News


ట్రేడ్‌ డీల్‌ ఖరారుతో తగ్గిన పసిడి

Friday 13th December 2019
Markets_main1576221924.png-30209

అమెరికా చైనాల మధ్య వాణిజ్య మొదటి దశ వాణిజ్య ఒప్పందానికి ట్రంప్‌ అంగీకరించారనే వార్తలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను తగ్గిస్తున్నాయి. నిన్నరాత్రి అమెరికాలో 1491 డాలర్ల గరిష్టాన్ని అందుకున్న అనంతరం యూఎస్‌- చైనా ట్రేడ్‌ డీల్‌కు ట్రంప్‌ ఆమోదం తెలిపారన్న వార్తలతో అక్కడి నుంచి 1469డాలర్ల కనిష్టానికి పతనమైంది. తిరిగి స్వల్ప రికవరీని సాధించి 1,472.30 డాలర్ల వద్ద స్థిరపడింది. నేడు ఆసియాలో 1డాలరు స్వల​లాభంతో 1,473.80 వద్ద ప్రారంభమైంది. ఉదయం గం.11:00లకు 1.65డాలరు లాభంతో 1,470.65 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత పసిడికి మద్దతునిస్తుంది. అమెరికా మార్కెట్లు రికార్డు స్థాయిని అందుకున్నాయి. ఆసియా ఈక్విటీలు 8నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. బలహీనమై ఆర్థిక గణాంకాలు నమోదు వరకు పసిడిలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా ఉంటే ఉత్తమం అని బులియన్‌ విశ్లేషకులు సలహానిస్తున్నారు. 
దేశీయంగానూ నష్టాలే:- 
అంతర్జాతీ ట్రెండ్‌కు తగ్గట్లు దేశీయ మార్కెట్లో పసిడి ధర నష్టాల బాట పట్టింది. నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.36.00లు నష్టంతో రూ.37508 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  నేటి ఎంసీఎక్స్‌లో పసిడికి రూ. 37,400-37,300 కీలక మద్దతు ధర ఉంటుంది. అలాగే అప్‌ట్రెండ్‌లో రూ.37,740 వద్ద కీలక నిరోధాన్ని కలిగి ఉన్నట్లు బులియన్‌ పండితులు అంచనా వేస్తున్నారు. 
నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ పసిడి ధర రూ.155లు నష్టపోయి 37544 వద్ద స్థిరపడింది. 



You may be interested

32వేల పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Friday 13th December 2019

మార్కెట్‌ ర్యాలీలో భాగంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు దుమ్ము లేపుతున్నాయి. దీంతో మిడ్‌సెషన్‌ కల్లా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 32వేల స్థాయిని అధిగమించింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 31,775.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు స్వల్పంగా ఉన్నప్పటికి.., క్రమంగా డిమాండ్‌ పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు ఎక్కువ లభించింది.

ఎఫ్‌పీఐలు.. షార్ట్‌ సెల్లింగ్‌ ఆపండి!

Friday 13th December 2019

సెబి ఆదేశాలు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లలో(ఎఫ్‌పీఐ) కొందరు షేర్ల షార్ట్‌ సెల్లింగ్‌ చేస్తున్నారని, దీన్ని తక్షణమే నివారించాలని ఆయా కస్టోడియన్లను సెబి ఆదేశించింది. పోర్టుఫోలియోలో పొజిషన్‌ లేకున్నా విక్రయించడాన్ని షార్ట్‌ సెల్లింగ్‌ అంటారు. కొన్ని ఎఫ్‌పీఐలు ఇలాంటి ట్రేడ్లకు పాల్పడుతున్నాయని తమ దృష్టికి వచ్చినట్లు సెబి తెలిపింది. విదేశీ ఫండ్స్‌కు, దేశీయ మార్కెట్‌కు మధ్య కస్టోడియన్లు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తారు. ఎఫ్‌పీఐల షార్ట్‌ సెల్లింగ్‌ నిర్వాకం గురించి వీరిని సెబి హెచ్చరించింది. దేశీయ

Most from this category