News


భౌతిక బంగారం కంటే సావరిన్‌ బాండ్లే ఉత్తమం..!

Tuesday 14th January 2020
Markets_main1578996610.png-30925

సంపద సముపార్జనలో లాభం కంటే ముందు భద్రత ముఖ్యం. అని భావించేవారు సాధారణంగా బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి వాతావరణంలో బంగారంలో పెట్టుబడులు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భౌతిక బంగారం కంటే సావరిన్‌ పసిడి బాండ్లు అధిక రాబడినిస్తున్న కారణంగా ఈ బాండ్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా సావరిన్‌ బాండ్ల ధరలు ఇటీవల రికార్డు స్థాయిని అందుకున్నాయి. 

సావరిన్‌ పసిడి బాండ్ల 2019-20 సిరీస్‌ VIII సబ్‌స్క్రిప్షన్‌ నేడు ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదిన జనవరి 17గా ఉంది. ఈ బాండుకు గ్రాము బంగారం ధర రూ.4,106గా నిర్ణయించారు. అయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని డిజిటల్‌ విధానంలో బాండ్‌ కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం రూ.50ల మినహాయింపునిస్తుంది. అంటే ఆన్‌లైన్‌లో సబ్‌స్ర్కయిబ్‌ చేసుకొనే చందాదారులకు గ్రాము బంగారం ధర రూ.3966 వద్ద అందుబాటులో ఉంటుంది. 

ఇన్వెస్టర్లకు అదనంగా 2.05శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఖర్చు వ్యయం, నిల్వ వ్యయం లాంటి అదనపు ఛార్జీలు లేనందున సావరిన్‌ బాండ్లు... ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌), భౌతిక బంగారంపై వచ్చే ఆదాయాల కంటే ఎక్కువగా లాభాల్ని సమకూరుస్తాయని సావరిన్‌ బాండ్లు కొనుగోలు చేసే వారికి ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వెజర్స్‌ ఫౌండర్‌ అభిషేక్‌ సంఘ్వీ సలహానిస్తున్నారు. 

సావరిన్‌ బంగారం బాండ్ల మెచ్యూరిటీ కాలం 8ఏళ్లుగా ఉంటుంది. బంగారం ధర సబ్‌స్క్రిప్షన్‌ ముందు వారం చివరి మూడు పనిదినాల్లో ఉన్న ధరకు సగటుకు లెక్కించి ధర నిర్ణయిస్తారు. జారీ చేసిన తేదీ నుంచి 5వ సంవత్సరంలో విత్‌డ్రా చేసుకోవచ్చు. విత్‌డ్రా చేసే సమయానికి ఉన్న బంగారం ధరల ఆధారంగా రాబడి ఉంటుంది. ద్రవ్యత తక్కువగా ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు విక్రయించే అవకాశం ఉన్నందున స్టాక్ ఎక్చ్సేంజ్‌లో విక్రయం చేయవచ్చు.

‘‘ఇరాన్‌-అమెరికా మధ్య భౌగోళిక ఉ‍ద్రిక్తతలు కొనసాగుతుండటం, అమెరికా చైనాల మధ్య వాణిజ్య సమస్యలకు పరిష్కార మార్గం ఇప్పటికీ లభించకపోవడం తదితర కారణాలతో కేంద్ర బ్యాంకులు అధిక మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ఈ కాలెండర్‌ ఏడాదిలో పసిడి ధరలు మరో 5శాతం పెరిగే అవకాశం ఉంది.’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ అసోసియేట్‌ డైరెక్టర్ కిషోర్‌ నార్నే తెలిపారు. 

గడచిన ఏడాది కాలంలో రక్షణాత్మకంగా భావించే అన్ని ఆస్తుల్లో బంగారం ధర ఏకంగా 22శాతం పెరిగింది. ఇదే కాలంలో సెన్సెక్స్‌ 16.25శాతం ర్యాలీ చేయగా, లిక్విటీ ఫండ్‌ 6.27శాతం లాభాల్ని ఇన్వెస్టర్లకు పంచాయి. బంగారం ధర గడిచిని మూడేళ్లలో 10.05శాతం, ఐదేళ్లలో 6.73శాతం ఆదాయాల్ని ఇన్వెస్టర్లకు అందించాయి.

రూపాయి బలహీనపడటం, అంతర్జాతీ అనిశ్చితిల్లో రక్షణాత్మక సాధనంగా భావించే బంగారానికి ఇన్వెస్టర్లు తన ఫోర్ట్‌ ఫోలియోలో 5-10 వరకు కేటాంచాలని వెల్త్‌ మేనేజర్లు తన క్లయింట్లలకు సలహానిస్తుంటారు. ఈక్విటీ, స్థిర ఆదాయం వంటి ఇతర ఆస్తి తరగతులతో తక్కువ సంబంధం ఉన్నందున పోర్ట్‌ఫోలియో వైవిధ్యీకరణకు బంగారం సహాయపడుతుంది. You may be interested

మరో కొత్త రికార్డు ముగింపు

Tuesday 14th January 2020

సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త గరిష్టాలకు ఇంట్రాడేలో 42,000 సమీపానికి సెన్సెక్స్‌ 12,374 వద్ద నిఫ్టీ ఇంట్రాడే గరిష్టం ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ వెనకడుగు అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనున్న పరిస్థితులు అటు అమెరికా ఇండెక్సులతోపాటు..ఇటు దేశీ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో సోమవారం అమెరికా మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధించగా.. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. సెన్సెక్స్‌ 93 పాయింట్లు పెరిగి 41,953 వద్ద నిలవగా.. నిఫ్టీ 33 పాయింట్లు

ఇండస్‌ఇండ్‌ నికర లాభం 32% అప్‌

Tuesday 14th January 2020

షేరు హెచ్చుతగ్గులు పెరిగిన వడ్డీ ఆదాయం తగ్గిన మొండిబకాయిలు ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఇండస్‌ఇండ్‌ నికర లాభం 32 శాతం ఎగసి రూ. 1300 కోట్లను అధిగమించింది. ఇందుకు ప్రధానంగా వడ్డీ ఆదాయం పుంజుకోవడం, పన్ను వ్యయాలు తగ్గడం వంటి అంశాలు సహకరించాయి. వార్షిక ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం(NII) సైతం 34 శాతం పెరిగి రూ. 3074

Most from this category