News


ఎన్‌సీఎల్‌టీలో డెలాయిట్‌కు దక్కని ఊరట

Wednesday 21st August 2019
Markets_main1566364839.png-27913

  • ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కేసులో చుక్కెదురు

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ కేసుకు సంబంధించి ఆడిటింగ్ సంస్థలు డెలాయిట్ హాస్కిన్స్‌ అండ్ సెల్స్‌, బీఎస్‌ఆర్‌ అసోసియేట్స్‌కు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో చుక్కెదురైంది. వాటిపై విధించిన నిషేధానికి సంబంధించి తాత్కాలికంగానైనా ఊరటనిచ్చేందుకు ట్రిబ్యునల్ నిరాకరించింది. ఐఎల్‌అండ్ఎఫ్‌ఎస్‌ ఫ్రాడ్‌ కేసులో ముందస్తు షెడ్యూల్ ప్రకారం విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే, సెప్టెంబర్ 20న జరిగే తదుపరి విచారణ దాకా తుది ఉత్తర్వులేవీ జారీ చేయబోమని పేర్కొంది. ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్ ఆడిటింగ్‌ బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తించడంలో విఫలమైనందుకు గాను రెండు సంస్థలపైనా అయిదేళ్ల పాటు నిషేధం విధిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే, దీన్ని సవాలు చేస్తూ డెలాయిట్‌, బీఎస్‌ఆర్‌ తాజాగా ఎన్‌సీఎల్ఏటీని ఆశ్రయించాయి. ఐఎల్‌అండ్ఎఫ్‌ఎస్‌ గ్రూప్ వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు దాదాపు రూ. 95,000 కోట్ల మేర రుణాలు బాకీపడిన సంగతి తెలిసిందే. 



You may be interested

మందగమనంలోకి మీడియా!!

Wednesday 21st August 2019

ఈసారి వృద్ధి 12 శాతానికే పరిమితమయ్యే అవకాశం కేపీఎంజీ నివేదిక ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మీడియా, వినోద రంగం వృద్ధి 12 శాతానికి మాత్రమే పరిమితం కావొచ్చని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఒక నివేదికలో వెల్లడించింది. డిజిటల్ యూజర్ల సంఖ్య, ప్రాంతీయ కంటెంట్‌కు డిమాండ్ గణనీయంగా పెరగడం తదితర అంశాల కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం 13 శాతం వృద్ధి చెంది రూ. 1,63,100 కోట్లకు చేరింది. తాజాగా

రూ.4,000 కోట్లు పెట్టుబడులు పెడతాం

Wednesday 21st August 2019

గ్రేటర్‌ నోయిడాలో మరో ప్లాంట్‌  వెల్లడించిన వివో ఇండియా  జైపూర్‌: చైనా మొబైల్‌ కంపెనీ వివో భారత్‌లో రూ.4,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఇప్పటిదాకా భారత్‌లో రూ.400 కోట్లు పెట్టుబడులు పెట్టామని వివో ఇండియా డైరెక్టర్‌(బ్రాండ్‌ స్ట్రాటజీ) నిపుణ్‌ మర్య తెలిపారు. ప్రస్తుతం నోయిడాలో ఉన్న తమ ప్లాంట్‌ పూర్తి ఉత్పాదక సామర్థ్యంతో ఏడాదికి 2.5 కోట్ల మొబైల్‌ ఫోన్లను ఉత్పత్తి చేస్తోందని వివరించారు. తమ ఫోన్ల కోసం డిమాండ్‌ పెరుగుతోందని, ఈ

Most from this category