News


ఈ స్థాయిల్లోనే మార్కెట్లు బోటమ్‌ అవుట్‌: సభర్వాల్‌

Friday 20th September 2019
Markets_main1568919467.png-28438

దేశంలో కార్ల అమ్మకాలు దారుణంగా పడిపోతున్నప్పటికీ... వచ్చే ఏడాది అమ్మకాల్లో 30 శాతం వరకు వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నారు ఆస్క్‌సందీప్‌సభర్వాల్‌ డాట్‌కామ్‌ వ్యవస్థాకపుడు సందీప్‌ సభర్వాల్‌. మార్కెట్లు ఈ స్థాయిలో బోటమ్‌ అవుట్‌ కావచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పలు అంశాలపై ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. 

 

కార్ల అమ్మకాలు పడిపోవడానికి ఓలా, ఊబర్‌ కారణం కాదన్నారు సభర్వాల్‌. మార్కెట్లో నిధుల లభ్యత తగ్గిపోవడమే అమ్మకాలు 25 శాతం పడిపోవడానికి కారణమని ఆయన తేల్చారు. వడ్డీ రేట్లు అధికంగా ఉండడంతోపాటు, రుణ షరతులు కఠినంగా ఉండడం వంటి వాటిని పేర్కొన్నారు. కార్ల అమ్మకాలు గతేడాది ఆగస్ట్‌లో 30 శాతం పెరిగితే ఈ ఏడాది అదే నెలలో 30 శాతం తగ్గాయని, ఇదే కనిష్ట స్థాయి అవుతుందన్నారు. కార్ల అమ్మకాలు 30 శాతం పెరగొచ్చని అంచనా వేశారు. 

 

ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి?
‘‘నిర్మలా సీతారామన్‌ మొదటి మీడియా సమావేశంలో రెండు పెద్ద ప్రకటనలు చేశారు. ఒకటి రూ.75,000 కోట్ల మేర ఇన్‌ఫ్రా కంపెనీలకు నిలిచిపోయిన నిధులను అన్ని పీఎస్‌యూలు, ప్రభుత్వ విభాగాల నుంచి విడుదల చేయిస్తామన్నారు. కానీ, ఇంతవరకు అది జరగలేదు. ఇక ఆ తర్వాత ప్రభుత్వరంగ బ్యాంకులకు తక్షణమే రూ.70,000 కోట్లు అన్నారు. ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి? వెంటనే ఇవ్వడం సాధ్యపడదు. దానికంటూ ఓ ప్రక్రియ ఉంటుంది. ఇక చివరి మీడియా సమావేశంలో ఎగుమతులకు రూ.50వేల కోట్ల రాయితీలు ప్రకటించారు. కానీ, ఆ తర్వాత ప్రస్తుత పథకం స్థానంలో మరో పథకాన్ని తీసుకొస్తున్నట్టు చెప్పారు. దీంతో అదనపు ప్రయోజనాలు ఏవీ లేవు. వారికి (ప్రభుత్వానికి) ఏం చేయాలన్నదానిపై స్పష్టత లేదు. అదృష్టవశాత్తూ ఒక్కసారిగా పెరిగిన చమురు ధర నిలబడలేదు. గత 20 ఏళ్లుగా రెండు సార్లు మార్కెట్లు వరుసగా నాలుగు నెలలు క్షీణించాయి. కానీ ఐదో నెలలో పెరిగాయి. కనుక అక్టోబర్‌ నెలపై ఆశాభావం ఉంది’’

 

మార్కెట్లు ఎప్పుడు పెరుగుతాయి..?
‘‘సెంటిమెంట్‌ అన్నది వేగంగా మారిపోగలదు. ఆర్థిక రంగం బోటమ్‌ అవుట్‌ అయిందన్న చిన్న సంకేతం వచ్చినా పరిస్థితులు మెరుగుపడతాయి. ఎందుకంటే మార్కెట్లు చెప్పుకోతగ్గ స్థాయిలో అమ్మకాలతో ఉన్నాయి. ఇండెక్స్‌లో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల భాగస్వామ్యాన్ని తీసివేస్తే మిగిలిన ఇండెక్స్‌ 20 శాతం పడిపోయి ఉంటుంది. ఈ స్థాయి కరెక్షన్‌ సాధారణంగా ముగిసినట్టే. అంతర్జాతీయంగా వచ్చే ఒకటి రెండేళ్లు ఎటువంటి సంక్షోభం కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే సెంట్రల్‌ బ్యాంకులు తగిన నియంత్రణలతోనే ఉన్నాయి. ఈ స్థాయిలో రుణ సంక్షోభం ఏదీ ఏర్పడడం లేదు. కనుక ఇది సాధారణ కరెక్షన్‌. బోటమ్‌ అవుట్‌ అవుతుంది. ఈ స్థాయిల్లో కావచ్చు. అయితే, కొన్ని వారాల క్రితం కనిష్టాన్ని కోల్పోతే మాత్రం మరో 200-300 పాయింట్ల మేర క్షీణించొచ్చు’’ అని సభర్వాల్‌ వివరించారు. You may be interested

ఈ షేర్లు.. ఏడారిలో మంచినీటి చెలమలు..?

Friday 20th September 2019

ఈ ఏడాది ఇంత వరకు ఇన్వెస్టర్లకు స్టాక్‌ మార్కెట్లు నికరంగా లాభాలను ఇచ్చిందేమీ లేదు. చాలా స్టాక్స్‌ కొత్త కనిష్టాలకు చేరాయి. ఇంకా పడిపోతూనే ఉ‍న్నాయి. కానీ, ఇంత ప్రతికూల వాతావరణంలోనూ ఇటీవల ఐపీవోలు ముగించుకుని స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయిన కొన్ని మాత్రం లాభాల మెరుపులు మెరిపిస్తున్నాయి.    హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఈ షేరు ఈ నెల 12న రూ.2,697.50 ధర పలికింది. అదే రోజు నాటికి, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ జూన్‌ 4న

సెన్సెక్స్‌ నష్టం 476 పాయింట్లు

Thursday 19th September 2019

136 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ మార్కెట్‌ లాభాల ముగింపు ఒకరోజుకే పరిమితమైంది. సూచీలు గురువారం మరోసారి భారీ పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్‌  470 పాయింట్లను కోల్పోయి 36,093.47 వద్ద, నిఫ్టీ 136 పాయింట్లు నష్టపోయి 10,705 వద్ద స్థిరపడ్డాయి. ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ నిన్నరాత్రి అందరి అంచనాలకు తగ్గట్లుగానే వడ్డీరేట్లపై పావుశాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే లేబర్‌ మార్కెట్‌ బలంగా ఉన్నందున రేట్ల కోత ఈ ఏడాది ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో భవిష్యత్‌లో

Most from this category