ల వద్ద పుట్‌ రైటింగ్‌ ఎక్కువకావడమనేది కొంత మద్దతును ఇవ్వవచ్చంటున్నారు. ఇలా నెలసరి డెరివేటివ్స్‌ ముగింపు సమయంలో పుట్స్‌ ఎక్కువగా పోగవడం మార్కెట్‌లో నెగిటివ్‌ సంకేతాలు ఇస్తుందంటున్నారు. పుట్‌ ధర గత వారంలో దాదాపు 6 రెట్లు పెరిగిందని, సంస్థాగత ఇన్వెస్టర్లు హెడ్జింగ్‌ కోసం పుట్స్‌ కొనడం వల్ల పుట్స్‌ ఓఐ పెరిగిందని తెలిపారు.

కరొనా వైరస్‌ ప్రభావం మరింత ముదిరి గ్లోబల్‌ మార్కెట్లు మరింత పతనమైతే నిఫ్టీ 200 రోజుల డీఎంఏ వద్ద కూడా ఆగకపోవచ్చని నిపుణుల భావన. సోమవారానికి నిఫ్టీ ఇండెక్స్‌షార్ట్స్‌ గత గురువారంతో పోలిస్తే దాదాపు 13వేల కాంట్రాక్టులు పెరిగాయి. ఇదే సమయంలో వీఐఎక్స్‌ 24 శాతం పెరిగి 16.99 శాతానికి చేరి సూచీల్లో మరింత ఒడిదుడుకులను సూచిస్తోంది. మార్కెట్‌ సోమవారం పతనమైన వేగం చూస్తే 200 రోజుల మద్దతు ఆపేలా లేదని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. ఈ నెలకైతే నిఫ్టీ 11800- 12000 పాయింట్ల మధ్యలో ఉండొచ్చని, వచ్చే నెలకు మద్దతు స్థాయిని కోల్పోవచ్చని పేర్కొంది. You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Tuesday 25th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు ఎన్‌టీపీసీ: ఎన్‌ఈఈపీసీఓ లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 100 శాతం, టెహ్రీ హైడ్రో పవర్‌ కాంప్లెక్స్‌లో 74.5 శాతం వాటాను ఎన్‌టీపీసీ కొనుగోలు చేయడానికి సీసీఐ ఆమోదం తెలిపింది. ఐఆర్‌బీ: ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ట్రస్ట్‌లో జీఐసీ అనుబంధ సంస్థ రూ.4,400 కోట్ల పెట్టుబడులు పెడతానని ఒప్పందం చేసుకోగా, తొలిదశలో రూ.3,753 కోట్లును ఐఆర్‌బీకి పెట్టుబడి కింద ఇచ్చింది. ట్రస్ట్‌లో ఐఆర్‌బీకి 51

ఈ కౌంటర్లవైపు విదేశీ ఇన్వెస్టర్ల చూపు

Tuesday 25th February 2020

ఇదీ జాబితా.. అశోక్‌ లేలాండ్‌, రైట్స్‌, సీజీ కన్జూమర్‌ టాటా స్టీల్‌, శ్రీ సిమెంట్స్‌, టాటా గ్లోబల్‌ గత ఆరు నెలలుగా అమ్మకాలకే కట్టుబడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల కొనుగోళ్ల యూటర్న్‌ తీసుకుంటున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు పెరిగాయి. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో కంపెనీలు సాధించిన ప్రోత్సాహకర ఫలితాలు, ఇకపై టర్న్‌అరౌండ్‌ సాధించనున్న అంచనాలు వంటి అంశాలు ఎఫ్‌పీఐలను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Most from this category