News


‘మరో 5-8 శాతం కరెక్షన్‌ బాకీ ఉంది..’

Sunday 25th August 2019
Markets_main1566755173.png-27997

బ్లూచిప్‌ స్టాక్స్‌లో బాగా దిద్దుబాటుకు గురైన వాటిని పోర్ట్‌ఫోలియోకు జత చేసుకోవడం అన్నది ప్రాధాన్య క్రమంలో కొనసాగాలని.. మంచి ఎర్నింగ్స్‌ అవకాశాలు, చక్కని పనితీరు, భవిష్యత్తు వృద్ధికి అవకాశాలు, కంపెనీల ఖాతాలు క్లీన్‌గా ఉన్న స్టాక్స్‌ను ప్రస్తుత స్థాయి నుంచి కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈవో ముస్తఫా నదీమ్‌.

 

ప్రస్తుత మార్కెట్‌ 2002-2003 తరహాలో లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా నదీమ్‌ చెప్పారు. ‘‘నాడు డాట్‌కామ్‌ బబుల్‌ నుంచి మార్కెట్లు రికవరీ అవడం, రేట్ల కోత అదే పనిగా చేయడం జరిగింది. మన మార్కెట్లు బేర్ల పట్టుతో 2-3 ఏళ్లలో 50 శాతం పడిపోయాయి. కానీ ప్రస్తుతం గరిష్ట స్థాయి నుంచి మార్కెట్లు 10 శాతమే నష్టపోయాయి. అయితే, నిర్మాణాత్మక కరెక్షన్‌లోనే మన మార్కెట్‌ ఇప్పుడు కొనసాగుతున్నది’’ అని నదీమ్‌ తెలిపారు. బీమా రంగానికి భారీ వృద్ధి అవకాశాలున్నట్టు చెప్పారు. జీవిత, సాధారణ బీమా విభాగంలో విస్తరణ ప్రస్తుతం పరిమితంగానే ఉందన్నారు. బీమా కంపెనీలకు ఇది ఆరంభమేనని, రానున్న కాలంలో ఈ కంపెనీలు ఎంతో వృద్ధి చెందుతాయని, ఇన్వెస్టర్లకు విలువను సృష్టిస్తాయని అభిప్రాయపడ్డారు. ఫార్మా రంగం బోటమ్‌ అవుట్‌ అయినట్టు ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు. సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ విషయంలో కొంత సానుకూలత ఉన్నట్టు చెప్పారు. 

 

ఈ స్థాయి నుంచి నాణ్యమైన బ్లూచిప్‌ స్టాక్స్‌లో క్రమంగా ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లొచ్చని నదీమ్‌ సూచించారు. అయితే, మొత్తం పెట్టుబడులన్నీ ఒకేసారి పెట్టేయడం ప్రస్తుత దశలో సూచనీయం కాదన్నారు. సిస్టమ్యాటిక్‌ ఈక్విటీ ప్లాన్‌ రూపంలో క్రమంగా పెట్టుబడులు పెడుతూ వెళ్లాలని సూచించారు. టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌, మారికో, డీసీబీ బ్యాంకు, మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ స్టాక్స్‌ రానున్న కాలంలో రెండంకెల స్థాయిలో రాబడులను ఇవ్వగలవన్నారు. ‘‘మార్కెట్‌ బాగా దిద్దుబాటుకు గురైంది. కానీ, సూచీల్లోని బ్లూచిప్‌ స్టాక్స్‌లో చాలా వరకు ఇంకా కరెక్షన్‌ వేడిని ఎదుర్కోవాల్సి ఉంది. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ చాలా కనిష్ట స్థాయిల్లో అందుబాటులో ఉన్నాయి. సూచీల్లోని కొన్ని స్టాక్స్‌ మాత్రం మంచి బలాన్ని చూపిస్తున్నాయి. అయినా కానీ హెచ్‌యూఎల్‌, కోటక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే కొత్త గరిష్టాలకు చేరగలవు. ప్రస్తుత స్థాయిలో మార్కెట్లకు మరింత డౌన్‌సైడ్‌ 10,500-10,200 వరకు దిద్దుబాటుకు అవకాశం ఉంది. అంటే 5-8 శాతం కరెక్షన్‌ ఇంకా బాకీ పడి ఉందని భావిస్తు‍న్నాం’’అని నదీమ్‌ తన అభిప్రాయాలను వివరించారు. You may be interested

స్మాల్‌, మిడ్‌క్యాప్‌లకే ప్రయోజనం ఎక్కువ..: కోటక్‌

Sunday 25th August 2019

ఆర్థిక రంగం తిరిగి కోలుకొని వృద్ధి బాట పడితే స్మాల్‌, మిడ్‌క్యాప్‌ కంపెనీలే ఎక్కువ ప్రయోజనం పొందుతాయని కోటక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎండీ నీలేష్‌షా అన్నారు. సమస్యల నుంచి ఆర్థిక రంగం కోలుకుని, పరుగులు తీయాలంటే ప్రభుత్వం తాజాగా ప్రకటించిన చర్యల మాదిరి టెంపో ఇక ముందూ కొనసాగాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత శుక్రవారం పలు రంగాలకు సంబంధించి ప్రకటించిన ప్రోత్సాహక చర్యలపై

ప్రారంభమైన ఎన్‌ఏఆర్‌ ఇండియా సదస్సు

Sunday 25th August 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రియల్టర్స్‌ (ఎన్‌ఏఆర్‌) ఇండియా 11వ కన్వెన్షన్‌ శనివారమిక్కడ ఘనంగా ప్రారంభమైంది. ‘గేమ్‌ చేంజర్‌’ థీమ్‌తో నిర్వహిస్తున్న రెండు రోజుల ఈ సదస్సుకు సాక్షి గ్రూప్‌ మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తుంది. ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) అసోసియేట్‌ డైరెక్టర్‌ మహ్మద్‌ ఆసిఫ్‌ ఇక్బాల్‌ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రియల్టర్లు అంటే గృహాలు నిర్మించడంతోనే సరిపోదని,

Most from this category