News


రూ.39,800 దిగువకు బంగారం

Monday 13th January 2020
Markets_main1578898158.png-30888

దేశీయంగా బులియన్‌ మార్కెట్లో బంగారం ధర రూ.39,800 దిగువున ట్రేడ్‌ అవుతున్నాయి. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటం, ఈక్విటీ మార్కెట్లు రికార్డు గరిష్టాలను అందుకోవడం, అమెరికా చైనాల మద్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదరవచ్చనే అంచనాలు డాలర్‌కు బలాన్నివ్వడం తదితర అంశాలు బంగారం ధర తరిగిపోయేందుకు తోడ్పాటునిచ్చాయి. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల బంగారం ధర రూ.173.00 నష్టపోయి రూ.39698.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

కిందటి వారం బంగారం ధర తీవ్రఒడిదుడుకులకు లోనైంది. ఇరాన్‌ అమెరికాల మధ్య యుద్ధ వాతావరణం చెలరేగడంతో ఎంసీఎక్స్‌లో బంగారం ధర రూ.41,293వేలకు అందుకుంది. అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గముఖం పట్టడంతో పాటు అమెరికాతో చైనాతో మొదటి దశ ఒప్పందానికి ఒప్పుకుంటున్న సంకేతాలనునివ్వడం, రూపాయి బలడటంతో పసిడిలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా వారం రోజుల్లో బంగారం ధర ఏకంగా దాదాపు రూ.1500లు దిగివచ్చింది.  

ఇ‍క అంతర్జాతీయ మార్కెట్లో తాజాగా బంగారం ధరల నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. నేటి ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ బంగారం ధర 5డాలర్ల నష్టపోయి 1,555.25 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.  అయితే అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచాలను అందుకోవడంలో విఫలం కావడంతో పసిడి 1500డాలర్ల వద్ద మద్దతు లభించినట్లు బులియన్‌ పండితులు అభిప్రాయపడుతున్నారు. 
 



You may be interested

టాటా కెమ్‌, టాటా గ్లోబల్‌ జూమ్‌

Monday 13th January 2020

కన్జూమర్‌ విభాగం విలీనం ఎఫెక్ట్‌ ఐదో రోజూ టాటా గ్లోబల్‌ జోరు 52 వారాల గరిష్టానికి టాటా కెమ్‌ తాజాగా టాటా కెమికల్స్‌ కంపెనీ కన్జూమర్‌ విభాగాన్ని విడదీసేందుకు జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఓకే చెప్పడంతోపాటు.. గ్రూప్‌లోని మరో కంపెనీ టాటా గ్లోబల్‌ ఈ బిజినెస్‌ను విలీనం చేసుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వెరసి టాటా గ్రూప్‌ కంపెనీల మధ్య బిజినెస్‌ విడతీత, విలీన ప్రతిపాదనలకు అనుమతి లభించడంతో ఇన్వెస్టర్లు ఈ రెండు

ప్రాఫిట్‌ ఎప్పుడు బుక్‌ చేయాలి?

Monday 13th January 2020

ఆల్‌టైమ్‌ హై వద్ద సూచీలు దేశీయ మార్కెట్లు గతవారం ఆరంభ నష్టాల నుంచి వెనక్కుమరలి ఆల్‌టైమ్‌ హైకి దూసుకుపోయాయి. సోమవారం నిఫ్టీ 12300 పాయింట్ల పైన బలంగా ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో లాభాల్లో ఉన్న పోర్టుఫోలియోల నుంచి లాభాలు స్వీకరించాలా? లేక అలాగే కొనసాగాలా? అని ఇన్వెస్టర్లు డైలమాలో ఉంటారు. కొందరేమో వచ్చిన లాభాలు మటుమాయం కాకముందే స్వీకరించడం మంచిదని, కొందరేమో మరిన్ని లాభాలను వదులుకొని స్వల్పలాభాలకు ఆశపడకూడదని భావిస్తుంటారు. మరి

Most from this category