News


దేశీయంగా పసిడి స్వల్ప తగ్గుదల

Monday 30th December 2019
Markets_main1577686304.png-30525

  • అయినా రూ.39వేల పైన ట్రేడింగ్‌

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో సోమవారం ఉదయం పసిడి ఫ్యూచర్లలో స్వల్పంగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. అలాగే ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటం కూడా పసిడికి ఫ్యూచర్ల ర్యాలీకి ప్రతికూలమైంది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి రూ.39,067.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. గతవారంలో కేవలం 4రోజుల ట్రేడింగ్‌ సెషన్లలోనే ఏకంగా రూ.1100లు ర్యాలీ చేసిన నేపథ్యంలో పసిడి ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. ఒక దశలో రూ.100లు నష్టపోయి రూ.39వేల స్థాయిని కోల్పోయి రూ.38,980.00కి చేరుకుంది. అయితే పసిడి ట్రేడర్లు పతనమైన ప్రతిసారి కొనుగోలు చేయడం అనే వ్యూహాన్ని పాటిస్తున్న కారణంగా తిరిగి రూ.39వేల స్థాయిని అందుకుంది. ఉదయం గం.11:00లకు క్రితం ముగింపు(రూ.39080.00)తో పోలిస్తే రూ.60లు నష్టంతో రూ.39020.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఏడాదిలో పసిడి కాంటాక్టు ఏకంగా 24.5శాతం మేర లాభాల్ని ఆర్జించింది.

రెండున్నర నెలల గరిష్టంపైన  పసిడి
ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం రెండున్నర నెలల గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. అమెరికా సైనిక దళాలు మధ్యప్రాచ్యదేశాల్లో దాడుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా పసిడి ఫ్యూచర్లలో పెట్టుబడులకు మొగ్గుచూపుతుండటం ఇందుకు కారణమైంది. అలాగే డాలర్‌ పతనం కూడా పసిడి ఫ్యూచర్ల స్థిరమైన ట్రేడింగ్‌కు తోడ్పాటునిచ్చింది. ఫలితంగా నేడు ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు పెరిగి 1,519 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా వైమానిక దళం ఇరాక్‌ సరిహద్దుల్లో ఇరాన్‌-సిరియా మిలీషియా స్థావరాలపై విజయవంతంగా దాడులు జరిపినట్లు ప్రకటించడంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లు ఈ ఏడాది ప్రారంభం నుంచి నేటి వరకు 15.65శాతం లాభపడ్డాయి. 2010 సంవత్సరం తర్వాత ఒక ఏడాదిలో ఈ స్థాయిలో బలపడటం ఇదే తొలిసారి. అమెరికా చైనాల మధ్య సుధీర్ఘకాలం పాటు జరిగిన వాణిజ్య యుద్ధం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం, బ్రెగ్జిట్‌ అనిశ్చితి, పలు దేశాల రిజర్వ్‌ బ్యాంకులు ఈ సంవత్సరంలో వడ్డీరేట్లను తగ్గించడం తదితర కారణాలు ఈ ఏడాది పసిడిని నడిపించాయి. ఈక్విటీ మార్కెట్లల్లో లాభాల స్వీకరణ జరగవచ్చనే అంచనాలతో పాటు డాలర్‌ బలహీనత కారణంగా గతవారం ట్రేడింగ్‌ చివరి రోజై శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో 3.70డాలర్ల పెరిగి రూ.1,518 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.  
 You may be interested

పాలీకేబ్‌ ఐపీవో- 8 నెలల్లో 80 శాతం అప్‌

Monday 30th December 2019

పబ్లిక్‌ ఇష్యూ విభాగంలో టాప్‌-5లో చోటు టాప్‌ ర్యాంకర్స్‌- ఐఆర్‌సీటీసీ, ఇండియామార్ట్‌  ఈ ఏడాది(2019) చివరికల్లా దేశీ స్టాక్‌ మార్కెట్లు పలు ఒడిదొడుకుల మధ్య రికార్డు గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. మరోవైపు ఐపీవో మార్కెట్లోనూ కొంతమేర సందడి కనిపించింది. ఇష్యూలు తగ్గిన్పటికీ ఈ ఏడాది స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన కంపెనీలలో అత్యధికం ఇన్వెస్టర్లకు లాభాలు పంచడం విశేషం! ఈ ఏడాది పబ్లిక్‌ ఇష్యూలు చేపట్టిన కంపెనీలలో టాప్‌-5లో

ఎల్‌ఐసీకి అనిల్‌ అంబానీ గ్రూప్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దెబ్బ

Monday 30th December 2019

లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా మొండి బకాయిల కోసం కేటాయింపులు 30 శాతం పెరిగి రూ. 23760 కోట్లకు చేరినట్లు కంపెనీ ప్రకటించింది. రియల్టీ, లోన్లు, ఇతర ఆస్తుల్లో తమ పెట్టుబడుల సమీక్ష అనంతరం మొండిపద్దులకు కేటాయించిన మొత్తాలు పెరిగినట్లు తెలిసిందని కంపెనీ వెల్లడించింది. ఎల్‌ఐసీ నుంచి రుణాలు తీసుకున్న కంపెనీల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌, అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూప్‌ కంపెనీలున్నాయి. ఇవన్నీ డిఫాల్ట్‌ కావడంతో ఎల్‌ఐసీ నెత్తిన

Most from this category