News


గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ నేడు!

Thursday 19th March 2020
Markets_main1584587840.png-32568

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 369 పాయింట్లు డౌన్‌
ప్రపంచ మార్కెట్లలో కరోనా విలయం
అమెరికా, యూరప్‌, ఆసియా నేలచూపు

నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి పతనం(గ్యాప్‌ డౌన్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం  8.30 ప్రాంతం‍లో 369 పాయింట్లు పడిపోయి 8,073 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 8,442 పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. చైనాలోని వుహాన్‌లో పుట్టి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా.. మూడు వారాలుగా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో నష్టాల సునామీ సృష్టిస్తోంది. ఈ బాటలో బుధవారం సైత​ం అమెరికా స్టాక్‌ మార్కెట్లు 6 శాతం పతనంకాగా, యూరోపియన్‌ ఇండెక్సులు 4 శాతం వెనకడుగు వేశాయి. ఇక ప్రస్తుతం ఆసియాలోనూ డౌన్‌ట్రెండ్‌ కనిపిస్తోంది. దీంతో నేడు దేశీయంగానూ మరోసారి అమ్మకాలు ఊపందుకునే వీలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో భయాలు చెలరేగడంతో సెంటిమెంటు దెబ్బతిన్నట్లు తెలియజేశారు. కాగా.. దేశీయంగా కరోనా కేసులు పెరుగుతుండటం, అంతర్జాతీయంగా పలు దేశాలలో సంభవిస్తున్న వైరస్‌ మరణాలు బుధవారం దేశీ మార్కెట్లను పడగొట్టాయి. సెన్సెక్స్‌ 1710 పాయింట్లు పడిపోయి  28,869 వద్ద నిలవగా.. నిఫ్టీ 498 పాయింట్లు పతనమై 8,469 వద్ద ముగిసింది. వెరసి సెన్సెక్స్‌ 29,000 పాయింట్ల మైలురాయి దిగువకు చేరగా..  మూడేళ్ల తదుపరి నిఫ్టీ 8,500 పాయింట్ల స్థాయినీ కోల్పోయింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 8,208 పాయింట్ల వద్ద, తదుపరి 7,947 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు   భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 8,929 పాయింట్ల వద్ద, ఆపై 9,388 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు.  ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 19,717 పాయింట్ల వద్ద, తదుపరి 18,854 వద్దపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత  21,994 పాయింట్ల వద్ద, తదుపరి 23,408 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. 

భారీ విక్రయాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 5085 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌  (డీఐఐలు) రూ. 3636 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 4045 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 3422 కోట్లను ఇన్వెస్ట్‌  చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 3810 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 2615  కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.   



You may be interested

మార్కెట్లోకి ఫోక్స్‌వ్యాగన్‌ టీ-రాక్‌

Thursday 19th March 2020

- ప్రారంభ ధర రూ. 19.99 లక్షలు  న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్‌.. ‘టీ-రాక్‌’ పేరిట తన సరికొత్త స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ (ఎస్‌యూవీ)ను బుధవారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చిన ఈ కారు ధర రూ. 19.99 లక్షలుగా ప్రకటించింది. ఈ అధునాతన ఎస్‌యూవీ 8.4 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. టాప్‌

యస్‌ బ్యాంక్‌పై మారటోరియం ఎత్తివేత

Thursday 19th March 2020

- బ్యాంకింగ్ సేవలన్నీ పునరుద్ధరణ - మూడు రోజుల పాటు వేళల పొడిగింపు ముంబై:  ప్రైవేట్ రంగ యస్ ‍బ్యాంక్ 13 రోజుల తర్వాత మారటోరియంపరమైన ఆంక్షల నుంచి బైటపడింది. బుధవారం సాయంత్రం 6 గం.ల నుంచి పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలను పునరుద్ధరించింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు బ్యాంకింగ్ వేళలను కూడా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం మార్చి 19 నుంచి 21 దాకా ఉదయం 8.30 గం.లకే

Most from this category