News


బంగారం ఎందుకంత ఖరీదు?!

Monday 4th November 2019
Markets_main1572863652.png-29338

  • నానాటికీ పెరుగుతున్న ధర
  • చిన్నపాటి విరామాలతో అప్‌ట్రెండే శాశ్వతం
  • నిపుణుల అంచనా

 

 

పసిడి... ,, 

పురాతన కాలం నుంచి ప్రస్తుతకాలం వరకు ఏమాత్రం వన్నె తగ్గని, ఆకర్షణ కోల్పోని లోహం...

వ్యక్తి లేదా దేశ ఆర్థిక సంపన్నతకు చిహ్నం...

బంగారం కన్నా విలువైన లోహాలు అనేకం కనుగొనొచ్చు కానీ సామాన్య ప్రజానీకానికి సైతం తెలిసిన, అందుబాటులో ఉండే విలువైన లోహం మాత్రం పసిడే! అసలెందుకు ఈ పుత్తడికి ఇంత ఆకర్షణ.. ఎందుకీ లోహం ఇంత ఖరీదు...? ప్రాచీనకాలం నుంచి ప్రస్తుత కాలం వరకు సామాన్యులకైనా, సంపన్నులకైనా ఆభరణాలకు కావాల్సిన వస్తువు కాబట్టే దీనికి ఇంత డిమాండ్‌ అని చాలా మంది భావిస్తుంటారు. కానీ కేవలం జిగేలుమనిపించే ఆభరణాలకే కాదు, బంగారం చాలా రంగాల్లో ఉపయోగపడుతుంది. అందుకే ఈ లోహానికి ఎప్పటికీ డిమాండ్‌ తగ్గదు. 
ఇంతకీ బంగారం ఎలా ఉద్భవించింది..? దీనివల్ల ఇతర ఉపయోగాలేంటి...? దీని ధర ఇంకా పెరుగుతుందా..? తదితర వివరాలు చూద్దాం...
- బిగ్‌బ్యాంగ్‌ తర్వాత దశల్లో రెండు న్యూట్రాన్‌ నక్షత్రాల సంపీడనం వల్ల బంగారం ఉద్భవించిందని ఆధునిక భౌతిక శాస్త్రం చెబుతోంది. ఇలా ఆవిర్భవించిన బంగారం గ్రహశకలాల మీదకు చేరి, అవి భూమిని ఢీకొన్న తరుణంలో అవనిపైకి అడుగుపెట్టింది. ఇదంతా జరిగి దాదాపు 390 కోట్ల సంవత్సరాలయి ఉండొచ్చని అంచనా. ఆ సమయంలో బంగారం భూ అంతర్భాగంలో ఉండేది, తర్వాత దశల్లో క్రమంగా భూ ఉపరితల పొరల్లోకి చేరింది. 


- పేలియోలిథిక్‌ యుగంలో బంగారం గురించి మనిషికి తెలిసినట్లు నాటి గుహా చిత్రాలు చెబుతున్నాయి. తర్వాత దశల్లో బంగారాన్ని కరెన్సీగా వాడడం మొదలైంది. అలాగే ఆభరణాలుగా, కట్టడాలకు తాపడంగా వినియోగించేవారు.
- బంగారం చాలా అరుదైన లోహం. సామాన్య వాతావరణ పరిస్థితుల్లో తొందరగా పాడవదు. దీని జిగేల్‌మనిపించే తత్వం కంటికి తొందరగా ఆకట్టుకుంటుంది. దీని పరమాణు సంఖ్య 79. దీన్ని నోబులెస్ట్‌ ఆఫ్‌ నోబుల్‌ మెటల్స్‌గా పిలుస్తారు.


- పసిడి అత్యుత్తమ విద్యుత్‌వాహకం. తుప్పు పట్టదు. ఎలక్రి‍్టక్‌ పరికరాల తయారీలో వాడతారు. వ్యోమోనౌకలు పనిచేయడంలో, వ్యోమోగాముల సూట్లలో బంగారం ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత, పరారుణ కిరణాల నుంచి రక్షిస్తుంది. 
- ఆభరణాల తయారీకే కాకుండా, ఒక ఉత్పత్తికి విలువ కలపేందుకు బంగారం ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక మామూలు ఫోన్‌ కన్నా, బంగారం కోటింగ్‌ వేసిన ఫోన్‌కు ఆకర్షణ, ఖరీదు రెండూ ఎక్కువే!
- బంగారాన్ని ఔషధాల్లో వాడడం అప్పుడెప్పుడో ఆయుర్వేద కాలం నుంచి ఇప్పటి అలోపతి వరకు కొనసాగుతోంది.


- 1792 చట్టం తర్వాత యూఎస్‌ డాలర్లలో బంగారానికి ఒక స్థిర ధరను నిర్ణయించడం మొదలైంది. ఆ తర్వాత శతాబ్దంలో యూఎస్‌లో బంగారం ఆధునిక మైనింగ్‌ జోరందుకుంది. 
- పుత్తడి గనులను కనిపెట్టడం తర్వాత మైనింగ్‌ చేయడం చాలా కష్టమైన, క్లిష్టమైన ప్రక్రియలు. ఒక్కోసారి ఒక గని కనిపెట్టాలంటే జియాలజిస్టుకే పదేళ్లు పడుతుంటుంది. 
- కనుగొన్న గని, ఉత్పత్తికి అనుకూలమా? కాదా? తేల్చేందుకు ఇంకా సమయం పడుతుంది. చాలాసార్లు కనుగొన్న గనుల్లో ఉత్పత్తికి పనికి వచ్చేవి 0.1 శాతం కన్నా తక్కువగా ఉంటాయి. ఇక ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా మైనింగ్‌ ఇంకా సంక్లిష్టంగానే ఉంటుంది.


- ఇంత చేస్తే అసలు భూమి మీద వాడుకలో ఉన్న మొత్తం బంగారం ఎంతో తెలుసా? కేవలం 1.9లక్షల టన్నులే! దీన్ని భూమి మీద ప్రతి ఒక్కరికి సమానంగా పంచితే సుమారు తలా ఒక ఔన్సు వస్తుంది. అంటే సుమారు ఒక్కొక్కరికి 1500 డాలర్లన్నమాట. మన లెక్కలో సుమారు రూ. లక్ష. 
- ఈ 1.9 లక్షల టన్నుల్లో అధికభాగం, సుమారు 50 శాతం ఆభరణాల రూపంలో ఉంది. తర్వాత సుమారు 20 శాతం ప్రైవేట్‌ పెట్టుబడుల రూపంలో(బిస్కెట్లు, కడ్డీలు, నాణేలు, ఎక్చేంజ్‌ ట్రేడెడ్‌ఫండ్స్‌లో వాటాల కింద.. తదితరాలు) ఉంది. 17 శాతం ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉంది. ఇక పారిశ్రామికంగా, టెక్నాలజీలో 13 శాతం వినియోగంలో ఉంది. 
- పోను పోను పసిడి లభ్యత తరిగిపోతోంది. వినియోగం పెరిగిపోతోంది. జియోలజిస్టుల అంచనా ప్రకారం ఇంక కేవలం 55 టన్నుల బంగారమే గనుల్లో అందుబాటులో ఉంది. అంటే మైనింగ్‌ ఇదే ఊపులో కొనసాగితే మరో 20 ఏళ్లకు తవ్వేందుకు బంగారం ఉండదన్నమాట! 


సో.. డిమాండ్‌ సప్లై సూత్రం ప్రకారం రాబోయే రోజోల్లో బంగారానికి డిమాండ్‌ మరింత పెరిగి, ధర కూడా మరింతగా దూసుకుపోవచ్చన్నది నిపుణుల అంచనా. ఇంత కధ ఉంది కాబట్టే, ఈ జిగేలు లోహం ఇంత ధర పలుకుతోంది!! You may be interested

మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ కొంటున్నాం...కొటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌

Monday 4th November 2019

‘సెంటిమెంట్‌, లిక్విడిటీ సానుకూలంగా ఉండడంతో మార్కెట్‌లు కదులుతుంటే, ఇన్వెస్టర్లు కొన్ని స్టాకులకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. ప్రాథమిక అంశాలు వీటిపై ఎటువంటి ప్రభావం చూపనప్పటికి, మార్కెట్‌ కదలికల్లో భాగంగా ఇవి కదులుతుంటాయి’ అని కోటక్‌ ఏఎంసీ, సీఐఓ ఈక్విటీ, హర్ష ఉపాధ్యాయ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. స్వల్ప కాలం కోసం వద్దు.. కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గడంతో మార్కెట్‌లో లిక్విడిటీ, సెంటిమెంట్‌ మెరుగుపడింది. ప్రాథమిక అంశాలు

సెన్సెక్స్‌ రికార్డు ముగింపు

Monday 4th November 2019

రాణించిన మెటల్‌, ఐటీ షేర్లు కలిసొచ్చిన అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్‌ ఏడోరోజూ లాభంతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం, ఇప్పటి వరకు కంపెనీలు వెల్లడించిన రెండో క్వార్టర్‌ ఫలితాలు మార్కెట్‌ను మెప్పించడం తదితర కారణాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీ షేర్ల ర్యాలీ

Most from this category