News


పెరిగిన పసిడి

Thursday 24th October 2019
Markets_main1571892686.png-29104

అంతర్జాతీయంగా గత రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో 8 డాలర్లకుపైగా పెరిగిన పసిడి గురువారం ఆసియా ట్రేడింగ్‌లో సైతం దాదాపు అదేస్థాయి వద్ద  ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 1,495 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. పసిడి ధరను  ప్రభావితం చేయగల బ్రెగ్జిట్‌ అంశం, అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు సమావేశాలు లాంటి కీలక పరిణామాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. బ్రిటన్‌ బ్రెగ్జిట్‌కు 3నెలల పొడిగింపును కొనసాగించాలా లేదా అనే అంశంపై బుధవారం ఈయూ సభ్య దేశాలు ఆలస్యం చేశారు. అనుకున్న గడువు అక్టోబర్‌ 31న లోగా బిట్లు ఆమోదం కాకపోతే, బ్రెగ్జిట్‌ బిల్లు రద్దు చేసుకుని, క్రిస్మస్‌లోగా ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని జాన్సస్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇక ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ సమావేశాలు వచ్చే వారంలో 29, 30 తేదీల్లో జరగనున్నాయి. వాణిజ్య యుద్ధ ప్రభావం కొనసాగుతున్న తరుణంలో ఈ ఏడాదిలో వరుసగా మూడోసారి వడ్డీరేట్లను తగ్గింపు ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే యూరోపియన్‌, అమెరికా తయారీ రంగ గణాంకాల కోసం పసిడి ట్రేడర్లు వేచిచూస్తున్నారు. ఓవరాల్‌గా పసిడి ధర మధ్య-కాల శ్రేణి దిగువన కన్సాలిడేషన్‌ అవుతోంది. అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు సఫలం దిశగా సాగుతున్న తరుణంలో పసిడి కొంత తగ్గుముఖం పట్టచ్చు అని బులియన్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక గత రాత్రి అమెరికా మార్కెట్లో బ్రెగ్జిట్‌ అంశంపై ఆందోళనల నేపథ్యంలో నాలుగు రోజుల వరుస పతనం తర్వాత 8.50డాలర్లు లాభపడి 1,496 డాలర్ల వద్ద స్థిరపడింది.
దేశీయ మార్కెట్లో స్వల్పలాభం :- 
ఇక దేశీయ మార్కెట్లోనూ పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం, ఈక్విటీ మార్కెట్లు లాభాల ట్రేడింగ్‌ తదితర అంశాలు పసిడి ర్యాలీకి ప్రతికూలంగా మారాయి. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.38000పై రూ.43ల లాభంతో రూ.38046.00 వద్ద కదలాడుతుంది. రానున్న రోజుల్లో పసిడి ధర రేంజ్‌ బౌండ్‌లో కదలాడుంది. నేడు పసిడికి 37,800 వద్ద కీలక మద్దతు, 38,100 వద్ద నిరోధస్థాయిని కలిగి ఉంది. 38,100 స్థాయిని అధిగమిస్తే 38,300 స్థాయికి చేరుకునేందుకు అవకాశం ఉందని బులియన్‌ పండితులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా నిన్న ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి పసిడి ధర రూ.122ల లాభంతో రూ.38,003 వద్ద స్థిరపడింది. You may be interested

ఇంధన రిటైలింగ్‌లో సంస్కరణలు ..నష్టాల్లో పెట్రో షేర్లు

Thursday 24th October 2019

దేశీయ ఇంధన రిటైలింగ్‌ రంగంలో చమురుయేతర సంస్థలు కూడా పెట్రోల్‌ బంకుల ఏర్పాటు చేసే వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మరింత సరళతరం చేసింది. దీంతో దేశీయ ఇంధన మార్కెట్లోకి ప్రవేశించేందుకు పలు ప్రైవేట్, విదేశీ సంస్థలకు అవకాశం ఏర్పడింది. ఇప్పటి వరకు దేశీయ ఇంధన మార్కెట్‌లో కీలకంగా ఉన్న ప్రభుత్వ పెట్రో కంపెనీలకు ప్రై‍వేటు సంస్థల నుంచి పోటి ఏర్పడనుంది. ఈ అంశంతో పాటు యుఎస్‌ చమురు

ఎల్‌ అండ్‌ టీ 2 % అప్‌

Thursday 24th October 2019

నిర్మాణ, ఇంజినీరింగ్‌ దిగ్గజ కంపెనీ లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికంలో 13 శాతం పెరిగి రూ. 2,527 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ.2,230 కోట్లుగా ఉంది. అంతేకాకుండా కంపెనీ ఆదాయం కూడా ఈ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన రూ. 31,087 కోట్ల నుంచి రూ. 35,925 కోట్లకు పెరిగింది. కంపెనీ నిర్వహణ లాభం

Most from this category