News


ఈక్విటీలంటే భయామా..? అయితే సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను కొనండి.!

Wednesday 23rd October 2019
Markets_main1571817764.png-29082

భవిష్యత్తులో ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగవచ్చనే ఆందోళన వ్యక్తం చేసే ఇన్వెస్టర్లు సావరిన్‌ పసిడి బాండ్లను కొనుగోలు చేయవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు సలహానిస్తున్నారు. స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు పసిడి స్పాట్‌, ఫ్యూచర్ల ర్యాలీ నుంచి వచ్చే లాభాల కంటే ఎక్కువ రాబడులను సావరిన్‌ బాండ్లు ఇస్తాయని విశ్లేషకులంటున్నారు. ‘‘ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు అతిగా అంచనా వేయబడ్డాయి. ఈ తరుణంలో ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోలో పసిడిని జోడించుకోవడం మంచిది.’’ అని ఆశికా వెల్త్‌ అడ్వెజైర్‌ అమిత్‌ జైనా తెలిపారు. 

ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో 5-10 శాతం పసిడి కలిగి ఉండాలని వెల్త్‌ మేనేజర్లు భావిస్తున్నారు. సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూతో సున్నా వ్యయ నిష్పత్తి ఉంటుంది. కాబట్టి ఈ మార్గాన్ని ఉపయోగించడం మంచిది. ఏడాదికి 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. పైగా మెచ్యూరిటీ వరకు అట్టిపెట్టుకుంటే మూలధన లాభాలపై పన్ను మినహాయింపు ఉటుంది.  అయితే, ఈ బాండ్లలో ద్రవ్యత లభ్యత అధికంగా లేనందున ఇన్వెస్టర్లు దానిని ‘‘అత్యవసర సమయాల్లో కేటాయింపు’’ల్లో ఉంచకుండా జాగ్రత్త వహించాలని వారు సూచిస్తున్నారు.

దీపావళి పండుగ సందర్భంగా పసిడికి డిమాండ్‌ పెరగవచ్చనే అంచనాలు, ఈక్విటీ మార్కెట్లో కొనసాగుతున్న అస్థిరతలతో పసిడికి డిమాండ్‌ నెలకొంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే దిశగా కేంద్రం  ఈ అక్టోబర్‌లో రెండోసారి సావరిన్‌ పసిడి బాండ్ల 2019-20 - సిరీస్‌-6 ఇష్యూను పథకాన్ని ప్రకటించింది.  2019-20 - సిరీస్‌-6 ఇష్యూ ఈ నెల 21న ఆరంభం కాగా, నెల 25న వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఈ నెల 7 నుంచి 11 వ తేదీ వరకు సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2019-20 - సిరీస్‌-5 ఇష్యూను పూర్తి చేసుకన్న సంగతి తెలిసిందే. 

సౌర్వభౌమ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2019-20 - సిరీస్‌-6 కింద ఒక గ్రాము పసిడి ఇష్యూ ధరను రూ.3,835గా ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసి, డిజిటల్‌ రూపంలో చెల్లింపులు చేసే వారికి ఒక గ్రాముపై రూ.50ను తగ్గింపు ఉంటుంది. సావరిన్‌ బాండ్ల మెచ్యూరిటీ కాలపరిమితి ఎనిదేళ్లు. అయితే సబ్‌స్క్రైబర్లు 8ఏళ్ల కంటే ముందుగానే పథకం నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. 

గత ఏడాది కాలంలో పసిడి 19.31శాతం మాత్రమే ఆదాయానిచ్చిన్నప్పటీకీ.., పసిడి పాజిటివ్‌ అవుట్‌లుక్‌ను కలిగి ఉందని వెల్త్‌ మేనేజర్లు విశ్వసిస్తున్నారు.  ఉత్తమ అసెట్స్‌లో పసిడి ముందుంటుందనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల, ఐదేళ్ల కాలవ్యవధిలో పసిడి వరుసగా 6.94శాతం, 5.68శాతం పెరిగింది. You may be interested

21.69% పెరిగిన బజాజ్‌ ఆటో నికర లాభం!

Wednesday 23rd October 2019

  బజాజ్‌ ఆటో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో స్టాండ్‌ఎలోన్‌ నికర లాభాన్ని  రూ. 1,402.42 కోట్లుగా ప్రకటించింది. ఇది గతేడాది రూ. 1,152.48 కోట్లు కంటే 21.69 శాతం అధికం కావడం గమనార్హం. ఈ లాభం రూ. 1,150 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు అంచనావేశారు.     కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో బజాజ్‌ ఆటో పన్ను వ్యయం సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ. 206.49 కోట్లకు

కోటక్‌ బ్యాంకుపై బ్రోకరేజ్‌ల మిశ్రమ స్పందన

Wednesday 23rd October 2019

సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం కోటక్‌ మహీంద్రా బ్యాంకుపై బ్రోకరేజ్‌లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నాయి. క్యు2లో బ్యాంకు బలమైన ప్రాఫిట్‌గ్రోత్‌ నమోదు చేసినా, ఆస్తుల నాణ్యత మాత్రం క్షీణించింది. ఈ నేపథ్యంలో బ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి... - క్రెడిట్‌ సూసీ: న్యూట్రల్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1450. బ్యాంకు ఎర్నింగ్స్‌ వృద్ధి మందగించింది. ఎన్‌ఐఎం పెరగడం పాజిటివ్‌ అంశం. ప్రస్తుతం తన ఫార్వర్డ్‌ పీబీ విలువకు

Most from this category