News


రూ.38వేలపైన ప్రారంభమైన పసిడి

Monday 23rd December 2019
Markets_main1577078326.png-30379

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర సోమవారం రూ.38వేలపైన రూ.38,040 వద్ద ప్రారంభమైంది. నేడు అంతర్జాతీయంగా మార్కెట్లో పసిడికి ధరకు డిమాండ్‌ లభించడం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలహీనం‍గా ప్రారంభం పసిడి ఫ్యూచర్ల లాభాలకు కారణమవుతున్నాయి. ఉదయం గం.10:15ని.లకు డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి రూ.108.00ల లాభంతో రూ.38099.00 వద్ద ట్రేడింగ్‌  అవుతోంది. ‘‘ ఈ వారంలో క్రిస్మస్‌, కొత్త సంవత్సరపు సెలవు సందర్భంగా పసిడి ఫ్యూచర్లు కొంత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఎంసీఎక్స్‌లో పసిడి రూ.37700 వద్ద కీలక మద్దతు ఉంది. ఈ ధరను నిలబెట్టుకోగలిగితే రూ.38050 వద్ద నిరోధ స్థాయిని ఎదుర్కోంటుంది. ర్యాలీ అప్‌ట్రెండ్‌లో కొనసాగితే రూ.38200 వద్ద వరకు సాగితే అవకాశం ఉంది’’ అని మనోజ్‌ కుమార్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు. 
క్రిస్మస్‌, కొత్త సంవత్సరపు సెలవుకు ముందు డిమాండ్‌
క్రిస్మస్‌, కొత్త సంవత్సరపు సెలవులకు ముందు ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగింది. నేడు ఆసియా మార్కెట్లో ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 4డాలర్లు లాభపడింది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలపై తాజా పరిమణాల కోసం ఇన్వెస్టర్ల ఎదురుచూపులు సైతం పసిడి ర్యాలీకి తోడ్పాటును అందిస్తున్నాయి. వాణిజ్య ఒప్పందంపై చైనా ప్రెసిడెంట్‌తో మంచి చర్చలు జరిగాయని, త్వరలో డీల్‌పై సంతకాలకు ఏర్పాట్లు  జరుగుతాయని ట్రంప్‌ శుక్రవారం తెలిపారు అయినప్పటికీ ఒప్పందంపై మరింత సమగ్రమైన వివరాల కోసం మార్కెట్‌ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. పసిడిపై ప్రభావాన్ని చూపై డాలర్‌ ఇండెక్స్‌ 97 స్థాయి వద్ద ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. అమెరికా మూడో త్రైమాసికపు వృద్ధి గణాంకాలు మార్కెట్‌ అంచనాలను అందుకోవడంతో శుక్రవారం రాత్రి అమెరికా ఔన్స్‌ పసిడి ధర 3.50డాలర్లు  పతనమై 1,480.90డాలర్ల వద్ద స్థిరపడింది.  You may be interested

నష్టాల మార్కెట్లో ఈ రెండు స్టాక్స్‌ జూమ్‌

Monday 23rd December 2019

ఇండియామార్ట్‌- బ్రోకింగ్‌ సంస్థ సిఫారసు ఎఫెక్ట్‌ బీఏఎస్‌ఎఫ్‌- కెమికల్‌ బిజినెస్‌ విక్రయం ఫలితం ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ బ్రోకింగ్‌ సంస్థ జెఫరీస్‌ షేరుకి బయ్‌ రేటింగ్‌ను ప్రకటించిన వార్తలతో ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇండియామార్ట్‌ షేరు 4.4 శాతం జంప్‌చేసింది. రూ. 2072 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2097 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 2028 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. బీటూబీ క్లాసిఫైడ్‌

బడా ఇన్వెస్టర్లు మక్కువ చూపుతున్న టాప్‌ 20 షేర్లివే!

Monday 23rd December 2019

పోర్టుఫోలియో మేనేజర్లు, అల్ట్రారిచ్‌ ఇన్వెస్టర్లు కొన్ని ఎంపిక చేసిన స్టాకులపైనే మక్కువ చూపుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో చాలా షేర్లు ఇప్పటికే మంచి ర్యాలీ జరిపినా, ఇంకా వీటిపైనే బడా ఇన్వెస్టర్లు ఆధారపడుతున్నట్లు పైసాబజార్‌ గణాంకాలు చూపుతున్నాయి. ఇలా పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల నమ్మకం చూరగొన్న స్టాకుల్లో హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌బ్యాంక్‌, కోటక్‌మహీంద్రాబ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ తదితర దిగ్గజాలున్నాయి. పెద్ద ఇన్వెస్టర్లు మక్కువ చూపుతున్న టాప్‌ 20 స్టాక్స్‌... మార్కెట్లో స్మార్ట్‌మనీ

Most from this category