STOCKS

News


సెన్సెక్స్‌ 37,810 స్థాయిని అధిగమిస్తే....

Monday 12th August 2019
Markets_main1565592556.png-27712

  • సెన్సెక్స్‌ 37,810 స్థాయిని అధిగమిస్తే....

బడ్జెట్‌ ప్రతిపాదనల్లో విదేశీ ఇన్వెస్టర్లను బాధించిన ఆదాయపు పన్ను సర్‌ఛార్జ్‌ ఎత్తివేత, టర్నోవర్‌తో సంబంధం లేకుండా అన్ని కంపెనీలకు కార్పొరేట్‌ టాక్‌​‍్స తగ్గింపు, మూడేళ్లకు పైబడిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను, డివిడెండు పంపిణీ పన్ను మినహాయింపులు వంటి స్నేహపూరిత చర్యల్ని ప్రభుత్వం ప్రకటించనున్నదనే వార్తలతో గతవారం నాటకీయంగా మార్కెట్‌ ర్యాలీ జరిపింది. శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత ప్రధాన విదేశీ ఫండ్స్‌ ప్రతినిధులతో ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులు సమావేశం కూడా జరిపారు. మరోవైపు చైనాతో ఇప్పట్లో వాణిజ్య అంగీకారం కుదరబోదంటూ అదేరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. అలాగే అమెరికా టారీఫ్‌లను ఎదుర్కొనేందుకు చైనా...తన కరెన్సీ యువాన్‌ను తీవ్రంగా క్షీణింపచేయడంతో ఇతర ఆసియా కరెన్సీల్లానే మన రూపాయి విలువ కూడా తగ్గిపోతున్నది. గతవారం ద్వితీయార్థంలో భారత్‌ స్టాక్‌ సూచీలు పెరిగినా, రూపాయి మాత్రం పుంజుకోలేదు. ఇటువంటి అంతర్జాతీయ అనిశ్చిఽతస్థితిలో కేంద్రం పన్ను మినహాయింపు ప్రతిపాదనలు వెల్లడిస్తే....వాటిపై మార్కెట్‌ సానుకూలంగా స్పందిస్తుందా..లేదా?. ఈ అంశమే మధ్యకాలిక మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్దేశించవచ్చు. ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...,

సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
ఆగస్టు 9తో ముగిసిన వారంలో తొలిరోజున బలహీనంగా ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌  గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన 36,450 పాయింట్ల దిగువకు పడిపోయింది. అటుతర్వాత వారంలో చివరి రెండు రోజుల్లో పెద్ద ర్యాలీ సాగించి 37,807 పాయింట్ల గరిష్టస్థాయిని తాకింది. చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 464 పాయింట్ల లాభంతో 37,582 పాయింట్ల వద్ద ముగిసింది. గత నాలుగువారాల్లో సెన్సెక్స్‌ లాభంతో ముగిసిన వారమిదే. ఈ వారంలో తొలి ట్రేడింగ్‌ రోజైన మంగళవారం సెన్సెక్స్‌ రిలీఫ్‌ర్యాలీని కొనసాగిస్తే మరోదఫా 37,810 పాయింట్ల వద్దకు చేరవచ్చు. ఈ స్థాయిని దాటితే వేగంగా 37,950 పాయింట్ల వద్దకు , అటుపైన 38,170-38,330 పాయింట్ల శ్రేణి వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోయినా, బలహీనంగా మొదలైనా 37,405 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వేగంగా  37.100 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఆ లోపున 36,650 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగే అవకాశం వుంది.  

నిఫ్టీ కీలక స్థాయి 11,165...
క్రితం వారం తొలిరోజున ఎన్‌ఎస్‌ఈ గత కాలమ్‌లో ప్రస్తావించిన 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి అయిన 10,805 పాయింట్ల దిగువకు తగ్గినప్పటికీ, ముగింపులో ఆ స్థాయిని పరిరక్షించుకోగలిగింది. ఆపైన గతవారం ద్వితీయార్థంలో వేగంగా పెరిగి 11,181 పాయింట్ల గరిష్టస్థాయిని అందుకుంది. ఇదేస్థాయికి 11,165 పాయింట్ల సమీపాన కదులుతున్న 200 రోజుల చలన సగటు రేఖను ఇంట్రాడేలో చేధించినా, ఆ దిగువనే 11,110 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి 11,165 పాయింట్ల స్థాయి కీలకమైనది. ఈ లోపున బలహీనంగానూ, ఆపైన బలంగానూ ట్రేడ్‌కావొచ్చు. ఈ వారం మార్కెట్‌ పెరిగితే 11,180 పాయింట్ల సమీపంలో తొలి నిరోధం కలగవచ్చు. అటుపైన వేగంగా 11,265 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే క్రమేపీ 11,310-11,360 పాయింట్ల శ్రేణి వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం మార్కెట్‌ క్షీణిస్తే తొలుత నిఫ్టీకి 11,055 పాయింట్ల వద్ద మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 10,975 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ లోపున 10,840 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు.You may be interested

ట్రెండ్‌ రివర్సల్‌ సిగ్నలిస్తున్న లాంగ్‌- షార్ట్‌ నిష్పత్తి?!

Monday 12th August 2019

కనిష్ఠస్థాయిలకు చేరడం అప్‌మూవ్‌కు సంకేతమంటున్న నిపుణులు ఆగస్టు సీరిస్‌లో ఎఫ్‌పీఐల ఇండెక్స్‌ లాంగ్‌- షార్ట్‌ నిష్పత్తి 0.48కు పడిపోయింది. గత ఏడేళ్లలో ఇలాంటి మార్పు కనిపించడం చాలా ఆరుదుగా జరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నిష్పత్తి పడిపోతూ కనిష్ఠాలకు చేరడం మార్కెట్‌కు దిగువస్థాయిల్లో మద్దతు దొరకడానికి సంకేతంగా, అప్‌మూవ్‌కు తొలిమెట్టుగా టెక్నికల్‌ అనలిస్టులు భావిస్తారు. ఆగస్టు డెరివేటివ్స్‌ ముగింపు నాటికి నిఫ్టీలో సరాసరిన దాదాపు 6 శాతం అప్‌మూవ్‌ ఉండొచ్చని ఈ

నష్టాలొస్తున్నాయి... సిప్‌లు ఆపేయాలా ?

Monday 12th August 2019

ధీరేంద్ర కుమార్‌ (సీఈవో, వాల్యూ రీసెర్చ్) ప్ర: నేను 2017 నుంచి కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో సుందరమ్‌ రూరల్‌ అండ్‌ కంజప్షన్‌ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌–క్యాప్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్, ఎల్‌ అండ్‌ టీ ఇండియా వేల్యూ ఫండ్, టాటా ఈక్విటీ పీఈ ఫండ్‌లు ఉన్నాయి. ఈ ఫండ్స్‌లో 2017 నుంచి సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)లు ప్రారంభించాను. అయితే ఈ ఫండ్స్‌ నష్టాలు చూపడంతో 2018లో సిప్‌లు

Most from this category