STOCKS

News


మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Tuesday 6th August 2019
Markets_main1565076599.png-27576

గతకొద్ది రోజులుగా భారీగా నష్టపోయిన మెటల్‌ షేర్లకు మంగళవారం ట్రేడింగ్‌లో కనిష్టస్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఫలితంగా నేడు లాభాల మార్కెట్లో మెటల్‌ షేర్లు సైతం మెరుస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేడు 2,385.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆరంభం నుంచి మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో ఇండెక్స్‌ 2శాతం లాభపడి 2466.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.12:45ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(2,415.35)తో పోలిస్తే 1.35శాతం లాభంతో 2,448.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా వెల్‌స్పన్‌ కార్ప్‌, కోల్‌ ఇండియా షేర్లు 3.50శాతం లాభపడ్డాయి. జేఎస్‌ఎల్‌హిస్సార్‌ స్టీల్‌ 3శాతం పెరిగింది. ఎన్‌ఎండీసీ, హిందూస్థాన్‌ జింక్‌ 2శాతం,, జిందాల్‌ స్టీల్‌, హిందాల్కో, నాల్కో, మెయిల్‌ షేర్లు 1.50శాతం పెరిగాయి. హిందూస్తాన్‌ కాపర్‌, సెయిల్‌, టాటాస్టీల్‌ షేర్లు 1శాతం నుంచి అరశాతం లాభపడ్డాయి. అలాగే ఏపిల్‌ అపోలో షేర్లు 2శాతం నష్టపోయాయి. వేదాంత, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి.

ఇక ఇదే సమయానికి సెన్సెక్స్‌ 317 పాయింట్ల లాభంతో 37000 పాయింట్లు పైన 37020 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 10957 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

ఫలితాల ఎఫెక్ట్‌...ఎస్‌ఆర్‌ఎఫ్‌ 14 శాతం ర్యాలీ

Tuesday 6th August 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో కంపెనీ ఆశించిన స్థాయిలో ఫలితాలను నమోదు చేయడంతో ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్ షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ క్యూ1 ఫలితాలను ప్రకటించింది. కన్షాలిడేషన్‌ ప్రాతిపదికన కంపెనీ తొలి క్వార్టర్లో నికరలాభం 41 శాతం వృద్ధి చెంది రూ.189.22 కోట్లను ఆర్జించింది. ఆదాయం 9శాతం పెరిగి రూ.1,828 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభం 16 శాతం పుంజుకుని

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 6 శాతం క్రాష్‌

Tuesday 6th August 2019

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లోని 11 శాతం వాటాను ప్రమోటర్లు  ఇన్వెస్కో ఒపెన్‌హీమర్‌కు రూ. 4,224 కోట్లకు విక్రయించిన తర్వాత నుంచి జీ షేరు విలువ వరుస సెషన్‌లలో నష్టాల్లో ట్రేడవుతోంది. జీ షేరు మంగళవారం(అగష్టు 6) మధ్యాహ్నం 12.04 సమయానికి 6.69 శాతం నష్టపోయి రూ. 308.80 వద్ద ట్రేడవుతోంది. కాగా గత సెషన్‌లో ఈ కంపెనీ షేరు రూ. 330.95 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. ఎస్సెల్‌ గ్రూప్‌ ఈ

Most from this category