టాప్ మిడ్‌క్యాప్ రికమండేషన్లు!
By D Sayee Pramodh

దేశీయ మార్కెట్లో చిన్న స్టాకుల టర్నెరౌండ్ ఆరంభమవుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు నాణ్యమైన మిడ్‌క్యాప్స్‌ను రికమండ్ చేస్తున్నాయి. ఏడాది కాలానికి వీటిని పరిశీలించవచ్చని సిఫార్సు చేస్తున్నాయి. యాంటిక్ బ్రోకింగ్ సిఫార్సులు: నాణ్యమైనవి ఎంచుకోండి
మోతీలాల్‌ఓస్వాల్ సిఫార్సులు:
కాల్గేట్ పామోలివ్, అశోక్ లేలాండ్, జుబిలాంట్ ఫుడ్‌వర్క్స్, ఇండియన్ హోటల్స్, ఫెడరల్ బ్యాంక్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, సీజీ కన్జూమర్ కేర్, జేకే సిమెంట్ తదితరాలు. బ్రోకరేజ్ సిఫార్సు చేసిన షేర్లు, వాటి టార్గెట్లు, తదితర వివరాలు ఇలా ఉన్నాయి....
చోళమండలం ఇన్వెస్ట్మెంట్, ఆల్కెమ్ ల్యాబ్స్, హానీవెల్ ఆటోమేషన్, గుజరాత్ గ్యాస్, బేయర్, ఫోనిక్స్ మిల్, సోలార్ ఇండస్ట్రీస్; కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ తదితరాలు. బ్రోకరేజ్ సిఫార్సు చేసిన షేర్లు, వాటి టార్గెట్లు, తదితర వివరాలు ఇలా ఉన్నాయి....
రెండేళ్లుగా బాగా పతనమైన స్టాకుల్లో నాణ్యమైన వాటిని ఎన్నుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వచ్చే రెండు త్రైమాసికాల్లో ఎకానమీలో రికవరీ కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. సూచీలు కొత్త గరిష్ఠాలు కొద్ది రోజుల్లోనే చూస్తామని, ఇకపై చిన్న స్టాకుల్లో జోరు పెరుగుతుందని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. మార్కెట్ మరింత అప్‌మూవ్‌కు చేరేలోపు మరొక్కమారు కనిష్ఠాన్ని చూడవచ్చని, అలాంటి అవకాశాలను దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు వినియోగించుకోవాలని ఎమ్కే వెల్త్ సూచించింది. కనీసం 3- 4 సంవత్సరాలకు నాణ్యమైన మిడ్ క్యాప్స్‌ను కొన్ని లార్జ్‌క్యాప్స్‌ను ఎంచుకొని పోర్టుఫోలియో నిర్మించుకోవాలని సలహా ఇచ్చింది.
You may be interested
యూకో బ్యాంక్ 19శాతం అప్
Thursday 21st November 2019ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్ షేరు వరుసగా మూడో రోజూ లాభాల బాట పట్టింది. బుధవారం ఉదయం సెషన్లో ఈ షేరు దాదాపు 19శాతం లాభపడింది. బ్యాంక్ వెల్లడించిన క్యూ2 ఫలితాలను పరిశీలిస్తే... నికర నష్టాలు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,136 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.892 కోట్లకు తగ్గాయి. గత క్యూ2లో రూ.29,581 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ
లాభాల్లో ప్రభుత్వరంగ బ్యాంకింగ్
Thursday 21st November 2019మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ.., బుధవారం ఉదయం ట్రేడింగ్ సెషన్లో ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఫలితంగా ఎన్ఎస్ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్ అరశాతం లాభపడింది. నేడు ఈ ఇండెక్స్ 2,572.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో అరశాతం పెరిగి 2,605.95 వద్ద చేరకుంది. ఉదయం గం.11:00లకు ఇండెక్స్ క్రితం ముగింపు(2,572.25)తో పోలిస్తే 0.25శాతం లాభంతో 2,578.65 వద్ద