News


రూ. 40,700 స్థాయికి పసిడి

Thursday 30th January 2020
Markets_main1580359591.png-31327


మళ్లీ పెరిగిన బంగారం ధర
గత కొద్దిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధర బుధవారం ఒక్కసారిగా రూ.400 తగ్గగా, గురువారం మళ్లీ రూ.700 మేర  పెరిగింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో క్రితం రోజుతో పోలిస్తే ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ.680 వరకూ పెరిగి 40,680.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కరోనా భయాలతో ప్రపంచ మార్కెట్లో పుత్తడి పెరగడంతో పాటు ఇక్కడ రూపాయి విలువ భారీగా 30 పైసల వరకూ పతనంకావడంతో పసిడి ఎంసీఎక్స్‌లో పరుగులు తీసింది. ఇక్కడి కరెన్సీ మార్కెట్లో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 71.50 వద్దకు దిగజారింది.  ప్రాణాంతక కరోనా వైరస్‌ చైనాను అతలాకుతలం చేయడమేగాక  ఆర్థికంగా దెబ్బతీయడం, చైనాతోపాటు ప్రపంచదేశాలకు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతుండంతో బంగారం ధర పెరిగింది. క్రితం రోజుతో పోలిస్తే 14 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,580 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

(బుధవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)
 



You may be interested

గ్రీన్‌లామ్‌, స్ట్రైడ్స్‌ ఫార్మా దూకుడు

Thursday 30th January 2020

5 శాతంపైగా ఎగసిన షేర్లు మార్కెట్లు నష్టాల బాటలో నేడు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కరోనా వైరస్‌పై అంతర్జాతీయ స్థాయిలో అత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ)ని ప్రకటించనున్నట్లు వెలువడిన వార్తలు దేశీయంగా తిరిగి ఆందోళనలు పెంచాయి. దీంతో ఇన్వెస్టర్లు తొలి నుంచీ అమ్మకాలకు తెరతీశారు. ఫలితంగా నేలచూపులతో ప్రారంభమైన మార్కెట్లు తదుపరి మరింత నీరసించాయి. ఉదయం 10.20 ప్రాంతంలో సెన్సెక్స్‌ 202 పాయింట్లు క్షీణించి 40,997ను తాకింది. తద్వారా 41,000 పాయింట్ల దిగువకు చేరింది. ఇక

తాజ్‌జీవీకే లాభం రూ.11 కోట్లు

Thursday 30th January 2020

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ 33 శాతం వృద్ధితో రూ.11.14 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.8.37 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.91.22 కోట్లు కాగా.. 2018 క్యూ3లో రూ.86.11 కోట్లుగా ఉంది. సంజీవ్‌ రెడ్డి రాజీనామా... ఇన్నాళ్లూ తాజ్‌జీవీకేలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ నాన్‌–ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న జీవీ

Most from this category