News


త్వరలో ఐఆర్‌సీటీసీ ఐపీఓ

Friday 23rd August 2019
Markets_main1566541423.png-27970

  • ఇష్యూ సైజు రూ.500-600 కోట్లు 

న్యూఢిల్లీ: ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ)  త్వరలో ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు రానున్నది. రైల్వేలకు చెందిన ఈ కంపెనీ ఇటీవలనే ఐపీఓ ముసాయిదా  పత్రాలను మార్కెట్‌ నియంత్రణ సం‍స్థ, సెబీకి సమర్పించింది. ఐపీఓలో భాగంగా రూ.10 ముఖ విలువ గల దాదాపు 2 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో విక్రయించనున్నారు. ఈ ఐపీఓ సైజు రూ.500-600 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. 


ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌, యస్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా) వ్యవహరిస్తున్నాయి. 

రైల్వేలకు కేటరింగ్ సర్వీసులు, ఆన్‌లైన్‌ ద్వారా రైల్వే టికెట్ల విక్రయం తదితర సర్వీసులు  అందజేసే ఏకైక అధికారిక కంపెనీ ఐఆర్‌సీటీసీయే. ఈ కేటరింగ్‌, ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌లు, బడ్జెట్‌ హోటళ్లు వంటి ఇతర వ్యాపార విభాగాల్లో కూడా ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో రైల్‌ నీర్‌ బ్రాండ్‌ తాగు నీటిని విక్రయిస్తోంది. మొత్తం మీద  ఈ కంపెనీ నాలుగు వ్యాపార సెగ్మెంట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంటర్నెట్‌ టికెటింగ్‌, కేటరింగ్‌, ప్యాకేజ్‌డ్‌ డ్రింకింగ్‌ వాటా, ట్రావెల్‌ అండ్‌ టూరిజమ్‌ విభాగాల్లో తన సేవలను ఐఆర్‌సీటీసీ అందిస్తోంది. 



You may be interested

లాభాల్లో ఒరాకిల్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు

Friday 23rd August 2019

దేశియ కరెన్సీ డాలర్‌ మారకంలో 8 నెలల కనిష్ఠానికి పడిపోవడంతో శుక్రవారం ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఉదయం 11.50 సమయానికి 1.14 శాతం లాభపడి 15,810.65 వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవి వెయిట్‌ షేర్లయిన ఒరాకిల్‌ (ఓఎఫ్‌ఎస్‌ఎస్‌) 3.20 శాతం లాభపడి రూ. 3,002.00 వద్ద, టీసీఎస్‌ 1.33 శాతం లాభపడి రూ. 2,245.45 వద్ద, ఇన్ఫోసిస్‌ 0.75 శాతం లాభపడి

మధ్యాహ్న భోజనానికి భారతీ ఆక్సా లైఫ్‌ చేయూత

Friday 23rd August 2019

హైదరాబాద్‌: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమానికి చేయూతనిచ్చేందుకు భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ముందుకు వచ్చింది. సంస్థ 13వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అక్షయపాత్ర ఫౌండేషన్‌తో చేతులు కలిపింది. ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా అందించాలని తన ఉద్యోగులకు పిలుపునిచ్చింది. కడుపునిండా ఆహారం ఉంటే విద్యార్థులు మరింత మంచిగా చదువుకోగలరని తాము నమ్ముతున్నట్టు భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో వికాస్‌సేత్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 15,000 పాఠశాల్లలో

Most from this category