News


మార్కెట్ల ర్యాలీ... అయినా అప్రమత్తంగా ఉండాలి..?

Tuesday 27th August 2019
Markets_main1566845277.png-28027

మార్కెట్ల ర్యాలీలో పరుగులు తీయకుండా కాస్త అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌. సోమవారం ఆటుపోట్లతో కొనసాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ భారీగా లాభపడిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పలు వరుస చర్యల వల్ల నిఫ్టీ 228 పాయింట్లు (2.11 శాతం) పెరిగి 11,057.85 వద్ద ముగిసింది. అయితే, మార్కెట్లు ఇకముందూ ఎక్కువ అస్థిరతలతో ఉండొచ్చని, రానున్న సెషన్లలో ట్రేడింగ్‌ శ్రేణి మరింత విస్తృతంగా ఉండొచ్చనారు మిలాన్‌ వైష్ణవ్‌.

 

‘‘హెడ్‌లైన్‌ ఇండెక్స్‌ 20డీఎంఏ పైన ముగిసింది. ఇది 11,004 వద్ద ఉంది. అయితే 200డీఎంఏ అయిన 11,200కు దిగువనే ఉంది. అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా ఇకముందూ తీవ్ర అనిశ్చితితో కొనసాగొచ్చు. ఆగస్ట్‌ 29న గడువు తీరే నిఫ్టీ 11,000 స్ట్రయిక్‌ ధర వద్ద అత్యధికంగా కాల్‌, పుట్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ చోటు చేసుకుంది. మార్కెట్‌ ప్రమాదకరంగా మారింది. వచ్చే వార్తల ఆధారంగా ఎటువైపు అయినా డైరెక్షన్‌ తీసుకోవచ్చు. ట్రేడర్లు ర్యాలీని గుడ్డిగా అనుసరించకుండా ఉండాలి. మంగళవారం సెషన్‌ ఎటువంటి ప్రతికూల వార్తలు లేకపోతే నిలకడగా ఆరంభం కావచ్చు. అమెరికాలో స్టాక్స్‌ బలహీన పడితే అది నిఫ్టీకి కష్టంగా మారుతుంది. గత కీలకమైన స్థాయిలకు మార్కెట్‌ ఇంకా చేరుకోలేదు కనుక ఇప్పటికీ అస్థిరతల నుంచి బయటపడనట్టే. మంగళవారం 11,100, 11,175 నిరోధాలుగా, 10,960 - 10900 మద్దతు స్థాయిలుగా పనిచేస్తాయి. డైలీ చార్ట్‌పై ఆర్‌ఎస్‌ఐ 47.62 స్థాయిలో ఉంది. 14 పీరియడ్‌ హైలో ఉండడం బుల్లిష్‌ను సూచిస్తోంది. డైలీ ఎంఏసీడీ సిగ్నల్‌ లైన్‌కు ఎగువన బుల్లిష్‌ స్థాయిలోనే ఉంది. సోమవారం 10,780-10,800 జోన్‌ తక్షణ బేస్‌గా ధ్రువీకరణ అయింది. ట్రేడర్లు స్టాక్‌ వారీగా పరిమితం అవ్వాలన్నది మా సూచన’’ అని మిలాన్‌ సూచించారు. 



You may be interested

యస్‌ బ్యాంకును మీరూ యావరేజ్‌ చేశారా..?

Tuesday 27th August 2019

పడిపోతున్న కత్తిని చేత్తో పట్టుకునే ప్రయత్నం చేయొద్దంటారు... ఎందుకంటే చేతికి గాయం అవుతుందని. అలాగే, బయటకు తెలియని వాస్తవిక కారణాలతో కుదేలైపోతున్న ఓ స్టాక్‌ను తక్కువకు దొరుకుతుంది కదా అని, కొని డీమ్యాట్‌ ఖాతాలో వేసేసుకుందామని భావిస్తే... పడిపోతున్న కత్తి మీ చేతికి గాయం చేసినట్టుగానే, ఆ షేరు కూడా మీ పెట్టుబడికి చిల్లు పెట్టేస్తుంది. ఈ సుత్తి ఏంటనుకోకండి... ఇదంతా యస్‌ బ్యాంకు గురించి చెప్పేందుకే. గత ఏడాది

4 వారాల్లో లాభాలనిచ్చే 12 స్టాకులు

Monday 26th August 2019

ఆర్ధిక మంత్రి శుక్రవారం ఉద్దీపన చర్యలను ప్రకటించడంతో సోమవారం మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నా 2.10 సమయానికి నిఫ్టీ 50 205 పాయింట్లు లాభపడి 11,034.90 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 735.58 పాయింట్లు లాభపడి 37,436.74 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా నిఫ్టీ రోజువారీ ఎంఏసీడీ ‘బై’ మోడ్‌లో ఉందని సీఎంటీ టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ రీసెర్చ్ హెడ్ జే ఠక్కర్, - ఏవీపీ ఈక్విటీ రీసెర్చ్,  ఆనంద్ రాఠి  షేర్స్‌ అండ్‌ స్టాక్‌

Most from this category