News


సెన్సెక్స్‌ 37,190 స్థాయిని అధిగమిస్తే...

Monday 9th September 2019
Markets_main1568002937.png-28262

ఎఫ్‌పీఐలపై బడ్జెట్లో పెంచిన ఆదాయపు పన్ను సర్‌ఛార్జ్‌ ఉపసంహరణ, ప్రభుత్వ రంగ బ్యాంకులకు అదనపు మూలధన కల్పన, ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల లభ్యత వంటి సానుకూల ‍ప్రకటనలు కేంద్రం నుంచి వెలువడినప్పటికీ, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడంతో భారత్‌ మార్కెట్‌...అంతర్జాతీయ ట్రెండ్‌కు భిన్నంగా గతవారం నష్టాలతో ముగిసింది. మరోవైపు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు పునర్‌ప్రారంభంకానున్నట్లు వెలువడిన వార్తలు, వచ్చే ఫెడ్‌ మీటింగ్‌లో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లన్నీ ర్యాలీ జరిపాయి. భారత్‌ మార్కెట్‌...అంతర్జాతీయ సూచీల ట్రెండ్‌ను అనుసరించాలంటే, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి ఇక్కడ పెట్టుబడులకు ఉపక్రమించాల్సివుంటుంది. ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...,

సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
క్యూ1లో జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి తగ్గిందన్న వార్తతో సెప్టెంబర్‌ 3న గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ వేగంగా 36,409 పాయింట్ల వద్దకు పతనమయ్యింది. అటుతర్వాత క్రమేపీ కోలుకుని 37,010 పాయింట్ల గరిష్టస్థాయికి చేరింది. చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 351 పాయింట్ల నష్టంతో 36,982 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం ద్వితీయార్థంలో జరిగిన రికవరీ ఈ వారం కొనసాగితే  సెన్సెక్స్‌కు తొలుత 37,190 పాయింట్ల వద్ద నిరోధం కలగవచ్చు. ఈ స్థాయిని దాటితే వేగంగా 37,400 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన ముగిస్తే 37,730 స్థాయిని అందుకోవొచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని అధిగమించలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా 36,730 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభ్యమవుతున్నది. ఈ స్థాయిని కోల్పోతే 36,540 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయి దిగువన క్రమేపీ తిరిగి 36,410 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. 

నిఫ్టీ 10,970పైన పాజిటివ్‌...
 గతకాలమ్‌లో సూచించిన రీతిలో క్రితం వారం ప్రధమార్థంలో 10,750 పాయింట్ల కనిష్టస్థాయివరకూ తగ్గిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ద్వితీయార్థంలో కోలుకుని 10,957 పాయింట్ల వరకూ పెరిగింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 77 పాయింట్ల నష్టంతో 10,946 పాయింట్ల వద్ద ముగిసింది. ఈవారం నిఫ్టీ పెరిగితే 10,970 పాయింట్ల సమీపంలో తొలి నిరోధం కలగవచ్చు. ఈ స్థాయిని దాటితే 11,040 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపైన ముగిస్తే క్రమేపీ 11,140 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ వారం నిఫ్టీ తగ్గితే 10,865 పాయింట్ల వద్ద తొలి మద్దతును పొందవచ్చు. ఈ లోపున 10,815 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే తిరిగి 10,745 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చుYou may be interested

ప్రభుత్వ బ్యాంకులు 12 చాలు!

Monday 9th September 2019

విలీనాల ప్రక్రియ దాదాపు పూర్తయినట్టే... ఆర్థిఖ శాఖ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య విలీనాల ప్రక్రియ దాదాపు పూర్తయినట్టేనని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. తాజాగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులకు కుదిస్తూ విలీన నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. నవ భారత్‌ ఆకాంక్షలను తీర్చేందుకు ఇప్పుడు మిగలనున్న 12 బ్యాంకులు సరిపోతాయని కుమార్‌ పేర్కొన్నారు. పంజాబ్‌ నేషనల్‌

గణాంకాలే దిక్సూచి..!

Monday 9th September 2019

స్థూల ఆర్థికాంశాలే ఈవారంలో కీలకం గురువారం రిటైల్‌ ద్రవ్యోల్బణం, ఐఐపీ డేటా వెల్లడి ఈవారం ట్రేడింగ్‌ 4 రోజులకే పరిమితం మొహర్రం సందర్భంగా మంగళవారం మార్కెట్‌కు సెలవు ముంబై: స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. జూలై నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి, ఆగస్టు నెల రిటైల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు గురువారం వెల్లడికానుండగా.. ఈ ప్రధాన

Most from this category