News


స్వల్ప నష్టాల్లో పసిడి

Monday 18th November 2019
news_main1574055743.png-29668

అమెరికా-చైనాల మధ్య పాక్షికంగా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని వైట్‌ హౌస్‌ ఉన్నతాధికారి ప్రకటించడంతో సోమవారం పసిడి ధర స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 1.65డాలరు నష్టంతో 1,466.85 డాలరు వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే చర్చల సంపూర్ణంగా సఫలమయ్యానే సంకేతాల కొసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. అమెరికా చైనాలకు చెందిన ఉన్నతాధికారులు శనివారం చర్చలపై ఫోన్‌లో సంభాషించినట్లు చైనా మీడియా శనివారం తెలిపింది. అయితే ఈ చర్చలపై పూర్తి సమాచారం ప్రభుత్వం తెలిపాల్సి ఉందని తెలిపింది. అలాగే అమెరికాకు చెందిన ఉన్నతాధికారి ఫోన్‌ సంభాషణలను వార్తలను బలపరిచారు. వాణిజ్య ఒప్పందం మొదటి దశ విజయవంతం కోసం ఇరుపక్షాలు ప్రధాన సమస్యలను చర్చించాయని... అయితే ఇది అధ్యక్షుల స్థాయిలోనే ఉండగా.. కేవలం మంత్రులు మాత్రమే దీనిపై సంతకాలు చేస్తారని తెలియజేశారు. అమెరికా ఈక్విటీ సూచీలు గరిష్టస్థాయిలను చేరుకోవడం, ట్రెజరీ ఈల్డ్‌ పెరగడం, డాలర్‌ ఇండెక్స్‌ బలపడటం పసిడి ప్యూచర్లపై ఒత్తిడి పెంచడంతో శుక్రవారం రాత్రి పసిడి ధర 4.90 డాలర్ల నష్టపోయి 1,468.50డాలర్ల వద్ద ముగిసింది. 
దేశీయంగానూ స్వల్ప నష్టం:- 
దేశీయ బులియన్‌ మార్కెట్లోనూ పసిడి ధర స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో సోమవారం సెషన్‌లో 11 పైసలు బలపడటం, ఈక్విటీ మార్కెట్లు స్వల్పంగా లాభపడటం తదితర కారణాలు పసిడి ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫలితంగా ఎంసీఎక్స్‌లో ఉదయం ట్రేడింగ్‌ సమయంలో  10గ్రాముల డిసెంబర్‌ కాంటాక్టు ధర రూ.62.00లు నష్టపోయి రూ.37932.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతవారం ట్రేడింగ్‌ చివరి రోజైన శుక్రవారం పసిడి ధర రూ.272లు నష్టపోయి రూ.37994.00 వద్ద ముగిసింది. 



You may be interested

రాణిస్తున్న మెటల్‌ షేర్లు

Monday 18th November 2019

పరిమితి శ్రేణిలో ట్రేడింగ్‌ జరుగుతున్న మార్కెట్లో మెటల్‌ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో దాదాపు 1.50శాతానికి పైగా లాభపడింది.  అమెరికా చైనాల మధ్య పాక్షికంగా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందనే వార్తలు మెటల్‌ షేర్లకు డిమాండ్‌ను పెంచాయి. గత రెండేళ్లుగా అగ్రరాజ్యాలైన అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం సమిసిపోతే వృద్ధి మందగమనం

ఎఫ్‌ఐఐల టాప్‌ 5 షేర్లు!

Monday 18th November 2019

వాటాలు పెంచుకుంటూ వస్తున్న విదేశీ మదుపరులు కొన్ని నెలలుగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ ఈక్విటీల్లో కొనుగోళ్లు ఆరంభించారు. నవంబర్‌ 11 నాటికి దేశీయ ఈక్విటీల్లోకి నికర విదేశీ నిధులు రూ. 30000 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలో విదేశీ ఫండ్స్‌ ఎక్కువ మక్కువ చూపుతున్న స్టాకులను పరిశీలించి వాటిలో కొన్ని పారామీటర్లకు అనుగుణంగా ఉన్న స్టాకులను వేరు చేయడం జరిగింది. ఎఫ్‌పీఐలు కనీసం ఏడాదిలో ఐదు శాతం వాటా పెంచుకోవడం,

Most from this category