News


38 సెషన్లలలో రూ. 46 లక్షల కోట్లు ఫట్‌

Friday 13th March 2020
Markets_main1584081995.png-32459

కరోనా వైరస్‌ కల్లోలం
బేర్‌ ట్రెండ్‌లోకి దేశీ స్టాక్‌ మార్కెట్లు
గరిష్టం నుంచి 27 శాతం పతనం
38 సెషన్లలో రూ. 46 లక్షల కోట్లు ఆవిరి
అమెరికా మార్కెట్లలో మరింత నష్టం 

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ చివరికి ప్రపంచ దేశాలన్నింటికీ పాకడంతో స్టాక్‌ మార్కెట్లు వణుకుతున్నాయి. అమెరికా, యూరప్‌, ఆసియా మార్కెట్లు ఉన్నట్టుండి బేర్‌ ట్రెండ్‌లో పడ్డాయి. ఈ బాటలో దేశీయంగానూ ఇటీవల కొద్ది రోజులుగా అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్లు బేర్‌మంటున్నాయి. వెరసి డోజోన్స్‌ నుంచి సెన్సెక్స్‌ వరకూ ఇండెక్సులు గత నెల- రెండు నెలలల కాలంలో 27 శాతంపైగా పతనమయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ కర్పూరంలా ఆవిరౌతోంది. 

రూ. 113 లక్షల కోట్లకు
దేశీయంగా గత 38 సెషన్లలో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ(కేపిటలైజేషన్‌)లో రూ. 46 లక్షల కోట్లమేర తుడిచిపెట్టుకుపోయింది. నేటి(శుక్రవారం) ట్రేడింగ్‌లో మార్కెట్లు ప్రారంభమైన ఐదు నిముషాల్లోనే 10 శాతం కుప్పకూలడంతో మొత్తం లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ. 113.5 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది జనవరి 20న ఈ విలువ రూ. 159.3 లక్షల కోట్లుగా నమోదైంది. 

11.5 ట్రిలియన్‌ డాలర్లు ఫట్‌
2016లో ప్రెసిడెంట్‌గా ట్రంప్‌ ఎన్నికయ్యాక ర్యాలీ బాటలో సాగిన అమెరికా స్టాక్‌ మార్కెట్లు కరోనా ధాటికి కొంత కాలంగా కుదేలయ్యాయి. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరికల్లా అమెరికన్‌ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి. అయితే అంతర్జాతీయ స్థాయిలోనూ కరోనా సునామీలా విరుచుకుపడటం మొదలయ్యాక మార్కెట్లు పతన బాట పట్టాయి. ఫిబ్రవరి 19న నమోదైన 35 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ కేపిటలైజేషన్‌కు గత నెల రోజుల్లోనే ఏకంగా 11.5 ట్రిలియన్‌ డాలర్లమేర చిల్లు పడింది.  

తీవ్రత ఇలా
జనవరి 20 నుంచీ చూస్తే సెన్సెక్స్‌లో ప్రాతినిధ్యం వహించే ఏ ఒక్క కంపెనీ షేరూ సానుకూల ఫలితాలు ఇవ్వకపోవడం గమనార్హమని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇండెక్స్‌లో భాగమైన పీఎస్‌యూ ఓఎన్‌జీసీ అయితే ఏకంగా 55 శాతం కుప్పకూలింది. రూ. 122 నుంచి రూ. 56కు చేరింది. ఈ బాటలో ఇతర దిగ్గజాలు టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ, స్టేట్‌బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా సైతం 25-50 శాతం మధ్య పడ్డాయంటే అమ్మకాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇందుకు ప్రధానంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కారణమవుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ మార్చి నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు నగదు విభాగంలో రూ. 23,000 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టడం గమనించదగ్గ అంశం.

1058 షేర్లు కనిష్టాలకు
నేటి మార్కెట్‌ పతనంలో ఏకంగా 1058 షేర్లు ఎన్‌ఎస్‌ఈలో 52 వారాల కనిష్టాలకు చేరాయి. జాబితాలో ఆర్‌ఐఎల్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఆటో, యాక్సిస్‌ బ్యాంక్‌, హిందాల్కో తదితర దిగ్గజ కంపెనీలతోపాటు పలు మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ చోటు చేసుకున్నాయి. ఇతర ప్రధాన కంపెనీలలో బీఈఎంఎల్‌, సియట్‌, జీఎస్‌కే ఫార్మా, ఇండిగో తదితరాలున్నాయి.You may be interested

మార్కెట్ల జోష్‌- అరబిందో, ఎస్‌బీఐ హైజంప్‌

Friday 13th March 2020

ప్రపంచ మార్కెట్ల బాటలో ఉన్నట్టుండి కుప్పకూలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి డ్రమటిక్‌గా కోలుకున్నాయి. ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌, ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, తగిన చర్యలు తీసుకుంటామంటూ సెబీ ప్రకటన వంటి అంశాలు సెంటిమెంటుకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మధ్యాహ్నం 12.40 ప్రాంతంలో సెన్సెక్స్‌ 832 పాయింట్లు దూసుకెళ్లి 33,610కు చేరగా.. నిఫ్టీ 305 పాయింట్లు జంప్‌చేసి 9,895 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ

ఏడాది కనిష్టానికి పతనమైన షేర్లు

Friday 13th March 2020

శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో 52 వారాల కనిష్టానికి 1142 షేర్లు పడిపోయాయి. వీటిలో 20 మైక్రాన్స్‌, 3ఐ ఇన్ఫోటెక్‌,5 పైసా క్యాపిటల్‌, 63 మూన్స్‌ టెక్నాలజీస్‌, ఆర్తి డ్రగ్స్‌,ఆరీవ్‌ డెనిమ్స్‌ అండ్‌ ఎక్‌పోర్ట్స్‌, అబాన్‌ ఆఫ్‌షోర్‌, ఏబీబీ ఇండియా, ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌, ఆదిత్యా బిర్లా సన్‌ లైఫ్‌ బ్యాంకింగ్‌, ఆదిత్యా బిర్లా సన్‌ లైఫ్‌ నిఫ్టీ నెక్ట్స్‌ 50 ఈటీఎఫ్‌, ఏసీసీ, యాక్షన్‌ కనస్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌, అదానీ గ్యాస్‌, అదానీ

Most from this category