News


రేపోరేటు కోత : బ్యాంక్‌ నిఫ్టీ లాభాలు ఆవిరి

Friday 27th March 2020
news_main1585288787.png-32707

కరోనా వైరస్‌ నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టిక్కేం‍చే చర్యల్లో భాగంగా రెపో రేటును తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. రెపో రేటును 75శాతం బేసిస్ పాయింట్లకు తగ్గించి 4.40శాతానికి తీసుకొచ్చామని చెప్పారు. రివర్స్ రెపో రేటును కూడా 90శాతం తగ్గించామన్నారు. అలాగే క్యాష్ రిజర్వ్ రేషియోలో 3శాతం మేరకు కోత విధించింది.

బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేట్ల(రెపో రేటు)ను తగ్గించడంతో  శుక్రవారం బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ షేర్లు నిన్నటి ర్యాలీని కొనసాగించడంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌లో 9.50శాతం లాభపడింది. 

నేడు ఆర్‌బీఐ గవర్నర్‌ వడ్డీరేట్లపై కీలక ప్రకటన చేయనున్నారనే అంచనాలతో నేడు 6.50శాతం లాభంతో 20,801.60 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. 

మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లు కొనుగోళ్ల మద్దతు లభించించింది. అందురూ ఊహించినట్లుగానే వడ్డీరేట్లపై కోత విధించిస్తున్నట్లు గవర్నర్‌ ప్రకటనతో ఇండెక్స్‌ ఒకదశలో 9.50శాతం లాభపడి 21462.40 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. అయితే ప్రకటన అనంతరం మార్కెట్‌ అమ్మకాల్లో భాగంగా ఇండెక్స్‌ లాభాలను కోల్పోయింది. ఉదయం 11గంటలకు ఇండెక్స్‌ నిన్నటి ముగింపు(19613.90)తో పోలిస్తే 3.10శాతం లాభంతో 20,222.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  

ఇంట్రాడేలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ బ్యాంక్‌ షేర్లు 9నుంచి 11శాతం లాభపడ్డాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌ కోటక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 8శాతం నుంచి 3శాతం పెరిగాయి. 

అలాగే ఎస్‌బీఐ 6శాతం పెరగ్గా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పీఎన్‌బీ, కెనరా బ్యాంక్‌ షేర్లు 3శాతం లాభపడ్డాయి.



You may be interested

గురువారం వార్తల్లోని షేర్లు

Friday 27th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు యస్‌బ్యాంక్‌: యస్‌ బ్యాంక్‌ సాధారణ స్థితికి రావడానికి షేర్ల అమ్మకం ద్వారాæ  రూ.5000 కోట్లు›సమీకరించనుంది. మహీంద్రా అండ్‌ మహీంద్రా:  వాహన తయారీ సంస్థ రెండు ప్రభుత్వం సెక్టార్‌ యూనిట్లతో కలిసి అత్యాధునిక వెంటిలేటర్స్‌ను తయారు చేస్తుంది. దీపక్‌ ఫెర్టిలైజర్స్‌: శానిటైజర్‌లలో ప్రముఖంగా వాడే ఐసోప్రొపైల్‌ ఆల్కాహాల్‌ (ఐపీఏ) రసాయనాన్ని దీపక్‌ ఫెర్టిలైజర్‌ ఉత్పత్తి చేస్తోంది. టెక్‌ మహీంద్రా: ప్రముఖ ఐటీ కంపెనీ టెక్‌ మహీంద్రా

ఫ్లాష్‌.. ఫ్లాష్‌- రెపో రేటులో 0.75% కోత(అప్‌డేటింగ్‌)

Friday 27th March 2020

4.4 శాతానికి దిగివచ్చిన రెపో రేటు 0.9 శాతం తగ్గిన రివర్స్‌ రెపో ప్రస్తుతం 4 శాతానికి రివర్స్‌ రెపో సీఆర్‌ఆర్‌లోనూ 1 శాతం కోత మూడు రోజులపాటు పరపతి విధాన సమీక్షను చేపట్టిన రిజర్వ్‌ బ్యాంక్‌ తాజాగా రెపో రేటులో 0.75 శాతం కోతను ప్రకటించింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4.4 శాతానికి దిగివచ్చింది. అంతేకాకుండా రివర్స్‌ రెపోను మరింత అధికంగా 0.9 శాతంమేర తగ్గించింది. వెరసి రివర్స్‌ రెపో

Most from this category