News


ఎల్‌అండ్‌టీ టెక్‌, ఉజ్జీవన్‌ జోరు- ఐటీఐ బోర్లా

Thursday 23rd January 2020
Markets_main1579756753.png-31128

కరోనా వైరస్‌ భయాలతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు నీరసించినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో లాభాలతో కదులుతున్నాయి. ఉదయం 10.20 ప్రాంతంలో సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ చేసింది. 208 పాయింట్లు పెరిగి 41,324కు చేరింది. నిఫ్టీ సైతం 63 పాయింట్లు పుంజుకుని 12,169 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల ఆధారంగా ఐటీ సేవల కంపెనీ ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటుంటే..  టెలికం పీఎస్‌యూ ఐటీఐ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వివరాలు చూద్దాం..

ఎల్‌అండ్‌టీ టెక్నాలజీస్‌
డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ గ్రూప్‌లోని ఐటీ సేవల కంపెనీ ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌.. చిప్‌ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్‌ టెక్నాలజీస్‌తో చేతులు కలిపింది. తద్వారా క్వాల్‌కామ్‌ స్మార్ట్‌సిటీస్‌ యాక్సెలరేటర్‌ ప్రోగ్రామ్‌లో కార్యకలాపాలు విస్తరించన్నుట్లు ఎల్‌అండ్‌టీ టెక్నాలజీస్‌ తెలియజేసింది. పట్టణ మౌలికసదుపాయాల అభివృద్ధిలో భాగంగా డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ సేవలు కల్పించే గ్లోబల్‌ కంపెనీలకు ఎకోస్మార్ట్‌ సొల్యూషన్స్‌ అందించనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎల్‌అండ్‌టీ టెక్నాలజీస్‌ షేరు 3.5 శాతం ఎగసి రూ. 1690 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1698 వరకూ జంప్‌చేసింది. ఎల్‌అండ్‌టీ టెక్నాలజీలో ప్రమోటర్లకు 74.74% వాటా ఉంది.

ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.3 శాతం జం‍ప్‌చేసి రూ. 53.5 వద్ద ట్రేడవుతోంది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ నికర లాభం 98 శాతం ఎగసి రూ. 90 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 52 శాతం పుంజుకుని రూ. 426 కోట్లను అధిగమించింది. అయితే త్రైమాసిక ప్రాతిపదికన ప్రొవిజన్లు రూ. 25 కోట్ల నుంచి రూ. 30.5 కోట్లకు పెరిగాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 0.85 శాతం నుంచి 0.95 శాతానికి చేరగా.. నికర ఎన్‌పీఏలు 0.33 శాతం నుం‍చి 0.38 శాతానికి పెరిగాయి.

ఐటీఐ లిమిటెడ్‌
ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ ఐటీఐ లిమిటెడ్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఎఫ్‌పీవో)లో భాగంగా షేరుకి రూ. 72-77 ధరల శ్రేణిని ప్రకటించింది. తద్వారా రూ. 1400 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. నిధులను వర్కింగ్‌ కేపిటల్‌ అవసరాలతోపాటు.. రుణ చెల్లింపులకు వినయోగించనున్నట్లు ఐటీఐ లిమిటెడ్‌ తెలియజేసింది. శుక్రవారం ప్రారంభంకానున్న ఎఫ్‌పీవోలో భాగంగా 18 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనున్నట్లు వెల్లడించింది. అర్హులైన ఉద్యోగులకు మరో 18 లక్షల షేర్లను కేటాయించనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐటీఐ లిమిటెడ్‌ షేరు దాదాపు 6 శాతం పతనమైంది. రూ. 94 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 92 వద్ద కనిష్టాన్ని తాకింది.
 



You may be interested

యస్‌బ్యాంక్‌ కుప్పకూలనివ్వం!

Thursday 23rd January 2020

ఎస్‌బీఐ చీఫ్‌ యస్‌బ్యాంకు సమస్యల నుంచి బయటపడి మనుగడ సాగించేందుకు కొన్ని పరిష్కారమార్గాలు తప్పక దొరుకుతాయని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ రజనీశ్‌ కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మూలధన సమీకరణ కోసం యస్‌బ్యాంక్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే! ‘‘మార్కెట్‌లో యస్‌బ్యాంకు ఒక ప్రముఖమైన బ్యాంకు, దాదాపు 4000 కోట్ల డాలర్ల బాలెన్స్‌ షీటున్న బ్యాంకు’’ అని ఆయన దావోస్‌లో చెప్పారు. ఇంత ప్రాముఖ్యతున్న బ్యాంకు కుప్పకూలే పరిస్థితి రాదన్నది

యాక్సిస్‌ బ్యాంకుపై బ్రోకరేజ్‌లు ఏమంటున్నాయి?!

Thursday 23rd January 2020

 యాక్సిస్‌ బ్యాంకు ఫలితాల నేపథ్యంలో బ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి.. 1. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 830. అధిక ప్రొవిజన్స్‌, స్లిపేజ్‌ల కారణంగా ఆర్థిక సంవత్సరం ఎర్నింగ్స్‌ను తగ్గించింది. బ్యాంకింగ్‌ రంగంలో ఇతర బ్యాంకులకు మంచి పోటీ ఇస్తుందని అంచనా వేసింది.  2. కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌: రెడ్యూస్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 740. ఆదాయాలు మిశ్రమంగా ఉన్నాయి. ఎన్‌ఐఐ బాగున్నా, ఆదాయ వృద్ధి తగ్గడం,

Most from this category