అపోలో షేరును ఏంచేద్దాం!
By D Sayee Pramodh

అపోలో మ్యూనిచ్ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో వాటాలను హెచ్‌డీఎఫ్‌సీకి విక్రయించాలన్న నిర్ణయం అపోలో హాస్పిటల్స్‌కు పాజిటివ్‌గా మారుతుందని బ్రోకింగ్‌సంస్థలు భావిస్తున్నాయి. డీల్‌పై, అపోలో షేరుపై వివిధ బ్రోకరేజ్‌ల అభిప్రాయాలు, అంచనాలు ఇలా ఉన్నాయి...
1. మోర్గాన్ స్టాన్లీ: ఓవర్‌వెయిట్ రేటింగ్ ఇస్తూ రూ. 1667 టార్గెట్ ధరగా నిర్ణయించింది. ఈ డీల్ ప్రధానమైన లిక్విడిటీ ఈవెంట్అని, దీనివల్ల కంపెనీ రుణాలు తీర్చేందుకు వీలవుతుందని తెలిపింది. మేనేజ్మెంట్ గైడెన్స్‌కు అనుగుణంగానే డీల్ ఉందని, తనఖాలు తగ్గించుకునేందుకు డీల్ ఉపయుక్తంగా ఉంటుందని వివరించింది.
2. నోమురా: కొనొచ్చు రేటింగ్ ఇస్తూ రూ. 1693 టార్గెట్ ధరగా నిర్ణయించింది. తాజా డీల్‌తో దాదాపు 1300 కోట్ల రూపాయలు సమకూరతాయి. తనఖాలు 30 శాతం వరకు తగ్గిపోతాయి. కంపెనీకి ఈ డీల్ చాలా మేలు చేస్తుంది.
3. సీఎల్ఎస్ఏ: కొనొచ్చు రేటింగ్ ఇచ్చింది. డీల్‌తో ఈ ఆర్థిక సంవత్సరం గతి మారుతుందని అంచనా. నవీ ముంబై హాస్పిటల్ మంచి రెవెన్యూ సాధించగలదు.
4. జెఫర్రీస్: హోల్డ్ రేటింగ్ ఇచ్చి, రూ. 1250 టార్గెట్ ధర నిర్ణయించింది. ప్రమోటర్లకు డీల్ కారణంగా రూ.1300కోట్ల వరకు సమకూరతాయని, తనఖాలు 40 శాతం వరకు దిగివస్తాయని అంచనా. అయితే డీల్ హెచ్‌డీఎఫ్‌సీకి మాత్రం నెగిటివ్‌గా ఉండొచ్చు.
You may be interested
సెన్సెక్స్ లాభం 493 పాయింట్లు
Thursday 20th June 2019140 పాయింట్లు పెరిగిన నిఫ్టీ కలిసొచ్చిన అంతర్జాతీయ సంకేతాలు రాణించిన స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో మార్కెట్ గురువారం భారీ లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 490 పాయింట్ల 39,601 స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 11,831 వద్ద ముగిసింది. నిన్న రాత్రి అమెరికా కీలకవడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడటంతో ప్రపంచమార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఈ నెల చివరిన జీ-20 సదస్సులో అమెరికా -
22.60శాతం లాభంతో ముగిసిన జైన్ ఇరిగేషన్
Thursday 20th June 2019జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ షేరు విలువ గురువారం(జూన్ 20) ఇంట్రాడేలో 22.60శాతం లాభంతో రూ.24.35 వద్ద ముగిసింది. గత సెషన్లో 28శాతం నష్టపోయి జీవిత కాల కనిష్ఠాన్ని తాకిన ఈ షేరు ఇంట్రాడేలో లాభల్లో ట్రేడయ్యింది. ‘కంపెనీ సాధారణ కార్యకలాపాలతోనే ముందుకు సాగుతోందని పెట్టుబడిదారులకు, వాటాదారులకు హామి ఇస్తున్నాం. వేగంగా ఆస్థులను విక్రయించి కంపెనీ అప్పులను తీర్చి బ్యాలన్స్ సీట్లను కొనసాగించాడానికి ప్రయత్నాలు చేస్తున్నాం’ అని బీఎస్ఈ ఫైలింగ్‌లో జైన్