News


భవిష్యత్తు అల్యూమినియం ప్యాకేజింగ్‌దే: ఏబీసీఏఐ

Wednesday 26th June 2019
Markets_main1561535080.png-26586

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: పానీయాల ప్యాకేజింగ్‌కు అల్యూమినియం క్యాన్లను వాడటం పెరుగుతోందని అల్యూమినియం బెవరేజెస్‌ క్యాన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏబీసీఏఐ) స్పష్టంచేసింది. కల్తీకి ఆస్కారం లేకపోవడం, పానీయాల జీవిత కాలం ఎక్కువ ఉండడం, ప్లాస్టిక్‌ పట్ల విముఖత ఇందుకు కారణమని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఏటా అల్యూమినియంతో తయారైన 200 కోట్ల పానీయాల క్యాన్లు విక్రయం అవుతున్నాయని బాల్‌ బెవరేజ్‌ ప్యాకేజింగ్‌ ఇండియా ఎండీ అమిత్‌ లహోటి తెలిపారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌ కన్స్యూమర్‌ ఇన్‌సైట్స్‌, బ్రాండ్‌ డెవలప్‌మెంట్‌ గ్రూప్‌ హెడ్‌ ప్రకాశ్‌ నెడుంగడితో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఏటా అల్యూమినియం క్యాన్ల వినియోగం వృద్ధి రేటు 9- 10 శాతం ఉంటోంది. ఈ క్యాన్లలో 50-60 శాతం బీర్ల ప్యాకేజింగ్‌కు, మిగిలినవి ఇతర పానీయాల కోసం వాడుతున్నారు. గ్లాస్‌ ప్యాకేజింగ్‌ నుంచి పరిశ్రమ ఎక్కువగా అల్యూమినియం వైపు మళ్లుతోంది’ అని వివరించారు. బాల్‌ బెవరేజ్‌కు మహారాష్ట్రలోని తలోజ, ఏపీలోని శ్రీసిటీలో తయారీ కేంద్రాలున్నాయి. భవిష్యత్‌లో డిమాండ్‌ పెరిగితే హైదరాబాద్‌లో క్యాన్ల తయారీ ప్లాంటు ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని అమిత్‌ వెల్లడించారు. 1880లో ప్రారంభమైన బాల్‌ కార్పొరేషన్‌ ఏటా 10,000 కోట్ల క్యాన్లను ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది. 



You may be interested

పార్లమెంటులో ‘బిజినెస్‌’

Wednesday 26th June 2019

భారీ బ్యాంకింగ్‌ మోసాలు తగ్గుతున్నాయ్‌! బ్యాంకుల్లో లక్ష రూపాయలు ఆపైబడిన మొత్తాల్లో మోసాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని రాజ్యసభలో నిర్మలా సీతారామన్‌ మంగళవారం ఒక లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఆమె తెలిపిన సమాచారం ప్రకారం- - 2016-17లో బ్యాంకులు ఇతర ఫైనాన్షియల్‌ సంస్థల్లో  రూ. లక్ష ఆపైబడిన మోసాల పరిమాణం రూ.25,884 కోట్లు. - 2017-18లో ఈ విలువ రూ. 9,866 కోట్లు. - 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.6,735 కోట్లు.      ఈ

ఎస్‌బీఐ లైఫ్‌ ఓఎఫ్‌ఎస్‌లో పాల్గొంటారా?

Wednesday 26th June 2019

ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్య్సూరెన్స్‌  ఆఫర్‌ ఫర్‌సేల్‌ ప్రకటించింది. ఈ ఓఎఫ్‌ఎస్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఒక్క షేరు రూ. 670 చొప్పున ఇస్తామని తెలిపింది. ఈ ధర సంస్థ ఐపీఓ ధర రూ. 700 కన్నా రూ. 30 తక్కువ. రెండేళ్ల క్రితం సంస్థ ఐపీఓకి వచ్చింది. ఇప్పుడు ఐపీఓ ధర కన్నా తక్కువకు షేరు లభించనుండడంతో పలువురు ఈ ఓఎఫ్‌ఎస్‌లో పాల్గొనాలని భావిస్తుంటారు. అయితే అనలిస్టులు

Most from this category