News


చమురుపై హరికేన్‌ ప్రభావం!

Friday 30th August 2019
Markets_main1567139544.png-28101

కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌ వలన అంతర్జాతీయ వృద్ధి, చమురు డిమాండ్‌ ఆందోళనలు పెరుగుతున్నాయి. ఫలితంగా చమురు ధరలు శుక్రవారం ట్రేడింగ్‌లో(ఉదయం 0050 జీఎంటీ(గ్రీనిచ్‌ మీన్‌ టైం) సమయానికి) తగ్గాయి. యుఎస్‌ చమురు నిల్వలు గత వారం అంచనాల కంటే అధికంగా తగ్గడంతో పాటు హరికేన్‌ ఫ్లోరిడా వైపు కదులుతుండడంతో యుఎస్‌ క్రూడ్‌ ధరలు గత వారం 4 శాతం మేర పెరిగాయి. కాగా శుక్రవారం ట్రేడింగ్‌లో యుఎస్‌ క్రూడ్‌ 0.1 శాతం తగ్గి బ్యారెల్‌ 56.65 డాలర్లకు చేరుకోగా, గురువారం 1 శాతం పెరిగిన బ్రెంట్‌ క్రూడ్‌, శుక్రవారం ట్రేడింగ్‌లో 0.2 శాతం తగ్గి బారెల్‌ 60.98 డాలర్లకు చేరుకుంది. 
   ట్రేడ్‌వార్‌ వలన అంతర్జాతీయ వృద్థి, చమురు డిమాండ్‌ ఆందోళనలు పెరుగుతున్నాయి. ఫలితంగా చమురు లాభాలు పరిమితంగా ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు. యుఎస్‌-చైనాకు మధ్య సెప్టెంబరులో  జరగనున్న ముఖాముఖి వాణిజ్య చర్చల కోసం వేచి చూస్తున్నామని, అమెరికా చర్చలకు అనుకూలమైన  వాతావరణాన్ని సృష్టిస్తేనే వాణిజ్య చర్చలలో పురోగతి ఉంటుందని గురువారం చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతోపాటు ఫ్లోరిడా వైపు కదులుతున్న డోరియన్ హరికేన్ వచ్చే వారాంతంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోకి ప్రవేశిస్తే ఆఫ్‌షోర్ యుఎస్ క్రూడ్‌ ఉత్పత్తి మందగించవచ్చని ఉత్పత్తిదారులు ఆందోళన చెందుతున్నారు. డోరియన్ ఈ వారాంతంలో ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరం వైపు కదిలే అవకాశం ఉందని, వచ్చే వారం తూర్పు గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోకి ప్రవేశించవచ్చని, ఈ హరికేన్‌ ఆదివారం అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ 4 హరికేన్‌గా బలోపేతం అవుతుందని అంచనా వేసినట్లు యుఎస్‌ నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. గత నెలలో, భారీ హరికేన్ వలన ఆఫ్‌షోర్‌ చమురు కంపెనీలు తమ ఉత్పత్తిలో 74 శాతం మూసివేసిన విషయం తెలిసిందే. ఫలితంగా అప్పుడు యుఎస్‌ క్రూడ్‌ ధరలు పెరిగాయి.  దిగుమతులు మందగించడంతో యుఎస్ క్రూడ్‌ నిల్వలు గత వారం 100 లక్షల బారెల్స్ తగ్గి గత ఏడాది అక్టోబర్ తర్వాత కనిష్ట స్థాయికి చేరుకున్నాయని ప్రభుత్వ డేటా బుధవారం పేర్కొంది. అదే విధంగా గ్యాసోలిన్, డిస్టిలేట్‌ నిల్వలు 20 లక్షల బారెల్స్ పడిపోయాయని ఈ డేటా తెలిపింది. 



You may be interested

డాలర్‌ ఎఫెక్ట్‌: నష్టాల్లో పసిడి

Friday 30th August 2019

డాలర్‌ ఇండెక్స్‌ నెలగరిష్టానికి చేరుకోవడంతో పాటు అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో పసిడి ధర శుక్రవారం స్వల్పంగా నష్టపోయింది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 6 డాలర్లు నష్టపోయి 1,531 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సెప్టెంబర్‌1 నుంచి 300 బిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై అమెరికా విధించబోయే అదనంగా 5శాతం పన్ను విధింపు అంశంపై అమెరికా వాణిజ్య అధికారులతో

లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌

Friday 30th August 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్‌ శుక్రవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 153 పాయింట్లు లాభంతో 10,987.80 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు లాభంతో 10,987.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా మార్కెట్లు వరుసగా రెండురోజూ లాభాల్లో ముగియడంతో పాటు, నేడు ఆసియాలో పలు ప్రధాన సూచీలు పాజిటివ్‌ ట్రేడ్‌ అవుతుండటం, అంతర్జాతీయంగా సెంటిమెంట్‌ కొంత మెరుగైంది. నేడు సెప్టెంబర్‌ నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్ట్స్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రేడర్లు కొత్త పొజిషన్లు

Most from this category