STOCKS

News


రూ.40 వేలకు దిగువకు బంగారం ధర

Friday 10th January 2020
Markets_main1578633880.png-30826

బంగారం ధర గురువారం మరింత తగ్గింది. దేశీయ బులియన్‌ మార్కెట్లో రూ.40వేల దిగువకు చేరుకుంది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 70స్థాయికి బలపడటం, అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గముఖం పట్టడం, ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ తదితర అంశాలు బంగారానికి డిమాండ్‌ను తగ్గించాయి. సోమవారం ఎంసీఎక్స్‌లో 10గ్రాముల బంగారం ధర మునుపటి ముగింపు రూ.39830తో పోలిస్తే రూ.153లు లాభపడి రూ.39677.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బంగారానికి ఇది వరుసగా మూడో రోజూ నష్టాల ట్రేడింగ్‌ కావడం గమనార్హం.  ఈ వారంలో బంగారం రూ.41,293 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. నాటి నుంచి రూ.1619ల నష్టాన్ని చవిచూసింది. రానున్న రోజుల్లో బంగారం ధర కొంత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని, ఒకవేళ రూ.39,900 దిగువకు ట్రేడైతే... రూ.39,550 టార్గెట్‌తో ట్రేడర్లు షార్ట్‌ చేసుకోవచ్చని బులియన్‌ పండితులు సలహానిస్తున్నారు. అమెరికా-ఇరాన్‌ నుంచి తాజాగా ఎలాంటి ప్రకటనలు లేకపోవడంతో విక్రయాలు కొనసాగుతున్నాయి. మరికొంతకాలం పాటు అస్థిరత కొనసాగవచ్చు. స్వల్పకాలానికి బంగారం ధర రూ.39600- రూ.40200 స్థాయిలో ట్రేడయ్యే అవకాశం ఉందని ఇండియానివేశ్‌ కమోడిటీస్‌ డైరెక్టర్‌ మనోజ్‌ కుమార్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు. ఇక బంగారానికి ఇది వరుసగా మూడో రోజూ నష్టాల ట్రేడింగ్‌ కావడం విశేషం. ఈ వారంలో బంగారం రూ.41,293 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. 
అంతర్జాతీయ మార్కెట్లో అదే ట్రెండ్‌:- 

ఇక అంతర్జాతీయ మర్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ బంగారం 7డాలర్లు నష్టపోయి 1,546 డాలర్ల వద్దకు చేరుకుంది. ఇరాన్‌పై ట్రంప్‌ తదుపరి సైనిక చర్యను నిలిపివేయాలనే తీర్మానానికి అమెరికా ఎగువ సభ ఆమోదం తెలిపింది. డాలర్‌ ఇండెక్స్‌ బలపడటం, అమెరికా నిరుద్యోగ గణాంకాలు అంచనాలకు మించిన నమోదు కావడం బంగారం ధరపై మరింత ఒత్తిడిని పెంచాయి. అమెరికా- ఇరాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణాత్మక పెట్టుబడి సాధనంగా భావించే బంగారం ధర ఈ వారంలో 1,611డాలర్ల స్థాయికి చేరుకొని ఏడేళ్ల గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఇరుదేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ తదితర కారణాలతో 1,611 డాలర్ల స్థాయి నుంచి 4శాతం దిగివచ్చింది. You may be interested

యస్‌ బ్యాంక్‌ షేరు టార్గెట్‌ రూ. 25?

Friday 10th January 2020

యస్‌ బ్యాంక్‌ షేరు రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ రూ. 15-55 ధరలో నిధుల సమీకరణ? పెద్ద ప్రయివేట్‌ రంగ బ్యాంకులు భేష్‌ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌.. వీక్‌! మోర్గాన్‌ స్టాన్లీ తాజా అంచనాలు  నిధుల సమీకరణలో ఆలస్యం, రుణ నాణ్యత నీరసించడం వంటి అంశాల కారణంగా యస్‌ బ్యాంక్‌ షేరుని తాజాగా గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసుల దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ డౌన్‌గ్రేడ్‌ చేసింది. షేరుకి రూ. 25 టార్గెట్‌ ధరను ప్రకటించింది. ఈ ఏడాది(2020) సైతం​ ప్రధాన

జీటీపీఎల్‌, డెల్టా కార్ప్‌, అలుఫ్లోరైడ్‌ అప్‌

Friday 10th January 2020

వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇటీవల పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్త వాతావరణం చల్లబడటంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల సెంచరీ చేసింది. ఉదయం 10 ప్రాంతం‍లో 148 పాయింట్లు ఎగసి 41,600ను తాకగా.. నిఫ్టీ 40 పాయింట్లు పుంజుకుని 12,256 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల ఆధారంగా మిడ్‌ క్యాప్‌ కంపెనీలు జీటీపీఎల్‌ హాథవే, డెల్టా కార్ప్‌, అలు

Most from this category