News


క్యామ్లిన్‌ ఫైన్‌ సైన్స్‌- లుమాక్స్‌ ఆటో జూమ్‌

Tuesday 25th February 2020
Markets_main1582614000.png-32074

ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలు

ముందు రోజు నమోదైన భారీ పతనం నుంచి బౌన్స్‌బ్యాక్‌ అయిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల కారణంగా కెమికల్‌ రంగ కంపెనీ క్యామ్లిన్‌ ఫైన్‌ సైన్సెస్‌ లిమిటెడ్‌, ఆటో విడిభాగాల కంపెనీల లుమాక్స్‌ ఆటో టెక్నాలజీస్‌ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో హెచ్చుతగ్గుల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

క్యామ్లిన్‌ ఫైన్‌ సైన్సెస్‌ లిమిటెడ్‌
చైనీస్‌ అనుబంధ సంస్థ సీఎఫ్‌ఎస్‌ వాంగ్‌లాంగ్‌ ఫ్లేవర్స్‌ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనట్లు క్యామ్లిన్‌ ఫైన్‌ సైన్సెస్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. జనవరిలో మూసివేసిన ఈ యూనిట్‌ వద్ద కరోనా వైరస్‌ ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించింది. తద్వారా ఈ యూనిట్లో తిరిగి వేనిలిన్‌ ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12.15 ప్రాంతంలో క్యామ్లిన్‌ ఫైన్‌ సైన్సెస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 71.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 72 వరకూ బలపడింది. 

లుమాక్స్‌ ఆటో టెక్నాలజీస్‌
ఓకే ప్లే గ్రూప్‌నకు చెందిన రోటో మోల్డెడ్‌ ప్లాస్టిక్‌ బిజినెస్‌ కొనుగోలుకి బోర్డు అనుమతించినట్లు ఆటో విడిభాగాల కంపెనీ లుమాక్స్‌ ఆటో టెక్నాలజీస్‌ పేర్కొంది. తద్వారా ఆధునిక రోలా మోల్డింగ్‌ టెక్నాలజీస్‌ను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. బొమ్మలు, ప్లేగ్రౌండ్‌ పరికరాలు, పిల్లల ప్లాస్టిక్‌ ఫర్నీచర్‌ తదితరాల తయారీలో ఈ టెక్నాలజీను వినియోగిస్తారని తెలియజేసింది. ఈ నేపథ్యంలో లుమాక్స్‌​ఆటో టెక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 4.5 శాతం జంప్‌చేసి రూ. 107 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 111 వరకూ ఎగసింది. 



You may be interested

పెట్టుబడులపై గ్లోబల్‌ స్లోడౌన్‌ ఎఫెక్ట్‌!

Tuesday 25th February 2020

యెన్‌ బలపడితే వర్ధమాన మార్కెట్లకు దెబ్బ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులలో ప్రభుత్వంతో జత ఎంయూఎఫ్‌జీ బ్యాంక్‌ నిపుణులు మసాటో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడగల అంశాలపై నిఘా ఉంచవలసిన అవసరమున్నట్లు ఎంయూఎఫ్‌జీ బ్యాంక్‌, గ్లోబల్‌ కార్పొరేట్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ బిజినెస్‌ సీఈవో మసాటో మియాచీ పేర్కొంటున్నారు. దేశీయంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఫిన్‌టెక్‌, ఎనర్జీ తదితర విభాగాలలో ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వంతో పలు జపనీస్‌ కంపెనీలు జత కట్టినట్లు తెలియజేశారు. అంతర్జాతీయ స్థాయిలో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే జపనీస్‌

52 వారాల కనిష్టానికి 99 షేర్లు

Tuesday 25th February 2020

మంగళవారం 99 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వాటిలో 3P ల్యాండ్‌ హోల్డింగ్స్‌, A2Z ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, అధునిక్‌ ఇండస్ట్రీస్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, అప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌, అర్కోటెక్‌, భారత్‌ గేర్స్‌, బిల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌, బిర్లా టైర్స్‌, బ్రూన్‌పూర్‌ సిమెంట్‌, కెనరా బ్యాంక్‌, సీఅండ్‌ సీ కన్‌స్ర్టక్షన్స్‌, సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ సొల్యూషన్స్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ఫైనాన్సియల్‌ సర్వీస్‌, సీఎల్‌ ఎడ్యూకెట్‌, సీఐఎల్‌

Most from this category