News


క్యూ2 ఫలితాలే దిక్సూచీ..!

Monday 21st October 2019
Markets_main1571630527.png-29016

  • ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, 
  • మారుతీ సుజుకీ, బజాజ్‌ ఆటో, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌,  
  • ఇండిగో, టాటా మోటార్స్‌ ఫలితాలు ఈవారంలోనే.. 
  • బ్రెగ్జిట్‌ పరిణామాలపై మార్కెట్‌ దృష్టి-
  • మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా సోమవారం సెలవు

న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ కంపెనీల క్యూ2 ఫలితాల ప్రకటనలు, బ్రెగ్జిట్‌ పరిణామాలు, స్థూల ఆర్థిక అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక (జూలై-సెప్టెంబర్‌) ఫలితాలు ఆశాజనకంగా ఉండడం, ఇక నుంచి వెల్లడికానున్న ఫలితాలపై మార్కెట్‌ పాజిటివ్‌గా ఉన్నందున ర్యాలీకి అవకాశం ఉందని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోడీ అన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ పన్నుల భారాన్ని తగ్గించిన దగ్గర నుంచి మార్కెట్‌ ఊర్థ్వముఖంగా కొనసాగుతూనే ఉంది. అప్పటివరకు ఉన్న భయాలను ఒక్కసారిగా విదుల్చుకుని పరుగులు ప్రారంభించింది. దీంతో దేశీ ఇన్వెస్టర్లతో పాటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడులు కూడా మార్కెట్‌లో జోరుగా కొనసాగుతున్నాయి. గతవారంలోనే దేశీ ప్రధాన సూచీలు 3 శాతం పెరగ్గా, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 4 శాతం, స్మాల్‌క్యాప్‌ 3 శాతం పెరిగాయి. నిఫ్టీ ఆటో, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, మెటల్, ఫార్మా రంగాలు 3.5 నుంచి 8 శాతం వరకు లాభపడ్డాయి. ఇక ఈవారంలో ఫలితాల ఆధారంగా ఆయా కంపెనీలకు కొనుగోలు మద్ధతు ఉంటుందని భావిస్తున్నాం. ముఖ్యంగా స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌లో కొనుగోళ్లు ఉండనున్నాయి’ అని విశ్లేషించారు. 

  • 300 కంపెనీల ఫలితాలు...

ఈవారంలో 300 కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుండగా.. నిఫ్టీ 50 జాబితాలోని 16 కంపెనీలు ఈవారంలోనే ఫలితాలను వెల్లడించనున్నాయి. వీటిలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ఉండగా.. ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్నాయి. భారతి ఇన్‌ఫ్రాటెల్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్ అండ్ టీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హీరో మోటోకార్ప్, ఐటీసీ, మారుతి సుజుకి, టాటా మోటార్స్ ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇతర ప్రధాన కంపెనీల్లో ఆర్‌బీఎల్ బ్యాంక్, ఎం అండ్ ఎం ఫైనాన్షియల్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, హావెల్స్, హెచ్‌డీఎఫ్‌సి లైఫ్, బయోకాన్, బంధన్ బ్యాంక్, కోల్‌గేట్, ఇంటర్‌గ్లోబ్, యునైటెడ్ స్పిరిట్స్, మారికో, హెచ్‌డీఎఫ్‌సి ఏఎంసీ క్యూ2 ఫలితాలను ప్రకటించనున్నాయి.

  • అంతర్జాతీయ అంశాల ప్రభావం...

యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)తో కుదుర్చుకున్న బ్రెగ్జిట్‌ ఒప్పందం జాప్యం కానుందని శనివారం వార్తలు వెలువడిగా.. ఈ అంశం మార్కెట్‌పై తాత్కాలిక ప్రభావమే చూపుతుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశానికి తోడు అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఒప్పందాలు ప్రభావం చూపనున్నాయని భావిస్తున్నాయి. ఇక యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) ఈనెల 24న (గురువారం )వడ్డీ రేటు నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఇదే రోజున అమెరికా మార్కిట్ తయారీ రంగ పీఎంఐ, సేవారంగ పీఎంఐ వెల్లడికానున్నాయి.

  • రూ. 5,072 కోట్ల ఎఫ్‌ఐఐ పెట్టుబడి

అక్టోబర్‌ 1–18 కాలానికి ఎఫ్‌ఐఐలు భారత ఈక్విటీ మార్కెట్లో రూ. 4,970 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. ఈకాలంలో వీరు డెట్‌ మార్కెట్లో రూ. 102 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా ఈనెల్లో వీరి నికర పెట్టుబడి రూ. 5,072 కోట్లుగా నిలిచింది.  You may be interested

ట్రేడింగ్‌ ఆదాయంపై పన్ను చెల్లించాలా..?

Monday 21st October 2019

ఇంట్రాడే ట్రేడింగ్‌ లాభ, నష్టాలు వ్యాపారాదాయమే  ఈక్విటీ అయితే స్పెక్యులేటివ్‌ ఎఫ్‌అండ్‌వో అయితే నాన్‌ స్పెక్యులేటివ్‌ ఈ ఆదాయాలు వ్యక్తిగత ఆదాయానికి కలుస్తాయి శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సిందే నష్టాలు వస్తే ఇతర ఆదాయంలో సర్దుబాటు రూ.కోటి దాటితే ట్యాక్స్‌ ఆడిట్‌ ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారు... స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ ఆదాయాన్ని చూపించడం, పన్ను చెల్లించడం తప్పనిసరి. అయితే, ఈ విషయమై స్పష్టమైన అవగాహన  తక్కువ మందిలోనే ఉంటుందని చెప్పుకోవాలి. నేటి తరం యువతలో చాలా మంది

నేడు మార్కెట్లకు సెలవు

Monday 21st October 2019

మహారాష్ట్ర ఎన్నికల  సందర్భం‍గా సోమవారం మార్కెట్లకు సెలవు దినం. నేడు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు. అలాగే ఫారెక్స్‌ మార్కెట్‌కు కూడా సెలవు. కమోడిటీ ఎక్చ్సేంజ్‌ మాత్రం మధ్యాహ్నం వరకు పనిచేయదు. సాయంత్రం 5గం.లకు ట్రేడింగ్‌ ప్రారంభవుతోంది. స్టాక్‌ మార్కెట్‌ తిరిగి యథావిధిగా రేపు (మంగళవారం) ప్రారంభమవుతుంది. కావున ఈ వారంలో స్టాక్‌ మార్కెట్ 4రోజులు మాత్రమే పనిచేస్తుంది. ఇక శనివారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 246 పాయింట్ల లాభంతో 39,298 పాయింట్ల

Most from this category