News


రూ.38వేల పైకి పసిడి

Thursday 14th November 2019
Markets_main1573715867.png-29585

దేశీయ బులియన్‌ మార్కెట్లో పసిడి ఫ్యూచర్‌ ధర తిరిగి రూ.38వేల మార్కును అందుకుంది. అమెరికా-చైనాల మధ్య మొదటి దశ చర్చల విజయవంతంపై అనుమానం తలెత్తడంతో పాటు, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 2నెలల కనిష్టానికి దిగిరావడం తదితర కారణాలు పసిడి పుంజుకునేందుకు తోడ్పాటునిచ్చాయి. ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.35.00ల లాభంతో రూ.38132.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. దేశీయమార్కెట్లో పసిడి ధర మరింత ర్యాలీ చేసి అవకాశం ఉంది. స్వల్పకాలికానికి రూ.38,200-38,300 స్థాయిల లక్ష్యంతో పతనమైన ప్రతిసారి కొనుగోలు చేయవచ్చని బులియన్‌ విశ్లేషకులు సలహానిస్తున్నారు. నిన్న సాయంత్ర అమెరికా వెలువరించిన సీపీఐ డాటా ర్యాలీకి కొంత అడ్డుకట్ట వేసింది. అయితే, ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ప్రసంగం, రూపాయి క్షీణత పసిడికి తిరిగి ఉత్తేజాన్నిచ్చాయి. ఫలితంగా నిన్నరాత్రి ఫారెక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.377ల లాభంతో రూ.38,097 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ అదే ధోరణి:- 
ఇక ప్రపంచమార్కెట్లో పసిడి ధర 3నెలల కనిష్ట ధర(రూ.1,457.00) నుంచి తిరిగి కోలుకుంది. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో వరుసగా నాలుగు రోజుల నష్టాల ముగింపు స్వస్తి పలుకుతూ లాభాల్లో ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన వ్యవహారం కీలక దశకు చేరుకోవడంతో పాటు అమెరికా చైనాల మొదటి దశ చర్చల విజయవంతంపై అనుమానం తలెత్తడంతో నిన్నరాత్రి అక్కడి మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 9.60డాలర్లు పెరిగి 1,463.30 డాలర్ల వద్ద స్థిరపడింది. నేటి ఉదయం కూడా పసిడి ధరకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. హాంగ్‌కాంగ్‌లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి, చైనా ఆర్థిక గణాంకాలు అంచనాలను అందుకోలేకపోవడం తదితర కారణాలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. ఫలితంగా నేటి ఉదయం సెన్సెక్స్‌ ఔన్స్‌ పసిడి ధర మరో డాలర్లు పెరిగి 1,467 స్థాయిని అందుకుంది. పసిడి 1450డాలర్ల వద్ద కీలక మద్దతుస్థాయిని ఏర్పాటు చేసుకుంది. 1,466 నిరోధాన్ని పరిక్షీస్తుందని బులియన్‌ అంటున్నారు.


నిన్నటి(13-11-2019) పసిడి(24 క్యారెట్లు) ముగింపు ధర కోసం ఆయా నగరాల గుర్తుపై క్లిక్‌ చేయండి(స్పాట్‌)



You may be interested

విజిల్‌బ్లోయర్‌ ఫిర్యాదును తిప్పికొట్టిన ఇన్ఫోసిస్‌ లీగల్‌ టీం

Thursday 14th November 2019

   ఇన్ఫోసిస్ సెప్టెంబర్‌లో ఎదుర్కొన్న విజిల్‌బ్లోయర్‌ లేఖను కంపెనీ, పబ్లిక్‌తో పంచుకోలేదనే ఆరోపణలను కంపెనీ లీగల్‌ టీం గురువారం తిప్పికొట్టింది. అంతర్గత విజిల్‌ బ్లోయర్‌ పాలసీ ఆధారంగా కంపెనీ అన్ని నిబంధనల్ని పాటిస్తోందని లీగల్‌ టీంలోని న్యాయవాదులు తెలిపారు. అంతేకాకుండా విజిల్‌ బ్లోయర్‌ ఫిర్యాదులోని అంశాల ఖచ్చితత్వాన్ని పరిశీలించకుండా, ఈ ఫిర్యాదును పబ్లిక్‌కు విడుదల చేస్తే కంపెనీ, మైనార్టీ ఇన్వెస్టర్లు నష్టపోతారని అభిప్రాయపడ్డారు. కాగా ఇన్ఫోసిస్‌ షేరు అక్టోబర్‌ నెలలో

డివిడెండ్‌ టాక్స్‌ ఇన్వెస్టర్లకి మళ్లింపు?

Thursday 14th November 2019

ఇప్పటివరకు కంపెనీలు చెల్లిస్తూ వస్తున్న డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ టాక్స్‌(డీడీటీ)లో మార్పులు తీసుకురావాలని  ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పన్ను సరళీకరణలతో విదేశీ నిధులను ఆకర్షించాలని ఇటీవలి కాలంలో ప్రభుత్వం పలు చర్యలు ప్రకటిస్తూ వస్తోంది. వీటిలో భాగంగా రాబోయే బడ్జెట్లో డీడీటీని డివిడెండ్‌ పొందిన వాటాదారులకు చెల్లించిన తర్వాత వసూల చేసేలా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిసింది. ఇప్పటివరకు డీడీటీని కంపెనీలే చెల్లిస్తూ వస్తున్నాయి. తాజా మార్పు విషయాన్ని

Most from this category